యుఐ ది మూవీ(Ui the Movie): భారతీయ చిత్ర పరిశ్రమలో ఉపేంద్రకు ఉన్న క్రేజ్, ఆయన డీల్ చేసే సబ్జెక్టులకు ఉన్న ఫాలోయింగ్ సాధారణమైనది కాదు. ఆయన(Ui Movie Dialogues) కల్ట్ టేకింగ్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల విడుదలైన యుఐ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ, ఉప్పి స్టైల్ డైలాగ్స్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
ఎక్కువగా సమాజం, మనుషుల్లోని హిపోక్రసీ గురించి తన సంభాషణలతో తూటాలు వదిలిన ఉపేంద్ర, సినిమా ప్రారంభంలోనే చాచిపెట్టి కొట్టేలాంటి కొన్ని వాక్యాలు తెరమీద చూపించాడు. వాటికే గాయాలపాలైన ప్రేక్షకులు, మిగిలిన డైలాగులకూ ఉక్కిరిబిక్కియ్యారు. వాటిలోని కొన్ని డైలాగులు కొన్ని మీకోసం ఇక్కడ ఇస్తున్నాము. అయితే అన్నింటి కంటే ముందుగా, సినిమా ప్రారంభంలో తెరమీద ప్రత్యక్షమైన ఆ డైలాగులను మీరు చూడండి.

IF you are an intelligent, get out of the theatre right now!
If you are a fool, watch the entire movie!
The intelligent people appear to be fools fools pretend to be intelligent people
Ui Movie Dialogues
చదివేశారు కదా, మరి మిగిలిన డైలాగ్‌లు వినడానికి కూడా మైండ్‌ను సిద్ధం చేసుకున్నారా, ఎందుకంటే యుఐ సినిమా చూశాక ఫోకస్ వచ్చిన భార్యభర్తల మధ్య సంభాషణ ఎలాంటిదో చెప్పే డైలాగ్ ఇది, దయచేసి ఇది చదివాక మూర్ఛపోవద్దు.
“పెళ్లి కొడుక్కి మేటరే లేదని చెప్పావంటే, నీకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉందని అర్థం”.
ఉపేంద్ర ఈ సినిమాలో తన తల్లిని ప్రకృతిగా వర్ణించాడు. ప్రకృతికి జరుగుతున్న అన్యాయాన్ని స్క్రీన్ మీద చాలా కవితాత్మకంగా వర్ణించాడు. దానికి ప్రాణం పోసిన డైలాగ్‌లు ఇక్కడ ఉన్నాయి:
“యాపిల్‌ని ఈవ్ కొరక్కముందున్న,అమాయకమైన మనసున్న సర్వసుందర సుఖమైన ప్రపంచం, వద్దు, ఇది చెయ్యొద్దు, తప్పు అనేది మనుషుల(Ui Movie Dialogues) మనసుల్లో భయం, ఆశ, కుతూహలం పుట్టించి, అదే ఆలోచనగా మారి, ఈ యాపిల్‌ను కొరికేంత వరకు ఆ మనిషి ఆలోచనా శక్తి విస్ఫోటనం చెందింది. కులాలు, మతాలతో నానాటికీ దిగజారిపోతున్న మనుషుల్లోని పతనాన్ని, కలియుగానికి సూటయ్యేలా రాసిన డైలాగ్ ఇది:
“ఈ ప్రపంచంలో పుట్టిన ఎంతోమంది దేవుళ్లు… ధర్మాలు, గురువులు, ప్రాంతాలు, రంగులు, కులాలు, గ్రూపులు, చావులు, కులాలు, ప్రాంతానికి తగ్గట్లు వేర్వేర అభిరుచులు, ఆచారాలు, వ్యవహారాలు, నృత్య, సంగీత, సాహిత్య, నాటక, సంస్కృతి, విద్యాది, వైవిధ్యమైన కళలు… అనంతరం వ్యాపారంగా మారి, ఆ వ్యాపారమే ద్రోహచింతనగా మారాక, ఆ చింతనలే తీవ్ర స్పర్థలుగా మారాక, భద్రత,రక్ణణ అన్న పేరుతో సర్వనాశనం చేసే ఆయుధాల ఆవిష్కరణ నుంచి, ద్వేషం..ఆ ద్వేషం వల్ల దేశాల మధ్య యుద్ధం, హింస నుండి బయటపడ్డ ఒక్కొక్కరికీ వేర్వేరు దేశ, భాష, కీడు, మేలు, ఉన్నోడు, లేనోడు, పేదోడు, శ్రీమంతుడు అనే విభజన జరిగాక, మానవజాతి ఈ ఉత్తేజకరమైన ప్రయాణాన్ని ఒకే ఫ్రేములో కట్టేయడానికి చేసిన ప్రయాణమే ఈ కథ.
” అందరూ స్వార్థంగా, మన ప్రకృతి అమ్మని సామూహికంగా అత్యాచారం చేశారు. సర్వం కోల్పోయాక మనిషిని మించిన మానవ మృగమే లేదు.”
కలియుగం గురించి మన పురాణాల్లో వర్ణించారు. అది ఎలా ఉంటుందో కూడా స్పష్టంగా చెప్పారు. అయితే, ఉప్పి దాన్ని సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి, కలియుగం స్టేజ్‌లో ఉన్నప్పుడు మన ప్రపంచం ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రయత్నించారు. దానికి నిర్వచనం ఇస్తూ హీరో చెప్పిన డైలాగ్ ఇది:

“జనానికి ఒకరు సంతోషమిస్తున్నారు, సత్యం మిథ్య అయినప్పుడు….. దోపిడీ దొంగలే చరిత్రగా మారినప్పుడు వర్తమాన సత్యం కన్నా భవిష్యత్తు గాలిగోపురంపై కూర్చొన్నవాడు గురువయ్యాక గురువుల హవా మొదలై… ఆలోచించే మనసు నిర్జీవమయ్యాక… అరిషడ్వర్గాలు విలయతాండవం చేశాక…జనసంఖ్య పోటెత్తాక… అదే కలియుగం… సత్యయుగాన్ని తీసుకురావడానికి పుట్టిన హీరో, ప్రజల్లో మార్పు కోసం అనుసరించే వైవిధ్య మార్గం మనకి కోపం తెప్పిస్తుంది, అసహనానికి గురి చేస్తుంది, కానీ వేరెవరో తప్పుని, తన మీద వేసుకుని దెబ్బలు తినే హీరోకి ఎలివేషన్ ఇచ్చే డైలాగ్‌ను ఓ సామాన్య మనిషితో ఉప్పి చెప్పించారు:
“నలుగుర్ని కొట్టి బిల్డప్ ఇచ్చే ఈ కాలంలో… అదే నలుగురు కోసం కొట్టించుకోడానికి దమ్ము, ధైర్యం, గుండె ఉన్నవాడేరా నిజమైన హీరో”.
ఇది పక్కాగా నిబ్బా, నిబ్బీలను టార్గెట్ చేసి రాసిన డైలాగ్. చాలా మంది కాళ్లూ, చేతులు బాగున్నా కూడా బతకడానికి ధైర్యం లేదనే కారణం(Ui Movie Dialogues) చెప్పి చచ్చిపోతుంటారు. ముఖ్యంగా ప్రేమ కోసం చచ్చిపోయే పిచ్చివాళ్లు ఉంటారు. అలాంటి వాళ్ల హిపోక్రసీని స్పష్టంగా చెప్పే డైలాగ్ ఇది.
బతకడానికి ధైర్యం రాదు గానీ, చచ్చిపోవడానికి ధైర్యం ఉంటుంది అని ఎత్తిపొడవడమే ఈ డైలాగ్ ముఖ్య ఉద్దేశం:
నో అనిపించుకుని బతకడం కన్నా నాకు చావడం ఈజీ, కానీ చచ్చేంత ధైర్యం వస్తుంది కదా…అప్పుడు చెప్పే చస్తా.. ఇదే స్టైల్‌లో ఇంకో డైలాగ్ కూడా ఉంది, అది:
“నా ఇష్టానికి తద్దినం పెట్టాడు, నా ప్రేమకు పిండం పెట్టాడు“.
ఈ డైలాగ్ విన్నప్పుడు నవ్వు తెప్పిస్తుంది, కానీ మనసు లోతుల్లో ఎక్కడో మెలిపెట్టే ఫిలాసఫీ డైలాగ్ ఇది:
“కామంతో బిడ్డను కని, కామం చెడ్డదని చెప్తారా? ఎక్కువ మంచి చేస్తే మోక్షం కలుగుతుందని చెప్తారా.. మీరు చెప్పే కర్మ సిద్ధాంతం ప్రకారం, తప్పు చేయకపోతే మీరు పుట్టుండేవారే కాదు…తప్పు చేస్తే పుట్టారు, మంచి చేయడానికి చావకండి, నేనే చంపేస్తా”.
హీరో తిక్కకి ఇది కరెక్ట్‌గా సూటయ్యే డైలాగ్, కాకపోతే హీరోలోని విలన్ ఈ డైలాగ్ చెప్తాడు.
“కలియుగంలో మంచోళ్లకు మంచి రోజులు ఉండవు, వాళ్లే ఎక్కువ కష్టాలు పడతారు, చెడ్డవాళ్లే ఎక్కువ సుఖాలు పొందుతారు” అని అర్థమొచ్చేలా రాసిన డైలాగ్ ఇది. బాగా మంచోళ్లనిపిస్తే ఆన్ ది స్పాట్ చంపేస్తా ఇదే సరళిలో ఇంకొన్ని సంభాషణలు కూడా ఉన్నాయి, వాటిని కూడా చదివి, హిపోక్రసీ గురించి హీరో వదిలిన బాణాలను తెలుసుకోండి:
అన్‌నోన్ క్యారెక్టర్: స్వార్థం చెడ్డది సార్, సదా ఎదుటివాడి మంచికోసమే బతకాలి. పరోపకారార్థం ఇదం శరీరం.
విలన్: నాకు (ఈ చెంప దెబ్బ) సౌండ్ వింటే సంతోషంగా ఉంటుంది, నా సంతోషం కోసం మీరు ఇక్కడే ఉంటారా మాస్టారూ? కమర్షియల్ సినిమా హీరోలంటే ప్రజలకు ఉన్న క్రేజ్‌పై వేసిన సెటైర్ ఇది,
క్రైమ్‌ను ప్రోత్సహించే హీరోల సినిమాలకు వస్తున్న కలెక్షన్లపై సెటైర్ వేస్తూ రాసిన డైలాగ్ అది.
“ఫ్యామిలీ హీరో అవ్వాలని ట్రై చేయకు, కమర్షియల్ మాస్ హీరో అవ్వు, గొడ్డలి తీసుకుని నరికేయ్. స్టార్ అయ్యి ఖుషీగా బతుకు”.
విలన్‌ను టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్న ఓ అమ్మాయిని ఉద్దేశించిన డైలాగ్ ఇది:
“పండు కొరక్క ముదు, ఆడది పైట జార్చకముందు విలువ ఎక్కువ, గుర్తుపట్టుకోండి.“
అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ ఉత్తమమైనది అని ఓ వేదాంతి చెప్పినప్పుడు, ఇన్ని లుచ్చా పనులు చేసే మనిషి జన్మ ఎలా గొప్పది అవుతుందని ప్రశ్నిస్తూ విలన్ వదిలే డైలాగ్ ఇది:

“జంతువులు ఆకలేస్తేనే తింటాయి, సీజన్ వస్తేనే సెక్స్ చేస్తాయి, మనిషి కడుపు నిండాక కూడా ఇంకా కావాలంటాడు, వాడి అత్యాశకు అంతే లేదు. మనుషుల సెక్స్‌కి సీజన్స్ లేవు, అన్ని సీజన్లలో సెక్స్ చేస్తూనే ఉంటాడు, అదీ చాలక అత్యాచారాలు, రేప్‌లు. ఆ జంతు ప్రపంచంలో రేప్‌లు, మర్డర్లు, యాసిడ్ అటాక్‌లు, జాతులు, ధర్మాలు, మంచీ, చెడూ, చిన్నా, పెద్దా, పాలిటిక్స్ ఇవేవీ ఉండవు, ఇప్పుడు చెప్పు మనిషి గొప్పా, జంతువు గొప్పా? “
జనాల్లో ఉండే కన్ఫ్యూజన్‌తో ఆడుకోవడమంటే ఉపేంద్రకు మహాసరదా, ఈ డైలాగ్స్ వచ్చినప్పుడు థియేటర్ అంతా కేకలే, ఎందుకంటే తమ మీదనే డైరెక్టర్ నేరుగా సెటైర్లు వేస్తున్నాడని జనాలకి అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు కూడా ఆ డైలాగ్ విని, ఇది మీకు సూటయిందో లేదో కాస్త పరీక్షించుకోండి:
జనం అచ్చం తేనెటీగలు లాగనే, డబ్బు అనే తేనెను సంపాదించి గవర్నమెంట్ అనే రాణి ఈగ బ్యాంక్‌లో దాస్తారు, బ్యాంక్‌లు మీకు 5 పర్సంట్ లేదా 6 పర్సంట్ వడ్డీ ఇస్తామని దాన్ని కార్పొరేట్ కంపెనీకి లోన్ ఇస్తే, వాళ్లు విదేశాలకు వెళ్లిపోతారు.
దేశాన్ని పాలించడానికి డబ్బు కావాలి, అందుకే ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్ అని మళ్లీ జనాల నుండే వసూలు చేస్తారు. దానికి తోడు ఈ నాయకులు దేశాలకీ దేశాలకీ మధ్య, కులాలకీ మతాలకీ మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని మేము సాల్వ్ చేస్తాం, మిమ్మల్ని కాపాడుతాం, ఉద్దరించేస్తామని చెప్పి ట్యాక్స్ కక్కిస్తూనే ఉంటారు. ఈ విషయాల నుండి జనాలు మర్చిపోవడానికి వీళ్లే సృష్టించిన మీడియా వాళ్లు వేరేవేరే ఎమోషన్స్ ఉన్న కథల్ని, డైలీ బేసిస్‌లో జనాలపై వదులుతూనే ఉంటారు.
ఎన్నో దేశాల్లో చిన్నపిల్లలకి తినడానికి తిండే లేదు. కానీ ఈ లీడర్స్ వార్స్, జెట్ ఫైటర్స్ అని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఏమయ్యా డైరెక్టర్ మహాశయా, ఇదంతా మన జనాలకి తెలీదనుంకుంటున్నావా, మన జనాలకి అన్ని విషయాలు తెలుసు, అయినా జనం అవసరం లేని కథల్లో మునిగిపోతారు, ఎందుకో తెలుసా, ఎందుకంటే వాళ్ల దగ్గరున్న తేనెనంతా తీసుకుని ఈ పెద్దోళ్లు వాళ్ల జీవితాల్ని(Ui Movie Dialogues) చప్పగా మార్చేశారు, వాళ్లకి తేనె లాంటి తియ్యని వార్తలు కావాలి. అందుకే తేనె పూసిన కత్తిలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు, స్టార్ల స్టోరీలను సొల్లు కారుస్తూ చూస్తారు. ఈ సినిమాకి వచ్చింది కూడా అందుకే, జనం వచ్చేది ఎంజాయ్‌మెంట్ కోసం. నాలుగైదు పంచ్ డైలాగ్స్ వెయ్యి, వైలన్స్ ఎక్కువ చెయ్యి, రక్తం పారించు, జేజేలు కొడతారు, నీకు డబ్బులు వస్తాయి.
సినిమా ప్రభావం సమాజంపై ఉంటుందా లేదా అన్న దాని గురించి చాలా చర్చలు జరుగుతూనే ఉంటాయి, దీనికి సమాధానం ఎప్పటికీ దొరకదు, కానీ ఈ డైలాగ్‌తో ఉపేంద్రనే ఓ సొల్యూషన్ చూపాడు. సినిమాలో మనం చెప్పాలనుకున్నది చెప్తే, సొల్యూషన్‌ను జనాలే ఆలోచించి తెలుసుకుంటారు అని పరోక్షంగా వివరించారు పరిష్కారమా, పరిష్కారం జనాలే తేల్చుకుంటారు, రెండున్నర గంటలు జనాలకి నేను రియాల్టీని చూపిస్తాను. దాని వెనుకున్న సత్యాన్ని జనమే తెలుసుకుంటారు. మా ఆడియెన్స్ తెలివైన వాళ్లు, అన్నీ అర్థం చేసుకుంటారు. ఉప్పి స్టైల్‌లో మరి కొన్ని డైలాగులు విని తరించండి, ఎవ్వరూ పరిగణనలోకి తీసుకోని మరో ఫిలాసఫీ బాటను ఈ డైలాగుల్లో ప్రదర్శించాడు.
“ఐ విష్ యూ బ్యాడ్‌లక్, బాయ్ బాయ్ బ్రదర్! దేవుడు అంటేనే దెయ్యం పట్టినట్లు ఊగిపోతారమ్మా ఈ జనాలు. ఈ మూర్ఖపు జనాలు భవిష్యత్తుని అద్దంలో చూస్తారు. ఈ జగత్తులో ఆ పరమాత్ముని లీల ఏంటో తెలుసా, ఏమీ లేని ఎడారిలో పెట్రోల్ పెట్టాడు, బంగారం, వెండి ఉన్న మన దేశంలో మంట పెట్టాడు. మంట పెట్టాలంటే మనకి పెట్రోల్ కావాలి, వాడికి బంగారం కావాలి. జనాల సైకాలజీ ఏంటో తెలుసా,కడుపుకి వారం రోజులు ఫుడ్ లేకపోయినా కామ్‌గా పడి ఉంటారు, అదే బ్రెయిన్‌కి ఫుడ్ లేకపోతే విలవిల్లాడిపోతారు.
చదివారుగా, మీక్కూడా యూనివర్శిల్ ఇంటెలిజెన్స్ వచ్చిందా, అదేనండీ యుఐ అర్థమైందా? అర్థం కాకపోతే మళ్లీ చదవండి, లేదంటే మీ ఫ్రెండ్స్‌కి కూడా పంపి, వారికి అర్థమైతే వారి నుండి తెలుసుకోండి. సినిమా అర్థం కాకపోవచ్చు, అర్థమవచ్చు. కానీ ఉప్పి డైలాగుల్లో మాత్రం ఏది తప్పో, ఏదో ఒప్పో మనమే చెప్పలేం. ఆ డైలాగ్‌లు హీరో చెప్పినా, విలన్ చెప్పినా కూడా, వాటిని మంచీ చెడూ అని తేల్చలేం. అదే ఉప్పీ స్పెషాలిటీ.