ప్రభాస్, అమితాబచ్చన్ ప్రధాన పాత్రలుగా నటించిన కల్కి 2898 ఏడీ గురించి ఇంటా, బయటా జోరుగా చర్చ సాగుతోంది. రెండు విభిన్న ప్రపంచాలను అనుసంధానం చేస్తూ, ఆసక్తికరమైన పురాణ విషయాలను కూడా మిళితం చేసిన ఈ సినిమా గురించి, కల్కి సినిమాటిక్ యూనివర్స్ నుండి రాబోయే నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సామాజిక మాధ్యమాలలో ప్రేక్షకుల అభిప్రాయాలు, ఊహలు, ఆశలు వింటుంటే, రానున్న కల్కి ప్రపంచం ఎంత ఆసక్తిగా ఉండబోతోందో అర్థమైపోతుంది. అయితే, ఇలాంటి సినిమాలు ప్రపంచ వెండి తెరపై ఇంతకు ముందు చాలానే వచ్చినప్పటికీ, వాటిలో మన కల్కికి కాస్త దగ్గరగా ఉన్న సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డైవర్జెంట్ (2014)
ఇది కూడా మంచి ఫ్యూచరిస్టిక్ వరల్డ్ ఫిల్మ్. ఈ సినిమాలో భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉండబోతోందో చక్కగా ఊహించి రూపకల్పన చేశారు. ఆ ప్రపంచంలోని ప్రజలు 5 వర్గాలుగా విడిపోతారు. 5 వర్గాలుగానే ఎందుకు అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. మనకి పంచ భూతాలు ఉన్నాయి కదా! ఇలాంటివే మరి కొన్ని మత గ్రంథాలలోనూ ఉన్నాయి. (Kalki Like Movies) అయితే అవి ఆకాశం, భూమి, వాయువు, నీరు, అగ్ని కాదు. ఇక్కడ మానవ లక్షణాలను పంచ లక్షణాలుగా విభజించారు. అవేంటంటే, నిజాయితీ, ధైర్యం, విజ్ఞానం, త్యాగం వంటి వర్గాలుగా విడిపోతారు. ఒక్కో వర్గానికీ కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తులతో వర్గాల మధ్య పోరు జరుగుతూ ఉంటుంది. అయితే,ఓ ప్రధాన పాత్రకు ఒక సమస్య వస్తుంది. ఆమెలో చాలా వర్గాలకు ఉన్న శక్తులు ఉంటాయి. అందువల్ల ఆమె ఏ వర్గంలోనూ పూర్తి స్థాయిలో ఉండలేకపోతుంది. ఈ నేపథ్యంలో ఆమె ఎలా ఆ ప్రపంచంలో తన పంతాన్ని నెగ్గించుకున్నది అన్నదే ఈ సినిమా. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. మీకు వీలున్నప్పుడు చూడవచ్చు.

మ్యాడ్ మ్యాక్స్:ఫ్యూరీ రోడ్ (2015)
మ్యాడ్ మ్యాక్స్ అంటేనే ఒళ్లు గుగొర్పొడిచే సినిమాలు గుర్తొస్తాయి. ప్రభాస్ కల్కిలో గంగా నది ఎడారిగా మారిపోయిన సీన్ గుర్తుందా. ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా అలాంటి ఎడారి వాతావరణంలోనే చిత్రించినట్లుగా ఉంటుంది. భగభగమండే ఎడారిలో, చిత్రవిచిత్రమైన రూల్స్, టెక్నాలజీతో విరుచుకుపడే వీరులు ఆ ప్రపంచం నుండి బయటపడేందుకు చూస్తారు. ఈ ఎడారిని పాలిస్తున్న ఓ రాజు, ప్రతి నీటి చుక్కనూ శాసిస్తాడు. ఎవరి గొంతులోకి ఎన్ని నీటి చుక్కలు వెళ్లాలో నిర్ణయిస్తాడు, అటువంటి ప్రపంచం నుండి బయటపడేందుకు రెబల్స్ (Kalki Like Movies) ప్రయత్నిస్తుంటారు. రెబల్స్, నీటి కష్టాలు వెంటే కల్కి ఫస్ట్ హాఫ్ గుర్తొస్తోంది కదా, మరి కల్కికి ఈ సినిమా ఎంత వరకు స్ఫూర్తిగా నిలిచిందో తెలుసుకునేందుకు నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ఈ మూవీని చూసేయండి. మరో విషయం ఏంటంటే, ఆ ప్రపంచం నుండి బయటపడాలనుకున్న బ్యాచ్‌లో ఓ గర్భవతి కూడా ఉంటుంది.

బ్లేడ్ రన్నర్ 2049 (2017)
ఈ సినిమా కూడా కల్కికి దగ్గరగా ఉంటుంది. కల్కిలో బాగా వినిపించే పేరు ప్రాజెక్టు కె. అలాగే బ్లేడ్ రన్నర్‌లో కూడా ఆఫీసర్ కే అనే పేరు తరచుగా వినిపిస్తుంది. బ్లేడ్ రన్నర్ కొన్ని జీవాలను రూపొందిస్తాడు. అవి 30 ఏళ్లు తర్వాత తమకు పని చేయకుండా, శత్రువుల బానిసలుగా మారుతాయి. వాటిని తొలగించే పనిని ఆఫీసర్ కే కి అప్పగిస్తారు. అయితే, ఈ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చూస్తుండగా, సమాజానికి ముప్పుగా పరిణమిస్తున్న కుట్రలను కనుగొంటాడు. అలా రీసెర్చ్ చేస్తున్న కొద్దీ, తన మీద తనకే కొత్త కొత్త డౌట్లు వస్తుంటాయి. వాటిని హీరో ఎలా అధిగమించాడు, సమాజాన్ని ఎలా రక్షించాడు అన్నదే ఈ సినిమా. బ్లేడ్ రన్నర్ 2049 అనేది బ్లేడ్ రన్నర్ సిరీస్‌లో రెండవ పార్ట్. ఇది 2049 నాటి పరిస్థితులను అంచనా వేసి, టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసి రాసుకున్న కథ. దీనికి తగినట్లుగానే గ్రాఫిక్స్, ఫైట్స్ ఉంటాయి. కాబట్టి, నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ఈ సినిమాను మీరు కూడా చూసి, కల్కికి, దీనికి మధ్య సారూప్యతలు ఏవైనా ఉంటే కామెంట్ చేయండి.

స్టార్ వార్స్
స్టార్ వార్స్ అనేది చాలా మంది సై-ఫై అభిమానులకు ఒక ఎమోషన్. ఫ్లైయింగ్ వెహికల్స్, ఫైట్స్, రోబోట్స్ వంటివి ఏ సినిమాలో కనిపించినా స్టార్ వార్స్ గుర్తొచ్చేస్తుంది. ఫిల్మ్ మేకింగ్ మీద అంత ప్రభావం చూపిన సిరీస్ ఇది. ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్న రాక్షసుడి నుండి అమాయకులను రక్షించేందుకు ఫైట్ చేసే వివిధ రకాల మనుషులు, (Kalki Like Movies) జీవుల కలయికే స్టార్ వార్స్. ఈ సిరీస్ చూడటం ఓ రోజులో పూర్తయ్యేది కాదు. 1978లో మొదలైన ఈ ఫ్రాంఛైజీ, అప్పటి నుండీ ప్రతి సినిమాతోనూ ప్రజల హృదయాలను దోచుకంటోంది. మీరు కూడా ఆలస్యం చేయకుండా మొదలుపెట్టండి.

డ్యూన్ (2021)
దీపికా పదుకొణే డ్రెస్సింగ్ స్టైల్ చూసి, కాసేపు డ్యూన్ సినిమా చూస్తున్నామా అని చాలా మంది ప్రేక్షకులు ఫీలయ్యే ఉంటారు. కల్కి డ్రెస్సింగ్ స్టైల్‌తో ఈ సినిమా కాస్ట్యూమ్ స్టైలింగ్ మ్యాచ్ అవుతోందని చాలా మంది ఓపెన్‌గానే చెప్పారు. అయితే, కల్కికి సొంతంగా ఓ స్టైల్ ఉంది. డ్యూన్లో పాత్రలు కూడా ఫ్యూచరిస్టిక్ వరల్డ్‌లో ఉంటున్నప్పటికీ, ట్రెడిషనల్ స్టైల్‌ను ఫాలో అవుతాయి. శంబల/శంభాల నగరంలో హిందూ, బౌద్ధం, ద్రవిడ, సిక్కు కల్చర్ల డ్రెస్సింగ్ స్టైల్స్ ఉన్నట్లుగానే డ్యూన్లో కూడా వివిధ జాతుల ట్రెడిషనల్ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. అంతేగాక, ఈ సినిమా కూడా ఎడారిలోనే, భవిష్యత్తు కాలంలోనే, ఎలాంటి వనరులు లేని వేస్ట్ ల్యాండ్‌లో, అణగారిన వర్గాల చుట్టూ కొనసాగుతుంది. 1965 నుండే డ్యూన్ కామిక్స్ చాలా ఫేమస్. స్టార్ వార్స్‌ను కూడా ఇవి ప్రభావితం చేశాయి. 2021లో వచ్చిన ఈ సినిమా, చాలా మందిని విపరీతంగా ఆకర్షించింది. గ్రహాల మధ్య యుద్ధాన్ని, ఖగోళ శాస్త్ర అభివృద్ధితో గ్రహాలలో నివాసం వంటి అంశాలను కళ్లకు కట్టినట్లుగా చూపించింది. కల్కి సినిమా క్లైమాక్స్‌లో ప్రభాస్ తన చిట్టీని డ్రైవ్ చేసినప్పుడు, “బాస్, ఇప్పటికే మనం ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాం, అది తొక్కితే ఎక్కడికి పోతామో తెలీదు” అనే డైలాగ్ చెబుతుంది. అయినా సరే ప్రభాస్ కంటిన్యూ చేస్తాడు. అప్పుడు వాళ్లు కొత్త లోకంలోకి వెళ్తారు అనేది సూచాయగా తెలిపారు. ఆ కొత్త లోకం డ్యూన్‌ను పోలి ఉంటుందని విశ్లేషకుల అంచనా.

గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ (2014)
గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీకి, కల్కికి పెద్దగా పోలికలు ఏమీ లేవు. డిస్టోపియన్, ఫ్యూచరిస్టిక్ వరల్డ్స్ అనే సిమిలారిటీలు ఉన్నప్పటికీ, ఈ సినిమా ప్రభావం పెద్దగా కనిపించదు. కాకపోతే, ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ ఫ్రాంఛైజీలో మార్వెల్స్కు చెందిన స్టార్ లార్డ్(పీటర్ క్విల్ అని కూడా అంటారు)కీ, కల్కిలో ప్రభాస్ క్యారెక్టర్‌కు చాలా దగ్గర సంబంధం ఉంది. కల్కిలో ప్రభాస్ పాత్ర చాలా ముఖ్యమైనదైనప్పటికీ, చాలా జోవియల్‌గా, (Kalki Like Movies)క్యాజువల్‌గా ఉన్నట్లు ఉంటుంది. స్టార్ లార్డ్ కూడా చాలా కీలక పాత్ర అయినప్పటికీ ప్రభాస్‌లానే జోవియల్‌గా బిహేవ్ చేస్తుంటాడు. ఆ పాత్ర తీరుతెన్నులను తెలుసుకోవడం కోసం మీరు ఈ సినిమా చూడండి.

ఇవి అమెరికా, బ్రిటన్ దేశాలలో రిలీజైన మూవీలు, అదే విధంగా తమ పౌరాణికాలకు, సైన్స్కూ ముడిపెట్టి ఏదైనా దేశంలో సినిమాలు వచ్చినట్లయితే, త్వరలోనే వాటిని కూడా అప్డేట్ చేస్తుంటాం. వాటిని కూడా మిస్ అవ్వకూడదంటే మమ్మల్ని బుక్ మార్క్ చేసుకోండి. రోజూ విజిట్ చేస్తూ ఉండండి.
ఈ కథనాన్ని ఇంగ్లిష్‌లో చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.