Thiragabadara Saami Review: రాజ్‌తరుణ్‌ – మాల్వీ మల్హోత్రా నటించిన చిత్రం ఎలా ఉందంటే?

తారాగణం : రాజ్‌ తరుణ్‌, మన్నారా చోప్రా, మాల్వీ మల్హోత్ర, అంకిత ఠాకూర్‌, మకరంద్‌ దేశ్‌పాండే, ప్రగతి, రాజా రవీంద్ర, పృథ్వీ, జాన్‌ విజయ్‌, తాగుబోతు రమేష్‌ తదితరులు.(Thiragabadara Saami Review)

సంగీతం : జేబీ

సినిమాటోగ్రఫీ : జవహర్‌ రెడ్డి

డైరెక్టర్‌ : ఏ.ఎస్‌. రవి కుమార్‌

నిర్మాత : మాల్కాపురం శివ కుమార్‌

విడుదల తేదీ : ఆగస్టు 2, 2024

వివదాల మధ్య..

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో రాజ్‌ తరుణ్ అతని మాజీ ప్రేయసి లావణ్య ఎపిసోడ్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లావణ్య ఎవరి మీదనైతో ఆరోపణలు చేసిందో ఆ హీరోయిన్‌(మాల్వీ మల్హోత్రా)తో రాజ్ తరుణ్‌.. తిరగబడరా స్వామి చిత్రంలో నటించాడు. మాల్వీ మల్హోత్రాతో రిలేషన్ షిప్‌ వల్లనే రాజ్ తరుణ్ తనను వదిలేశాడని లావణ్య ఆరోపణలు చేసింది. తనకు అబార్షన్ చేయించి డ్రగ్స్ కేసులో రాజ్‌ తరుణ్ ఇరికించాడంటూ పలు మీడియా ఛానెళ్లలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ ఎపిసోడ్‌ వల్ల రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా నటించిన తిరగబడరా సామి చిత్రంపై సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ ఏర్పడింది. ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే ఆగస్టు 2న ‘తిరగబడరా సామి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా? ఈ సమీక్షలో చూద్దాం.

కథేంటి

గిరి(రాజ్ తరుణ్) అమయాకుడు, పిరికివాడు, తన చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా గొడవలకు దూరంగా ఉంటాడు. ప్రతి చిన్నవిషయానికి భయపడుతుంటాడు. కానీ, శైలజా(మాల్వీ మల్హోత్ర) మాత్రం చాలా దూకుడుగా ధైర్యంగా ఉంటుంది. అల్లరి చేసిన వారిని, తనను టీజ్ చేసినవారికి తనదైన శైలీలో గుణపాటం చెబుతుంటుంది.(Thiragabadara Saami Review) విభిన్న మనస్తత్వాలు ఉన్న గిరి- శైలజ మధ్య పరిచయం కాస్త ప్రేమకు దారితీస్తుంది. శైలజను కంట్రోల్ చేసే క్రమంలో గిరి ఎలాంటి ఇబ్బందులు పడ్జాడు. వీరిద్దరి ప్రేమకు వచ్చిన సమస్య ఏమిటి? ఎప్పుడు పిరికిగా ఉండే గిరి ఎందుకు తిరగబడాల్సి వచ్చింది? ఇంతకు అతను తిరగబడింది ఎవరిపైనా? చివరకు గిరి తన ప్రేమను గెలిపించుకున్నాడా? లేదా? అనేది మిగిలిన కథ.

సినిమా ఎలా ఉందంటే?

ఫస్టాప్ కామెడీ ఫన్‌తో సాగుతుంది. హీరో-హీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్, గిరిని, శైలజా ఆటపట్టించే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. వీరిద్దరి మధ్య రొమాన్స్ పరంగా కెమెస్ట్రీ బాగా కుదిరింది. దీంతో ఫస్టాఫ్ ఎక్కడా బోర్ కొట్టడు. ఇంటర్వెల్‌ ముందు వచ్చే ట్విస్టు సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. ఇక రెండో అర్ధభాగంలో పిరికివాడి నుంచి ధైర్యవంతుడిగా మారిన హీరో, అతని గురించి ఎలివేషన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌తో సాగుతుంది. రాజ్‌ తరుణ్‌ను గత చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్ మాస్ యాంగిల్స్‌లో చూపించారు. అయితే అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్లు బోరింగ్‌ ఫీల్ అందిస్తాయి. కొన్ని ఫైట్స్‌ రాజ్‌తరుణ్‌ కటౌట్‌కు మించి ఉండటంతో ప్రేక్షకులు అంతగా ఫైట్స్‌కు కనెక్ట్ కాలేరు. సెంటిమెంట్ సీన్లను ఇంకాస్త హృద్యంగా తీస్తే బాగుండేది.

ఎవరెలా చేశారంటే?

హీరో రాజ్‌ తరుణ్‌కు ఫన్‌ అండ్ కామెడీ జనర్‌ కొట్టిన పిండి అని చెప్పవచ్చు. అమాయక చక్రవర్తి గిరి పాత్రలో జీవించాడు. తొలుత అమాయకుడిగా, తన లవర్‌ కోసం శత్రువులపై పోరాడే ప్రియుడిగా రెండు భిన్నమైన కోణాల్లోనూ నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో రాజ్‌ తరుణ్ శక్తివంచన లేకుండా అదరగొట్టాడు. ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. లవర్ బాయ్ ఇమేజ్‌ నుంచి మాస్ హీరోగా మారేందుకు రాజ్‌ తరుణ్ ఈవిధంగా (Thiragabadara Saami Review) చేసినట్లు సినిమాను చూస్తే అర్థమవుతుంది. తెలుగులో మాల్వీ మల్హోత్రాకు మొదటి చిత్రమే అయినప్పటికీ.. శైలజా పాత్రలో చక్కగా నటించింది. గడసరి అమ్మాయిగా ఆ రోల్‌కు న్యాయం చేసింది. ఇక తెరపై రాజ్‌ తరుణ్‌ – మాల్వీ మల్హోత్ర మధ్య రొమాన్స్ పరంగా కెమెస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. సెకండ్‌ హీరోయిన్ మన్నారా చోప్రా కూడా తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. తన పాత్ర పరిధిమేరకు నటించింది. రఘుబాబు, జాన్‌ విజయ్‌, అంకిత ఠాకూర్‌, ప్రగతి, రాజా రవీంద్ర వారి వారి పాత్రల ద్వారా ఆకట్టుకున్నారు.

డైరెక్షన్ ఎలా ఉందంటే?

డైరెక్టర్ ఏ.ఎస్ రవికుమార్.. తాను అనుకున్న స్టోరీ లైన్‌ను ఎక్కడా బోర్‌ కొట్టకుండా తీయడంలో సక్సెస్ అయ్యాడు. నటీనటుల నుంచి తనకు కావాల్సిన నటనను రాబట్టుకోవడంలో విజయం సాధించాడు. ఫస్టాఫ్‌లో హీరో- హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌ను బాగా ఎంగేజ్ చేశాడు. అయితే ఎమోషనల్ సన్నివేశాల్లో మాత్రం ఇంకాస్త హోమ్‌ వర్క్ చేస్తే బాగుండేది అనిపించింది. మొత్తానికి ప్రేక్షకులకు వినోదం పంచడంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

టెక్నికల్‌గా..

తిరగబడరా సామి చిత్రం సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా కనిపిస్తుంది. జేబీ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా బీజీఎం చాలా బాగుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ కూడా చాలా నైపుణ్యంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్‌

రాజ్ తరుణ్- మాల్వి మల్హోత్రా మధ్య లవ్ ట్రాక్

యాక్షన్‌ సీక్వెన్స్‌
సంగీత

మైనస్‌ పాయింట్స్‌

వర్కౌట్‌ కాని సెంటిమెంట్ సీన్లు

అక్కడక్కడ వచ్చే కొన్ని బోరింగ్‌ సీన్స్‌

తీర్పు:

యూత్ తప్పక చూడాల్సిన ఎంటర్‌టైనర్, ఒక మంచి లవ్- యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను కోరుకునేవారికి ‘తిరబడరా సామి’ నచ్చుతుంది.

Thiragabadara Saami Review Rating:

3.5/5

Click Here For English Review

Pitta Kathalu Rating Scale:


4.5- ఇండస్ట్రీ హిట్
4- బ్లాక్ బాస్టర్
3.5- సూపర్ హిట్
3- హిట్
2.5 యావరేజ్
2- డిసప్పాయింట్
1- డిజాస్టర్

Leave a Comment