నటీనటులు: భాను ప్రకాష్, సృజన్, మణి ఏగుర్ల, మోహన్ భగత్, రవీందర్ బొమ్మకంటి, అంజయ్య మిల్కూరి, పద్మ మరియు ఇతరులు
రచన, దర్శకత్వం: అనంత్ వర్ధన్
సంగీతం: సంజీత్ ఎర్రమిల్లి
సినిమాటోగ్రఫీ: ముత్యాల సునీల్
ఎడిటర్: వెంకట్ రెడ్డి
నిర్మాత: వినోద్ అనంతోజు
ఓటీటీ: ఈటీవీ విన్
ఇటీవల ఈటీవీ విన్ ద్వారా విభిన్నమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. తాజాగా, ఈ ప్లాట్ఫార్మ్‌లో ‘సోపతులు’ (Sopathulu) అనే సినిమా స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఇది విద్యార్థుల స్నేహం ఆధారంగా రూపొందిన చిత్రమని చెప్పవచ్చు. ఇద్దరు పిల్లల చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కథ:
చింటు (మాస్టర్ భాను ప్రకాష్) మరియు గుడ్డు (సృజన్) ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థాయి స్నేహం వారిది. అలాంటి వీరి జీవితంలో అనుకోకుండా కోవిడ్ లాక్‌డౌన్ ప్రవేశిస్తుంది. ఈ పరిస్థితి వల్ల గుడ్డూ కుటుంబం మహబూబాబాద్ నుంచి(Sopathulu Movie Review) స్వగ్రామానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ ఎడబాటు చింటును ఒంటరిని చేస్తుంది, తన స్నేహితుడిని మళ్లీ చూడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అదే సమయంలో, గుడ్డూ కూడా తన స్నేహితుడిని కలిసేందుకు ప్రయత్నిస్తాడు. చివరికి వీరు కలవడం జరిగిందా? చింటు అన్నయ్య ఫొటోగ్రాఫర్‌గా స్థిరపడాలనే కల సాకారమయ్యిందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల యాక్టింగ్
చిత్రంలో ప్రధాన పాత్రలు తక్కువే అయినా, నటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా చింటు పాత్రలో భాను ప్రకాష్, గుడ్డూ పాత్రలో సృజన్ ఆకట్టుకున్నారు. వారి సహజమైన నటన, స్నేహబంధాన్ని ఆవిష్కరించిన విధానం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది. మోహన్ భగత్ సహా మిగతా నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
దర్శకత్వం ఎలా ఉందంటే
దర్శకుడు అనంత్ వర్ధన్ స్నేహం, కోవిడ్ ప్రభావం, మధ్యతరగతి కుటుంబాల ఇబ్బందులను అద్భుతంగా చిత్రీకరించారు. చింటు, గుడ్డు కుటుంబ నేపథ్యాలను చక్కగా మేళవించి కథను ఆసక్తికరంగా నడిపించారు. ఆన్‌లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్ లేక గుడ్డూ పడిన ఇబ్బందులు హృదయానికి తాకుతాయి. చింటు అన్నయ్య పాత్ర నేటి (Sopathulu Movie Review)యువతకు అద్దం పట్టేలా రూపొందించబడింది. క్లైమాక్స్ కూడా సంతృప్తిని ఇస్తుంది. అయితే, కమర్షియల్ అంశాలు కొరవడటం, కొన్ని పాత్రల పరిచయం ఎక్కువ సమయం తీసుకోవడం వంటి చిన్న లోపాలు ఉన్నాయి.
టెక్నికల్ పరంగా
టెక్నికల్ పరంగా సినిమా చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాను బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ కూడా చక్కగా నిర్వహించబడింది. నిర్మాణ విలువలు తగినంత స్థాయిలో ఉన్నాయి.
హైలైట్స్:
- సహజ నటన
- భావోద్వేగాలు
- సంగీతం
తక్కువ పాయింట్లు:
- కమర్షియల్ హంగుల లేకపోవడం
- కొన్ని సన్నివేశాలు ఊహించే విధంగా ఉండటం