సోనీ ఎక్స్‌పీరియా 1 VII స్మార్ట్ ఫోన్ త్వరలో లాంఛ్‌కానుంది. ఇది సోనీ ఎక్స్‌పీరియా 1 VIకి అప్‌గ్రేడ్ వెర్షన్. ఇప్పటివరకు లీకైన సమాచారం(Sony Xperia 1 VII) ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ మూడు కలర్ అప్షన్‌లలో లభించనుంది. ఇది శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రానుంది. దీనిని 12GB RAMతో జత చేశారు. ఈ గ్యాడ్జెట్ గురించి నెట్టింట్లో పలు లీక్స్ వైరల్ అవుతున్న వేళ..సోనీ WH-1000XM6 విడుదల తేదీ బయటకు వచ్చింది.

సోనీ ఎక్స్‌పీరియా 1 VII డిజైన్
ఇంటర్‌నెట్‌లో లభిస్తున్న సమాచారం ప్రకారం..సోనీ ఎక్స్‌పీరియా 1 VII మూడు రంగుల్లో లభించనున్నట్లు టాక్. బ్లాక్, గ్రీన్ మరియు పర్పుల్ రంగుల్లో అందుబాటులో ఉండనున్నట్లు టాక్.
లీకైన సమాచారం ప్రకారం.. డిజైన్ పరంగా, సోనీ ఎక్స్‌పీరియా 1 VIIIలో పెద్దగా మార్పులు లేవని తెలుస్తోంది. హ్యాండ్‌సెట్ పైభాగంలో సెల్ఫీ కెమెరాను కలిగి ఉండి పొడవైన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వెనుకవైపు, పైభాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు డ్యూయల్ LED ఫ్లాష్ ఉన్నాయి.
సోనీ ఎక్స్‌పీరియా కెమెరా
లీక్స్ ప్రకారం, అల్ట్రావైడ్ మరియు మెయిన్ కెమెరా నిలువుగా అమర్చబడిన కెమెరా మాడ్యూల్ పైభాగంలో ఉంటాయి. తరువాత డ్యూయల్ LED ఫ్లాష్, పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటాయి. సోనీ ఎక్స్‌పీరియా 1 VIII కుడి వైపు అంచున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉంటాయి. ఇది వేలి ముద్ర స్కానర్‌గా కూడా పనిచేస్తుంది.
లీకైన మార్కెటింగ్ సమాచారం ప్రకారం.. ఈ గ్యాడ్జెట్ సోనీ బ్రావియా టెక్నాలజీతో కూడిన డిస్‌ప్లేను, సన్‌లైట్ మోడ్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 5,000mAh బ్యాటరీని అమర్చినట్లు సమాచారం. ఇది రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని తెలుస్తోంది.

పవర్‌పుల్ ప్రాసెసర్
ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు.. సోనీ ఎక్స్‌పీరియా 1 VIII క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoCతో చిప్ సెట్‌తో వస్తుందని టాక్. దీనిని 12GB RAMతో జోడించినట్లు తెలిసింది . ఈ గ్యాడ్జెట్ ఆండ్రాయిడ్ 15తో పనిచేస్తుంది. సోనీ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను మే 13న జరుగనున్న తన ప్రొడక్ట్స్ లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించనుంది.
సోనీ WH-1000XM6ను సోనీ Xperia 1 VII లాంచ్ ఈవెంట్‌కు రెండు రోజుల తరువాత ఆవిష్కరించనుంది. సోనీ WH-1000XM6 లాంచ్ ఈవెంట్ మే 15న ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది.
సోనీ WH-1000XM6 డిజైన్, స్పెసిఫికేషన్లను ఇప్పటివరకు వెల్లడించలేదు. తాజా లీకుల ప్రకారం.. సోనీలో QN3 ప్రాసెసర్ ఉంటుందని తెలిసింది. ఇది ఆడియో క్వాలిటీ మరియు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) పరంగా మెరుగైన పనితీరును అందిస్తుంది.
సంతోషకరంగా, సోనీ WH-1000XM6 గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ఎక్కువ కాలం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. దీని ధర మరియు లభ్యత వివరాలు అలాగే ఫ్లాగ్‌షిప్ హెడ్‌ఫోన్ల స్పెసిఫికేషన్లు ఆవిష్కరణ వేళ వెల్లడించబడతాయి.

సోనీ WH-1000XM6 విడుదల తేదీ
సోనీ WH-1000XM6 సోనీ ఎక్స్‌పీరియా 1 VII లాంచ్ ఈవెంట్ జరిగిన రెండు రోజుల తర్వాత ఆవిష్కరించబడుతుందని కంపెనీ ప్రకటించింది. సోనీ WH-1000XM6 కోసం లాంచ్ ఈవెంట్ మే 15న ఉదయం 9am PDT (భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30pm)కి ప్రారంభమవుతుంది.
సోనీ WH-1000XM6 గురించి మరింత తెలుసుకోవడానికి మరో మూడు రోజులు వేచి చూడాలి. ఈ ఫ్లాగ్‌షిప్ హెడ్‌ఫోన్‌ల ధర మరియు లభ్యత వివరాలు, అలాగే స్పెసిఫికేషన్‌లు వచ్చే వారం పరికరం విడుదల చేసినప్పుడు వెల్లడి చేయబడతాయి.