సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 (Samsung Galaxy S25) లైనప్ నుంచి మరో ప్రీమియం ఫోన్ మే నెలలో విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ ఫోన్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్, దీని ధర నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రానున్నట్లు సమాచారం. ఎస్25 మోడల్స్‌లో మూడు కెమారాలు ఉండగా.. ఈ గ్యాడ్జెట్ మాత్రమే రెండు కెమెరాలతో ముందుకు రానుంది.
ప్రముఖ జర్మన్ పబ్లికేషన్ విన్ ఫ్యూచర్ సంస్థ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్‌కు సంబంధించి లీకైన స్పెసిఫికేషన్స్‌ను తన నివేదికలో పేర్కొంది. ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే 6.7 అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌తో 120 హెడ్జ్ రీఫ్రేష్ రేటు కలిగి ఉంటుంది. అలాగే ఇది కేవలం 163గ్రాముల బరువు, 5.85మీమీ మందం ఉన్నట్లు విన్‌ఫ్యూచర్ వెల్లడించింది. ఇప్పటి వరకు విడుదలైన గెలాక్సీ ఎస్ మోడల్స్‌లో ఇదే అత్యంత స్లిమ్ మోడల్.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ టైటానియం ఫ్రేమ్‌తో ముందు వెనుక భాగం గ్లాస్ ఫినిషింగ్‌తో రానుంది. దీని డిస్‌ప్లే.. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో(Samsung Galaxy S25 Specifications) రక్షణ పొందినట్లు తెలిసింది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే మీద అల్ట్రాసోనిక్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. వాటర్- డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్ ఉంది.
ఇక స్మార్ట్ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 12GB ర్యామ్, 512GB వరకు స్టోరేజీ కలిగి ఉంటుంది. సామ్‌సంగ్ ఎస్25 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా యూఐ 7పై పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే.. వెనుక భాగంలో 200 మెగాపిక్సెల్(f/1.7 అపర్చర్) మేయిన్ కెమెరా ఉంటుంది. ఇది 85 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగి ఉంటుంది. అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలో 12 మెగాపిక్సెల్ లెన్స్ ఉంటాయి. ఇది f/2.2 అపర్చర్‌తో 85 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూ (FoV) కలిగి ఉంటుంది. ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా( f/2.2 అపర్చర్) ఉంటుంది. దీనిలో 80 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూను కలిగి ఉంటుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్‌లో వై-ఫై 7, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయని తెలిసింది. ఇది 3,900mAh బ్యాటరీ కెపాసిటితో రానున్నట్లు సమాచారం.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ 256GB వేరియంట్ ధర భారత మార్కెట్‌లో రూ.1,19,000 (Samsung Galaxy S25 Price) వరకు ఉండే అవకాశం ఉందని విన్ ఫ్యూచర్ తన కథనంలో పేర్కొంది. 512GB వేరియంట్ ధర సుమారు రూ.1,30,000 వరకు ఉండనుంది. ఈ ప్రీమియం ఫోన్ ధరను ఫ్లాగ్ షిప్ ఫోన్లైన గెలాక్సీ ఎస్ 25+, గెలాక్సీ ఎస్25 అల్ట్రా మధ్య సామ్‌సంగ్ ఉంచే అవకాశం ఉంది.
