భారత మార్కెట్లో బడ్జెట్ TWS ఇయర్‌బడ్ సెగ్మెంట్ అత్యంత పోటీగా తయారైంది. OnePlus, Realme, boAt, Noise, Poco, Redmi వంటి బ్రాండ్లు ఇప్పటికే ఈ విభాగంలో తమదైన ముద్ర వేశాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 18న భారత్‌లో లాంచ్ అయిన Oppo Enco Buds 3 Pro+ రూ. 2,099 ధరకు “Pro+” ట్యాగ్‌తో వచ్చిన ఈ ఇయర్ బడ్స్ Oppo Enco Buds 3 Pro+ Review పెట్టిన ధరకు సరిపోయాయా? లేదా? మరిన్ని విషయాలను ఓసారి చూద్దాం.
ఈ రివ్యూలో డిజైన్, కంఫర్ట్, సౌండ్ క్వాలిటీ, బ్యాటరీ లైఫ్ వంటి ముఖ్య అంశాలను సింపుల్‌గా, స్పష్టంగా మీకు అందిస్తున్నాను.

డిజైన్ & బిల్డ్ క్వాలిటీ
బరువు
- కేస్: 37.8 గ్రాములు
- ఒక్కో ఇయర్‌బడ్: 4.2 గ్రాములు
ఫామ్ ఫ్యాక్టర్: ఇన్-ఇయర్
డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్: IP55
కలర్ ఆప్షన్స్: మిడ్నైట్ బ్లాక్, సోనిక్ బ్లూ
Oppo మళ్లీ తన క్లాసిక్ పెబుల్-షేప్ కేస్ డిజైన్‌కి వచ్చింది. కేస్ చిన్నగా ఉండటంతో జేబులో సులభంగా జారిపోతుంది. ప్రీమియమ్ లుక్ లేకపోయినా, బడ్జెట్లో ఆకర్షనీయంగానే ఉందని చెప్పవచ్చు. గుండ్రని ఎడ్జ్‌లు ఉండటంతో చేతిలో పట్టుకోవడానికి కంఫర్ట్‌గా ఉంటుంది.
కేస్‌లో ఇయర్‌బడ్స్ మాగ్నెట్లతో అమర్చబడి ఉంటాయి. మూత తెరిచి ఎంత ఊపినా అవి బయటకు రాలేదు. హింజ్ క్వాలిటీ కూడా బాగుంది – పొరపాటున ఓపెన్ లేదా క్లోజ్ అవడం జరగలేదు.
మైనస్ పాయింట్లు:
- కేస్ చుట్టూ ఉన్న గ్లాసీ స్ట్రిప్‌లో రీసెట్/పేరింగ్ బటన్ ఉండటంతో వెంటనే గుర్తించడం కాస్త కష్టం
- ముందు వైపు ఉన్న LED ఇండికేటర్, కేస్‌ను సపోర్ట్‌గా ఉంచినప్పుడు సరిగా కనిపించదు
ఇయర్‌బడ్స్ బరువు తక్కువగా ఉండటంతో గంటల తరబడి వాడినా చెవులకు ఎలాంటి ఇబ్బంది లేదు. రన్నింగ్ లేదా వర్కౌట్ సమయంలో కూడా కంపర్ట్‌గా ఉన్నాయి. IP55 రేటింగ్ ఉండటం వల్ల వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది.
సౌండ్ క్వాలిటీ & స్పెసిఫికేషన్స్:
డ్రైవర్: 12.4mm డైనమిక్ డ్రైవర్
కోడెక్ సపోర్ట్: AAC, SBC
కనెక్టివిటీ: Bluetooth 5.4
యాప్ సపోర్ట్: HeyMelody
టచ్ కంట్రోల్స్: ఉన్నాయి
12.4mm డ్రైవర్ ఈ సెగ్మెంట్లో సాధారణమే. కానీ రియల్-వరల్డ్ వినికిడి అనుభవంలో బాస్ చాలా పంచీగా ఉంటుంది. హై వాల్యూమ్‌లో కూడా డిస్టార్షన్ రాలేదు – ఇది ప్లస్ పాయింట్.
అయితే హై ఫ్రీక్వెన్సీ (ట్రెబుల్) విషయంలో కొంత నిరాశ కలిగిస్తుంది. స్పష్టత తగ్గినట్టు అనిపిస్తుంది, కొన్ని పాటల్లో బాస్ మిగతా సౌండ్‌ను కవర్ చేసినట్టు ఉంటుంది.
హిప్-హాప్, EDM, R&B, బాలీవుడ్ పాటలకు ఇవి బాగా సరిపోతాయి. కానీ క్లాసికల్, ఇన్స్ట్రుమెంటల్ లేదా డీటెయిల్ సౌండ్ కోరుకునే వారికి ఇవి సరిపోవు.
ANC & ట్రాన్స్పరెన్సీ మోడ్లు ఉన్నప్పటికీ, వాటి మధ్య పెద్ద తేడా కనిపించలేదు. అలాగే Enco Master EQలో ఉన్న Original Sound, Bass Boost, Clear Vocal మోడ్ల మధ్య కూడా గణనీయమైన మార్పు అనిపించలేదు.
టచ్ కంట్రోల్స్ పేపర్ మీద బాగానే ఉన్నా, ప్రాక్టికల్‌గా కొన్నిసార్లు ఆలస్యంగా స్పందించాయి. అప్రయత్నంగా ట్యాప్స్ రిజిస్టర్ కావడం కూడా కొంత ఇబ్బంది పెట్టింది.

బ్యాటరీ లైఫ్:
బ్యాటరీ సామర్థ్యం
- ఇయర్‌బడ్స్: 58mAh (ప్రతి ఒక్కటి)
- కేస్: 440mAh
కంపెనీ ప్రకారం:
- ANC ఆఫ్: 12 గంటలు
- ANC ఆన్: 8 గంటలు
నా వాడకంలో (సుమారు 60% వాల్యూమ్):
- ANC ఆన్‌తో దాదాపు 10 గంటలు
- ANC ఆఫ్‌తో 7 గంటలకు పైగా
కేస్‌తో కలిపి మొత్తం బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. నిజానికి రెండు రోజులకు ఒక్కసారి మాత్రమే కేస్ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ధరలో ఇది నిజంగా పెద్ద ప్లస్.
ఫైనల్ వెర్డిక్ట్: ఎవరి కోసం ఇది?
ఒక్క మాటలో చెప్పాలంటే – బలమైన బాస్, అద్భుతమైన బ్యాటరీ లైఫ్, తేలికైన డిజైన్ ఇవన్నీ కలిసిన ఒక మంచి బడ్జెట్ TWS.
మీరు కొనాలి అనుకుంటే:
- బాస్ ఎక్కువగా వినిపించే పాటలు ఇష్టపడితే
- యూట్యూబ్ వీడియోలు, సినిమాలు చూడడానికి ఒక కంఫర్టబుల్ ఇయర్‌బడ్ కావాలంటే
- ఎక్కువ సేపు బ్యాటరీ నిలవాలి అనుకుంటే
మీరు దూరంగా ఉండాలి అనుకుంటే:
- ప్రతి ఇన్స్ట్రుమెంట్ స్పష్టంగా వినిపించాలి అనుకునే ఆడియోఫైల్ అయితే
- ట్రెబుల్, సౌండ్ డీటెయిల్స్ మీకు చాలా ముఖ్యమైతే
మొత్తానికి, Oppo Enco Buds 3 Pro+ తన ధరకు మించి పనితీరు చూపిస్తుంది. కానీ “Pro+” అనే ట్యాగ్ పూర్తిగా న్యాయం చేసిందా అంటే – అది మీ వినికిడి అభిరుచులపై ఆధారపడి ఉంటుంది.









