మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) నుంచి థర్డ్ సింగిల్‌గా మెలోడీ సాంగ్ (Naanaa Hyraanaa song) రిలీజ్ అయింది. ఈ సాంగ్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సాంగ్‌పై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. సాంగ్ వినసొంపుగా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. ఈ సాంగ్‌కు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.
థమన్ మ్యూజిక్ అందించగా.. కార్తిక్, శ్రేయా ఘోషల్ పాడారు. ఈ చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మరి యూత్‌ను ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ లిరిక్స్ మీరు కూడా చూసేయండి మరి.

NaaNaa Hyraanaa Song Lyrics
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా… థిల్లానా దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా… థిల్లానా దిన్నా
నానా హైరానా
ప్రియమైనా హైరానా..
మొదలాయే నాలోనా..
లలనా నీ వలనా..
నానా హైరానా..
అరుదైన హైరానా..
నెమలీకల పులకింతై..
నా చెంపలు నిమిరేనా..
NaaNaa Hyraanaa Song Lyrics
దానా దీనా ఈ వేళ.. నీలోనా.. నాలోనా..
కనివిననీ కలవరమే.. సుమ శరమా..
వందింతలయ్యే… నా అందం
నువ్వు నా పక్కన ఉంటే…
వజ్రంలా వెలిగాయి ఇంకొంచెం
నువ్వు నా పక్కన ఉంటే..
వెయ్యింతలాయే.. నా సుగుణం
నువ్వు నా పక్కన ఉంటే..
మంచోనవుతున్నా.. మరికొంచెం..
నువ్వు నా పక్కన ఉంటే..
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా… థిల్లానా దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా… థిల్లానా దిన్నా
ఎపుడు లేని… లేని వింతలు
ఇపుడే చూస్తున్నా..
గగనాలన్నీ.. పూల గొడుగులు
భువనాలన్నీ… పాల మడుగులు
కదిలే రంగుల భంగిమలై..
కనువిందాయే పవనములు
ఎవరు లేనే.. లేని దీవులు
నీకు.. నాకేనా…
రోమాలన్నీ.. నేడు
మన ప్రేమకు జెండాలాయే..
ఏం మాయో.. మరి ఏమో
నరనరమూ.. నైలు నదాయే..
తనువేలేనీ ప్రాణాలు.. తారాడే ప్రేమల్లో..
అనగనగా సమయములో… తొలి కథగా..
వందింతలయ్యే… నా అందం
నువ్వు నా పక్కన ఉంటే…
వజ్రంలా వెలిగాయి ఇంకొంచెం
నువ్వు నా పక్కన ఉంటే..
వెయ్యింతలాయే.. నా సుగుణం
నువ్వు నా పక్కన ఉంటే..
మంచోనవుతున్నా.. మరికొంచెం..
నువ్వు నా పక్కన ఉంటే..
NaaNaa Hyraanaa Song Lyrics
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా… థిల్లానా దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా
నాదిరి దిన్నా నాదిరి దిన్నా… థిల్లానా దిన్నా
పుష్ప 2 చిత్రంలోని కిస్సిక్ సాంగ్ లిరిక్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పాట వివరాలు
పాట పేరు: నానా హైరానా
గాయకులు: కార్తీక్, శ్రేయా ఘోషల్
గీతరచయిత: సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి
కొరియోగ్రాఫర్: బోస్కో మార్టిస్