Mr. Bachchan Review: రవితేజ  హిట్ కొట్టాడా? సినిమా ఎలా ఉందంటే?

తారాగణం : రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, సచిన్‌ ఖేడ్కర్‌,  జగపతి బాబు, శుభలేక సుధాకర్‌, సత్య, చమ్మక్‌ చంద్ర, కిషోర్‌ రాజు వశిష్ట ఇతరులు (Mr Bachchan Review)

నిర్మాణం : టీజీ విశ్వప్రసాద్‌, భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, అభిషేక్‌

డైరెక్షన్ : హరీష్‌ శంకర్‌

సంగీతం : మిక్కీ. జె. మేయర్‌

సినిమాటోగ్రఫీ : అయనంక బోస్‌

ఎడిటర్‌ : ఉజ్వల్‌ కులకర్ణి

మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే  కాంబోలో వచ్చిన చిత్రం మిస్టర్ బచ్చన్ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. హరీష్‌ శంకర్‌ (Harish Shankar) డైరెక్షన్‌లో  వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందే పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ చేసింది. భాగ్యశ్రీ బోర్సే- రవితేజ మధ్య రొమాంటిక్ సాంగ్స్‌ యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్‌ను క్రియేట్ చేశాయి. “షాక్”,‘మిరపకాయ్‌’ వంటి  సూపర్ హిట్‌ సినిమా తర్వాత రవితేజ-హరీష్‌ శంకర్‌ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ‘మిస్టర్‌ బచ్చన్‌’పెద్ద ఎత్తున హైప్ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్, టీజర్‌, ప్రమోషన్ చిత్రాలు ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. మరి ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకుందా? వరుస ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న రవితేజ కమ్ బ్యాక్ ఇచ్చాడా? బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే తన అందంతో ఎలాంటి మ్యాజిక్ చేసింది వంటి అంశాలను పిట్ట కథలు రివ్యూలో చూద్దాం.

కథేంటి

ఆదాయపు పన్న శాఖలో మిస్టర్ బచ్చన్(రవితేజ) అధికారిగా పనిచేస్తుంటాడు. నిజాయితీ గల ఆఫీసర్‌గా గుర్తింపు పొందుతాడు. ఓ రోజు అవినీతిపరుడైన పొగాకు వ్యాపారి అస్తులలపై రైడ్ చేస్తాడు. దీంతో  అధికారుల ఆగ్రహానికి గురై సస్పెండ్ అవుతాడు. ఉద్యోగం వీడిన మిస్టర్ బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వెళ్తాడు. అక్కడ జిక్కీ (bhagyashri borse)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో వివాహానికి సిద్ధమవుతున్న క్రమంలో తిరిగి ఉద్యోగంలో చేరాలని బచ్చన్‌కు (Mr Bachchan Review) ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి కబురు అందుతుంది.  రవితేజ తన తర్వాత రైడ్‌ను ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో చేయాల్సి వస్తుంది. అధికారులను సైతం భయపట్టే జగ్గయ్య ఇంట్లో మిస్టర్ బచ్చన్‌ ఎలా రైడ్‌ చేశాడు? అక్కడ అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? బచ్చన్‌ – జిక్కీ పెళ్లి వ్యవహారం ఏమైంది.  చివరకు మిస్టర్ బచ్చన్ ఏం చేశాడు అనేది మిగిలిన కథ.

సినిమా ఎలా ఉందంటే?

మిస్టర్ బచ్చన్ సినిమా ఫస్టాఫ్ అంతా చాలా క్లాస్ సాగిపోతుంది. రవితేజ పక్కా ప్రొఫెషనల్‌గా కనిపిస్తాడు. ఆ తర్వాత ఓ పెళ్లి చూపులు, ఇన్‌కమ్ టాక్స్ రైడ్స్‌తో ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఆ తర్వాత హీరో తన సొంత ఊరికి రావడం, అక్కడ తన ఫ్రెండ్స్‌తో కామెడీ ట్రాక్, హీరోయిన్‌తో లవ్ ట్రాక్‌ బాగుంటుంది. ఇంటర్వెల్‌ సీన్‌లో హీరో, విలన్ ఇంటికి ఇన్‌కం ట్యాక్స్ రైడ్ కోసం వెళ్లడంతో సినిమా ఇంకో టర్న్‌ తీసుకుంటుంది. మొత్తంగా ఫస్టాఫ్‌ అంతా చాలా సరదాగా సాగిపోతుంది.  ఇక సెకండాఫ్‌లో వచ్చే హీరో ఎలివేషన్ సీన్స్, ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ అని చెప్పవచ్చు.  రవితేజ డైలాగ్స్ ప్రేక్షకులకు మంచి మాస్ట్ ఫీస్ట్‌ అందిస్తాయి. 

డైరెక్షన్ ఎలా ఉందంటే?

సినిమాలో కథ కంటే రవితేజ క్యారెక్టరైజేషన్‌ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు హరీష్ శంకర్. మిరపకాయ్ సినిమాలో రవితేజను ఎనర్జిటిక్ రోల్‌లో చూపించిన హరీష్ శంకర్, మిస్టర్ బచ్చన్ చిత్రంలోనూ మళ్లీ అదే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గ్లామర్, రవితేజ ఆమె మధ్య రొమాన్స్‌ మీదే సినిమా ఎక్కువ భాగం తిరుగుతుంది. జగపతిబాబు క్యారెక్టర్‌ను కూడా బాగా డిజైన్ చేశాడు. ఓవరాల్‌గా ఒరిజినల్ సినిమా నుంచి కోర్ పాయింట్‌ తీసుకుని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాను తీర్చిదిద్దాడు. అయితే  ఫస్టాఫ్‌లో  క‌నిపించిన హ‌రీష్ మార్కు సెకండాఫ్‌లో కనిపించలేదనిపిస్తుంది.  ఒక్క ఐటీ రైడ్ నేప‌థ్యంగానే సెకండాఫ్ సాగడం కాస్తా బోర్ ఫీల్ అందిస్తుంది. విలన్ పాత్ర నిడివి ఇంకాస్తా ఎక్కువ రాసుకుని ఉంటే బాగుండేది.

ఎవరెలా చేశారంటే

మిస్టర్ బచ్చన్‌లో నటినటుల యాక్టింగ్ గురించి చెప్పాలంటే.. రవితేజ ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చాడని చెప్పవచ్చు.  ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా చాలా పవర్ ఫుల్‌గా కనిపించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. పాత రవితేజను గుర్తుచేశాడు. భావోద్వేగ సన్నివేశాలతో పాటు కామెడీ సీన్లలో తన మార్క్‌ చూపించాడు.  తొలి సినిమానే అయినా  భాగ్యశ్రీ బోర్సే తన గ్లామర్‌తో అలరించింది. ముఖ్యంగా సాంగ్స్‌లో(Mr Bachchan Review) భాగ్యశ్రీ బోర్సే అందాల ఆరబోత సినిమాకి ప్లస్ అయ్యాయి. గెస్ట్‌ రోల్‌లో సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ బాగుంది. ఇక  విలన్‌గా జగపతి బాబు కనిపించేది కొద్దిసేపైనా.. తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. కమెడియన్ స‌త్య  ట్రాక్ అలరిస్తుంది. ఇక కీలక పాత్రల్లో నటించిన తనికెళ్ళ భరణి, సచిన్ ఖేడేకర్, గౌతమి, ప్రవీణ్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్‌గా

టెక్నికల్ అంశాల పరంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. సాంకేతికంగా ఈ చిత్రానికి తొలి హీరో మిక్కీ జే మేయర్. ఈ క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా మంచి క్యాచీ టూన్స్ ఇచ్చారు. (Mr Bachchan Review) రెప్పల్ డప్పుల్, జిక్కీ, సితార్, నల్లంచు తెల్ల చీర పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. మిస్టర్ బచ్చన్ చిత్రంలో  సాంగ్స్ వినడానికే కాదు చూడటానికి కూడా హైలెట్‌గా ఉన్నాయి.  సినిమాటోగ్రఫీ, మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. 

ప్లస్‌ పాయింట్స్‌

రవితేజ మాస్ యాక్టింగ్

భాగ్యశ్రీ బోర్సే గ్లామర్

కామెడీ ట్రాక్

మైనస్‌ పాయింట్స్‌

సెకండాఫ్‌లో కొన్ని సీన్లు

తీర్పు

మిస్టర్ బచ్చన్ సినిమా యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది.

రేటింగ్:

3/5

Leave a Comment