లక్కీ భాస్కర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే, కానీ అందులోని డైలాగ్‌లు సినిమా కంటే పెద్ద సూపర్ హిట్ అయ్యాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆ డైలాగ్‌లకు ఉన్న విశిష్టత, అవి ఏ సందర్భంలో వచ్చాయో ఇప్పుడు మీరూ ఓ లుక్కేయండి.
lucky Bhaskar Dialogues
Dialogue 1
“ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు, పరుగెడుతూనే ఉంటారు. కారణం డబ్బు”.
ఈ డైలాగ్‌తోనే సినిమా స్టార్ట్ అవుతుంది, అంటే ఆ సీన్ క్లయిమాక్స్‌తో ముడిపడే సీన్. డబ్బు కోసం పరిగెట్టీ అలసిపోయిన హీరో, ఇప్పుడు ఆరోగ్యం కోసం పరిగెడుతూ చెప్పే డైలాగ్ అది. డబ్బు కోసం విపరీతంగా వెంపర్లాడటం మానేస్తే, ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పడమే ఈ డైలాగ్ ముఖ్య ఉద్దేశం. సినిమా ఓపెనింగ్‌లోనే ఆ డైలాగ్ విన్నప్పుడు కాస్త అతి అనిపించినా, క్లయిమాక్స్ చూశాక ఓ సారి ఆ డైలాగ్ గుర్తు తెచ్చుకుంటే, దాని విలువ ఏంటో తెలుస్తుంది.
Dialogue 2
“ఇన్ని కష్టాల్లో నేనున్నా, బోర్డర్‌లైన్ దరిద్రంలో బతుకుతున్నా, వాళ్లింట్లో ఇష్టం లేకపోయినా, నేనే కావాలని నన్ను చేసుకుంది. సుమతి, నా బలం, నా భార్య “.
పెళ్లి కూడా బిజినెస్ అగ్రిమెంట్ అయిపోతున్న ఈ రోజుల్లో, ప్రేమంటే అన్నీ లెక్కలేసుకుని తెలిపే సమ్మతిగా మారిన ఈ జనరేషన్‌కు ఈ డైలాగ్ విలువ తెలిసే అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఏమీ లేనప్పుడు కూడా కలసి బతుకును ముందుకు(lucky Bhaskar Dialogues) సాగిద్దాములే అనే కాన్ఫిడెన్స్‌తో జీవితాన్ని ఆరంభించినప్పుడు, భార్య ఇచ్చే సపోర్ట్ ఎంత ముఖ్యమో చెప్పే డైలాగ్ ఇది. లైఫ్‌లో వంద కష్టాలు ఉంటే, నూటఒకటో కష్టం వచ్చినప్పుడు కూడా తడబాటులేని తోడు కన్నా అదృష్టం ఏముంటుంది అని ఆలోచింపజేసే డైలాగ్ ఇది.

Dialogue 3
ఒక రోజులో ఒక్క అరగంట నాకు నచ్చినట్లుగా జరగలేదు, దానికే జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా….!
జీవితంలో ఎత్తూపల్లాలు సహజం. కొన్నిసార్లు మనం వద్దు అనుకున్నవి కూడా ఆవేశంలో జరుగుతాయి, మన హీరోకి కూడా అదే జరుగుతుంది. ఫ్రెండ్స్ మాట విని ఆవేశంగా మాట్లాడిన మాటలు హీరోని విలన్ పొజిషన్లో నిలిపేస్తాయి. నిజానికి హీరోదే తప్పు అనిపించే సన్నివేశం అది, కాని తన తప్పును తెలుసుకుని హీరో పశ్చాత్తాపానికి సూచికగా ఈ డైలాగ్ బాగా పేలిందనే చెప్పాలి.
Dialogue 4
“మావాడికి నమ్మకం ఎక్కువ, నాకు జాగ్రత్త ఎక్కువ సార్. పదండి మనం వెళ్దాం.”
చాలా చిన్న డైలాగ్, కానీ సినిమాలో చాలా పెద్ద డైలాగ్ ఇది. ఆ సీన్‌కు చాలా మీనింగ్‌ఫుల్‌గా అనిపిస్తుంది. జీవితాన్ని ఫణంగా పెట్టి బ్యాంకులోంచి డబ్బు తెచ్చిన తర్వాత ఆంటోనీ మోసం చేస్తాడేమో అన్న భయమే సగటు ప్రేక్షకుడికి ఉంటుంది, కానీ అప్పటికి అమాయకుడైన హీరో ఆంటోనీ మీద పూర్తి నమ్మకంతో ఇంటికి వెళ్లిపోతాను అంటాడు, కానీ నాకు నమ్మకం లేదు సార్, జాగ్రత్తగా చూస్తాను అని బయటకు చెప్పకలేక, ఇలా చెబుతాడు.

Dialogue 5
“అన్ని సార్లూ డబ్బులతో పని అవ్వదు సార్, కొన్నిసార్లు ఇలాంటి పార్టీలు కూడా ఇవ్వాలి.“
ఈ రోజుల్లో బిజినెస్‌లో కామన్‌గా వినిపించే డైలాగ్ ఇది, లంచం మాత్రమే తీసుకునే స్థాయి నుండి, మరి కొన్ని ఫేవర్లకు అలవాటుపడిన వారి గురించి చెప్పే డైలాగ్ ఇది.
లక్కీ భాస్కర్ కొడుకు చెప్పే డైలాగ్(Dialogue 6)
“నా ఫ్రెండ్స్ నన్ను ఏడిపించేవాళ్లు నాన్న, కార్తీక్ గాడు అందరి బర్త్‌డేస్‌లకి వచ్చి, ఫ్రీగా కేక్ తినేసి వెళ్తాడు, కానీ ఎప్పుడూ బర్త్‌డే పార్టీ ఇవ్వడు అని. ఈరోజు తర్వాత వాళ్లెవరూ నన్ను ఏడిపించరు. ఆ అరుణ్, ఏరా మా ఇంటికి ఎప్పుడొచ్చినా, సేమ్ టీషర్ట్ వేసుకుని వస్తావ్, నీకు వేరే టీషర్టే లేదా అని అరుణ్ అనేవాడు, ఈరోజు నన్ను ఈ టీషర్ట్‌లో చూసి షాక్ అయిపోయాడు అమ్మా. ఈరోజు నుంచి మీరు ఏం చెప్తే, అది చేస్తా, పొద్దున్నే లేస్తా, బాగా చదువుతా. ఇంకా, మీరు పెద్దయ్యే వరకు బొమ్మలు కూడా కొనియ్యొద్దు.“
ఇది భాస్కర్ కొడుకు డైలాగ్, భారీ పార్టీ ఇచ్చినాక ఆ పిల్లాడు అమాయకంగా చెప్పే డైలాగ్ ఇది. ఇది మధ్యతరగతి జీవితాలను, డబ్బులతో ముడిపడే (lucky Bhaskar Dialogues)అంశాలు చిన్నపిల్లలపై ఎంత తీవ్రంగా ప్రభావం చూపుతాయో వివరించే సీన్, అందుకే ఆ వెంటనే భాస్కర్ కూడా మంచి డైలాగ్ వేస్తాడు, అది ఈ కిందనే ఉంది.
Dialogue 7
“ఇలాంటప్పుడే అనిపిస్తుంది, ఫ్యామిలీ కోసం ఎంత చేసినా తప్పు లేదని”.
మనిషి బలహీనత, బలం ఫ్యామిలీనే, ఏం చేసినా ఫ్యామిలీ కోసమే, కొద్దిరోజులయ్యాక వాళ్లే ప్రయారిటీ అవుతారు, వారి కోసం క్రైమ్ చేయడానికి కూడా వెనుకాడని కుటుంబ అవసరాలను ఈ డైలాగ్ వివరిస్తుంది.

Dialogue 8
“భాస్కర్ అమ్ముడుపోవాలని డిసైడ్ అయితే, భాస్కర్ రేటు భాస్కర్ చెబుతాడు.”
పక్కా కమర్షియల్ డైలాగ్, హీరోయిజాన్ని ఎలివేట్ చేసే డైలాగ్, మనకి ఆఫర్ ఇచ్చినవాడి మీద కూడా మనదే పైచేయి ఉండాలనే కసి ఈ డైలాగ్‌లో కనబడుతుంది. హీరో ఇచ్చే ఆఫర్‌ను అవతలివ్యక్తి అంగీకరించడానికి సరిపడా బలాన్ని ఈ డైలాగ్ ఆ సీన్‌కు ఇచ్చింది.
Dialogue 9
“జూదం అలవాటైన ప్రతి ఒక్కడూ, మానేద్దామనే అనుకుంటాడు.కానీ, ఆశ తలకి తగలగానే కొత్త కారణం వెతుక్కుని, మళ్లీ మొదలుపెడతాడు, నేనూ మొదలుపెట్టాను, దిస్ టైమ్ బిగ్గర్, బెటర్.“
హీరో పూర్తిగా తప్పుదారిపడుతున్న సమయంలో వచ్చే డైలాగ్ అది, రెడ్ లైట్ పడింది, ఆపేయాల్సిన సమయమని ముందుగానే ఫిక్స్ అవుతాడు, కానీ (lucky Bhaskar Dialogues) డబ్బు ఆశ, అది తేరగా వచ్చే మార్గం ఎదురుగా ఉండేసరికి వెనుకాముందూ చూసుకోకుండా క్రైమ్ చేస్తూ ఉంటాడు. ఆ స్థితిని సరిగ్గా ఈ డైలాగ్ స్పష్టం చేసింది.
Dialogue 10
“మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్, ఖర్చులన్నీ తగ్గించుకుని రూపాయి రూపాయి దాచుకుంటాం, పంతం వస్తే ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖర్చు పెట్టేస్తాం సార్.“
డబ్బులు ఉన్నా కూడా, బయటకి చూపించుకోవడంపై అప్పటిదాకా దృష్టి పెట్టని హీరో, నగల దుకాణంలో జరిగిన అవమానం తర్వాత, తన స్థాయి ఏంటో అవమానించిన వాళ్లకి చూపించాలనుకుంటాడు, ఆ సమయంలో (lucky Bhaskar Dialogues) చెప్పే డైలాగ్ ఇది. కొన్నిసార్లు మనం కూడా స్నేహితులతో, కుటుంబసభ్యులతో పంతానికి పోయినప్పుడు అవసరం లేకపోయినా మన స్థాయికి మించి ఖర్చు పెడతాం. దాన్నే ఈ డైలాగ్ వివరిస్తుంది. దీనికి కొనసాగింపుగా ఈ కింది డైలాగ్ ఉంటుంది.
Dialogue 11
“నేను వెళ్లింది నగలు మాత్రమే కొనడానికి కాదు సార్, వాడి అహంకారాన్ని కొనడానికి. అవమానించిన వాడితోనే సలాం కొట్టించుకున్నాను సార్, ఎవ్రీ రూపీ వర్త్ ఇట్ సార్.“
సలాం కొట్టించుకున్నప్పుడు వచ్చే కిక్కు తాత్కాలికమే అయినప్పటికీ, దాన్ని పొందడం కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలని ఫిక్స్ అవ్వడం ఓ విధంగా హీరో అహంకారాన్ని కూడా తెలుపుతుంది, తుడుచుకుంటే పోతుందిలే, మనకి కావాల్సింది మనం తీసుకుపోదాం అనుకుంటే పోయేదేమీ ఉండదు, కానీ అవమానించినవాడితోనే సలాం కొట్టించుకోవడం ఓ మధ్యతరగతి బలహీనత, దాన్నే ఇక్కడ చూపించారు. ఇది ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో హీరోయిజం సరుకు కూడా.

Dialogue 12
“దిస్ ఈజ్ ఇండియా, వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన వంటి మీద కనపడాలి.“
మన సమాజం హంగులు చూసి రెస్పెక్ట్ ఇస్తుంది, వ్యక్తిత్వం చూసి గౌరవం ఇచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. డైరెక్టర్ తేజ చెప్పినట్లుగా, వాళ్లు నాకు గౌరవం ఇవ్వలేదు, నేను వచ్చిన కారుకు గౌరవం ఇస్తున్నారు, సో వాళ్లు గౌరవిస్తోంది వస్తువును, (lucky Bhaskar Dialogues) మనిషిని కాదు అని, ఇక్కడ కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది, కారులో దిగగానే ఫైవ్‌స్టార్ ట్రీట్మెంట్ ఇచ్చే మార్కెటింగ్ అతిపై ఈ డైలాగ్‌తో డైరెక్టర్ సరిగ్గా పంచ్‌లు వేశాడు.
Dialogue 13
”ఆకలికి మించిన ఆహారం, అవసరానికి మించిన సంపాదన, రెండూ విషంతో సమానం. ఆ విషం నా తలకెక్కుతున్న రోజులవి.”
ఈ డైలాగ్‌కి వివరణ అక్కర్లేదు, ఈ డైలాగ్‌లోనే ఈ సినిమా కథ అంతా ఉంది, హీరో తప్పుదోవపడుతున్న దశను ఈ డైలాగ్ వివరిస్తుంది.
Dialogue 14
“సుమతీ, ఐ యామ్ నాట్ బ్యాడ్, ఐ యామ్ జస్ట్ రిచ్, డబ్బు ఉన్నవాడిని ఈ సమాజం ఎప్పుడూ చెడ్డోడిలా చూస్తుంది. అన్‌పోర్చునేట్లీ నువ్వు కూడా నన్ను అలానే చూస్తున్నావు…!
తప్పు చేస్తున్నావని హీరోయిన్ హీరోను హెచ్చరిస్తున్నప్పుడు, తన తప్పును గుర్తించలేని హీరో ఆవేశంగా పలికే డైలాగ్లు ఇవి. సమాజం మీద కోపాన్ని, సమాజంలోని లోపాలను తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు హీరో ఉపయోగించుకున్న సందర్భం ఇది.
Dialogue 15
“దేవుడు సార్, పొగరు బలిసినప్పుడల్లా జీవితం మీద ఒక్క లెంపకాయ వేస్తుంటాడు సార్, అంతే సెట్ అయిపోతాం.”
మన శాస్త్రాల్లో చెప్పినట్లుగా, అప్పుడప్పుడూ దేవుడు మనకు సిగ్నల్స్ ఇస్తుంటాడు, మనమే అలెర్ట్ అవ్వాలి అని అంటుంటారు, ఇందులో కూడా హీరో ఎంత అగాథంలో కూరుకుపోయాడో తెలిశాక, తను మారడానికి ఆ విషాదం ఎలా ఉపయోగపడిందో చెప్పే డైలాగ్ ఇది.
Dialogue 16
“సిగరెట్, ఆల్కహాలు, డ్రగ్స్ ఇచ్చే కిక్కు కన్నా, డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ, స్టాక్ మార్కెట్లో వచ్చేంత డబ్బులు, ఇంకా ఏ వ్యాపారంలో రావు సార్. ఇంతే ఒక రోజు గెలిచినా, ఇంకోరోజు ఓడినా, ఈరోజు ఒకడు చచ్చినా ఆపబుద్ధి కాదు, ఆపలేము సార్.”
డబ్బుకున్న గొప్పదనమే అది, దాన్ని మనిషి పుట్టించినా, అది మాత్రం మనిషి చచ్చినా కూడా తన శక్తిని కోల్పోదు, మనిషి చావు మీద కూడా కనీసం సింపతీ చూపించలేని స్థితికి ఆర్థిక నేరం, డబ్బు మన మనషుల్ని తీసుకెళ్తాయి. మనలోని ఆ జంతు ప్రవృత్తినే ఈ డైలాగ్ వివరిస్తుంది.
వేగంగా వచ్చే రూపాయి డైలాగ్ (Dialogue 17)
కుటుంబం కోసం మొదలుపెడతాం, కానీ వెళ్లే కొద్దీ ఆట మత్తులో కుటుంబాన్నే మర్చిపోతాం… భాస్కర్, వేగంగా నడిపే బండి, వేగంగా వచ్చే రూపాయి, రెండూ మనిషిని ఎప్పుడో ఒకప్పుడు కింద పడేస్తాయి.
ఇది హీరో తండ్రి కొడుకులో మార్పు కోసం చెప్పే మాట. చాలా బలాన్ని చేకూర్చుంది ఆ సీన్‌కి. అప్పటికే భార్య కోపాన్ని చవిచూసిన భాస్కర్‌కు ఆ డైలాగ్స్‌లో మర్మం తెలుస్తుంది, ఇక పూర్తిగా మారడానికి భాస్కర్‌ను మానసికంగా సిద్ధం చేస్తాయి.
ఇప్పుడు రానున్న రెండు డైలాగ్‌లు సినిమాను పైకి లేపాయా, కిందకి దించాయా అన్న దానితో సంబంధం లేకుండా, నిత్యసత్యాలు లాంటివి. (lucky Bhaskar Dialogues) వీటిని ఎవరు ఎలా అయినా అన్వయించుకోవచ్చు, హీరో-విలన్లు ఇద్దరూ కూడా తమకు నచ్చినట్లుగా చెప్పుకోగలిగే అవకాశమున్న డైలాగ్‌లు ఇవి, కథ పరంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ డైలాగ్‌లను మీరు కూడా ఓ సారి చదివేయండి.
Dialogue 18
“ఎందుకంటే, జూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం.”
Dialogue 19
“గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది, ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది, ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యూ ఫినిష్డ్.“
మరికొన్ని డైలాగ్స్..
Dialogue 20
“వాడు కామన్ మ్యాన్… అన్ని ప్రాబ్లమ్స్ తీర్చేసుకుని ప్రశాంతంగా పడుకోగలడు“
“డబ్బుంటేనే మర్యాద.. ప్రేమ.“
మాటల్లో ఇంత అహంకారం….అహంకారం కాదు.. ధైర్యం!
దేవుడు రెడ్ సిగ్నల్ వేశాడు అంటే.. అన్నీ ఆపేయమని అర్థం!
lucky Bhaskar Dialogues Table
Dialogue No. | Dialogue |
1 | “ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు, పరుగెడుతూనే ఉంటారు. కారణం డబ్బు”. |
2 | “ఇన్ని కష్టాల్లో నేనున్నా, బోర్డర్‌లైన్ దరిద్రంలో బతుకుతున్నా, వాళ్లింట్లో ఇష్టం లేకపోయినా, నేనే కావాలని నన్ను చేసుకుంది. సుమతి, నా బలం, నా భార్య “. |
3 | “ఒక రోజులో ఒక్క అరగంట నాకు నచ్చినట్లుగా జరగలేదు, దానికే జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా….!” |
4 | “మావాడికి నమ్మకం ఎక్కువ, నాకు జాగ్రత్త ఎక్కువ సార్. పదండి మనం వెళ్దాం.” |
5 | “అన్ని సార్లూ డబ్బులతో పని అవ్వదు సార్, కొన్నిసార్లు ఇలాంటి పార్టీలు కూడా ఇవ్వాలి.” |
6 | “నా ఫ్రెండ్స్ నన్ను ఏడిపించేవాళ్లు నాన్న, కార్తీక్ గాడు అందరి బర్త్‌డేస్‌లకి వచ్చి, ఫ్రీగా కేక్ తినేసి వెళ్తాడు, కానీ ఎప్పుడూ బర్త్‌డే పార్టీ ఇవ్వడు అని. ఈరోజు తర్వాత వాళ్లెవరూ నన్ను ఏడిపించరు. ఆ అరుణ్, ఏరా మా ఇంటికి ఎప్పుడొచ్చినా, సేమ్ టీషర్ట్ వేసుకుని వస్తావ్, నీకు వేరే టీషర్టే లేదా అని అరుణ్ అనేవాడు, ఈరోజు నన్ను ఈ టీషర్ట్‌లో చూసి షాక్ అయిపోయాడు అమ్మా. ఈరోజు నుంచి మీరు ఏం చెప్తే, అది చేస్తా, పొద్దున్నే లేస్తా, బాగా చదువుతా. ఇంకా, మీరు పెద్దయ్యే వరకు బొమ్మలు కూడా కొనియ్యొద్దు.” |
7 | “ఇలాంటప్పుడే అనిపిస్తుంది, ఫ్యామిలీ కోసం ఎంత చేసినా తప్పు లేదని”. |
8 | “భాస్కర్ అమ్ముడుపోవాలని డిసైడ్ అయితే, భాస్కర్ రేటు భాస్కర్ చెబుతాడు.” |
9 | “జూదం అలవాటైన ప్రతి ఒక్కడూ, మానేద్దామనే అనుకుంటాడు.కానీ, ఆశ తలకి తగలగానే కొత్త కారణం వెతుక్కుని, మళ్లీ మొదలుపెడతాడు, నేనూ మొదలుపెట్టాను, దిస్ టైమ్ బిగ్గర్, బెటర్.” |
10 | “మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్, ఖర్చులన్నీ తగ్గించుకుని రూపాయి రూపాయి దాచుకుంటాం, పంతం వస్తే ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖర్చు పెట్టేస్తాం సార్.” |
Dialogue No. | Dialogue |
---|---|
11 | “నేను వెళ్లింది నగలు మాత్రమే కొనడానికి కాదు సార్, వాడి అహంకారాన్ని కొనడానికి. అవమానించిన వాడితోనే సలాం కొట్టించుకున్నాను సార్, ఎవ్రీ రూపీ వర్త్ ఇట్ సార్.” |
12 | “దిస్ ఈజ్ ఇండియా, వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన వంటి మీద కనపడాలి.” |
13 | “ఆకలికి మించిన ఆహారం, అవసరానికి మించిన సంపాదన, రెండూ విషంతో సమానం. ఆ విషం నా తలకెక్కుతున్న రోజులవి.” |
14 | “సుమతీ, ఐ యామ్ నాట్ బ్యాడ్, ఐ యామ్ జస్ట్ రిచ్, డబ్బు ఉన్నవాడిని ఈ సమాజం ఎప్పుడూ చెడ్డోడిలా చూస్తుంది. అన్‌పోర్చునేట్లీ నువ్వు కూడా నన్ను అలానే చూస్తున్నావు…!” |
15 | “దేవుడు సార్, పొగరు బలిసినప్పుడల్లా జీవితం మీద ఒక్క లెంపకాయ వేస్తుంటాడు సార్, అంతే సెట్ అయిపోతాం.” |
16 | “సిగరెట్, ఆల్కహాలు, డ్రగ్స్ ఇచ్చే కిక్కు కన్నా, డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ, స్టాక్ మార్కెట్లో వచ్చేంత డబ్బులు, ఇంకా ఏ వ్యాపారంలో రావు సార్. ఇంతే ఒక రోజు గెలిచినా, ఇంకోరోజు ఓడినా, ఈరోజు ఒకడు చచ్చినా ఆపబుద్ధి కాదు, ఆపలేము సార్.” |
17 | “కుటుంబం కోసం మొదలుపెడతాం, కానీ వెళ్లే కొద్దీ ఆట మత్తులో కుటుంబాన్నే మర్చిపోతాం… భాస్కర్, వేగంగా నడిపే బండి, వేగంగా వచ్చే రూపాయి, రెండూ మనిషిని ఎప్పుడో ఒకప్పుడు కింద పడేస్తాయి.” |
18 | “ఎందుకంటే, జూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం.” |
19 | “గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది, ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది, ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యూ ఫినిష్డ్.” |
20 | “వాడు కామన్ మ్యాన్… అన్ని ప్రాబ్లమ్స్ తీర్చేసుకుని ప్రశాంతంగా పడుకోగలడు” |
సరే, అయిపోయిందా. నాకు తెలిసి లక్కీ భాస్కర్‌లో బెస్ట్ డైలాగ్‌లు అన్నీ నేను చెప్పేసినట్లుగానే ఉన్నాను, ఒకవేళ ఏదైనా మర్చిపోతే మీరు కామెంట్లలో రాయండి. అలాగే మీకు నచ్చిన డైలాగ్ ఏంటో కూడా కామెంట్ చేయండి.