Kanguva Review In Telugu: సూర్య కెరీర్‌లో మరో మాస్టర్‌ పీస్!

నటీనటులు: సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్‌, జగపతిబాబు, యోగిబాబు, ప్రకాష్‌ రాజ్‌, కె.ఎస్‌. రవికుమార్‌, హరీష్ ఉత్తమన్‌, కోవై సరళ, ఆనంద్‌రాజ్‌
దర్శకత్వం: శివ
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి
ఎడిటింగ్: నిషాద్‌ యూసఫ్‌
నిర్మాతలు: కె.ఈ. జ్ఞానవేల్‌, వంశీ ప్రమోద్‌
విడుదల తేదీ: 14 నవంబర్ 2024

తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కంగువా’. ఈ సినిమాకి దర్శకుడు శివ, బాలీవుడ్ నటి దిశా పటానీ, బాబీ డియోల్(Kanguva Review) ప్రధాన పాత్రల్లో నటించారు. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 14న విడుదలైంది. రూ.1000 కోట్ల కలెక్షన్స్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? సూర్యకు మరొక విజయం అందిస్తుందా? చూసేద్దాం!

కథ

ఫ్రాన్సిస్‌ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. అనుకోకుండా అతడి జీవితంలోకి ఒక పాప ప్రవేశిస్తుంది. ఆ పాపతో తాను ఏదో ప్రత్యేకమైన బంధం కలిగివున్నానని ఫ్రాన్సిస్‌కు అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పుడు ఉండే బంధం కాదు; 1000 సంవత్సరాల క్రితం ఉన్న అనుబంధమని అతడు తెలుసుకుంటాడు. ఆ పాపతో ఫ్రాన్సిస్‌కు ఉన్న ఆ ప్రాచీన సంబంధం ఏమిటి? అసలు కంగువా ఎవరు? అతడు చేసిన పోరాటాలు ఏమిటి? ఆ తెగకు ఎదురైన ముప్పు ఏంటి? అన్న వివరాల కోసం సినిమా చూడాల్సిందే.

పాత్రల విశ్లేషణ

సూర్య నటన మరోసారి ఆకట్టుకుంది. ఫ్రాన్సిస్‌ పాత్రలో ఆయన తన ప్రతిభను చాటారు. నిజంగా జీవించారని చెప్పవచ్చు. అలాగే కంగువా పాత్రలో పూర్వ జన్మ నేపథ్యాన్ని బాగా చూపించారు.. సూర్య నటనలో ఉన్న బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివరీ, (Kanguva Review) ఎమోషన్స్ అన్ని కూడా పాత్రకు సరిపోయాయి. బాబీ డియోల్ విలన్ పాత్రలో శక్తివంతంగా కనిపించాడు. సూర్యతో సమానంగా పోటీ ఇచ్చే విధంగా నటించాడు. దిశా పటానీ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఆమె కెమిస్ట్రీ సూర్యతో బాగా వర్కౌట్ అయ్యింది. రొమాంటిక్‌ సాంగ్స్‌లో రెచ్చిపోయి అందాలు ప్రదర్శించింది. యోగిబాబు తన కమెడీతో ప్రేక్షకులను అలరించాడు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, కె.ఎస్. రవికుమార్ లాంటి ప్రముఖులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

దర్శకత్వం – కథనం

దర్శకుడు శివ మంచి కాన్సెఫ్ట్‌తో ‘కంగువా’ను తెరపైకి తెచ్చారు. ప్రస్తుత జన్మతో ప్రారంభమైన కథ, పూర్వ జన్మ అనుబంధాలతో కొనసాగడంతో ఆసక్తిని పెంచుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత సెకండాఫ్‌ మరింత ఉత్కంఠతను కలిగిస్తుంది. ఈ కథాంశం ప్రేక్షకులను వెయ్యి ఏళ్ల క్రితం మానవుడి జీవన విధానం ఎలా ఉండేది. తెగలుగా ప్రజలు ఎలా జీవించేవారు? వారి మధ్య పొరాటాలు ఎలా జరిగేవి వంటి అంశాలను ఆసక్తికరంగా చూపించారు. సెకండాఫ్‌లో అద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రతీ ఒక్కరికీ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.

టెక్నికల్‌గా

విఎఫ్ఎక్స్ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది, ప్రతి సన్నివేశాన్ని రిచ్‌గా తీర్చిదిద్దిన విధానం(Kanguva Review) అభినందనీయం. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరో హైలైట్, పాటలు నేపథ్య సంగీతం కథను బాగా ఎలివేట్ చేశాయి.

సినిమాలో బలమైన అంశాలు

  • సూర్య నటన: ఇద్దరు విభిన్న పాత్రల్లో సూర్య తన ప్రతిభను ప్రదర్శించాడు.
  • యాక్షన్ సీక్వెన్స్‌లు: భారీ స్థాయిలో డిజైన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు.
  • సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కథను పెంచింది.

బలహీన అంశాలు

  • నెమ్మదిగా సాగే కథనం: కథ కాస్త నెమ్మదిగా సాగేలా ఉంటుంది, కొన్నిసార్లు సన్నివేశాలు విసుగు కలిగిస్తాయి.
  • విలన్ పాత్ర: విలన్ పాత్ర మరింత శక్తివంతంగా ఉంటే బాగుండేదనే అభిప్రాయం కలుగుతుంది.

చివరగా: ‘కంగువా’ చిత్రంలో సూర్య తన విశ్వరూపం చూపిస్తూ ప్రేక్షకులను అలరించాడు.

రేటింగ్: 3/5

Click Here For English Review

Leave a Comment