ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో వస్తున్న ఫౌజీ(Fauji) చిత్రంలో హీరోయిన్గా ఇమాన్వీ ఎస్మాయిల్ (Iman Ismail) ఎంపికైంది.
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్గా ఇన్స్టాగ్రామ్ సంచలనం ఇమాన్వీ ఛాన్స్ కొట్టేసింది
ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్న వారికి ఇమాన్వీ ఇస్మాయిల్ (imanvi Ismail) పేరు కొత్తేమీ కాదు. తన డ్యాన్స్, యాక్టింగ్‌తో అలరిస్తుంటుంది.
హిందీ, తెలుగు, తమిళ్ సూపర్ హిట్ పాటలకూ తన డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేస్తుంది.
ప్రభాస్(Prabhas) సరసన హీరోయిన్గా ఛాన్స్ కొట్టేయడంతో ఇమాన్వీ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
దీంతో ఇమాన్వీ బయోగ్రఫీ, వ్యక్తిగత వివరాల కోసం నెటిజన్లు ఇంటర్నెట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఇమాన్వీ ఎస్మాయిల్ 1995 అక్టోబర్ 20న దేశ రాజధాని ఢిల్లీలో పుట్టింది.
ఇమాన్వీ పూర్వీకులది మాత్రం పాకిస్థాన్‌లో కరాచీ ప్రాంతం. అక్కడి నుంచి ఆమె తల్లిదండ్రులు ఇండియాకు తరలి వచ్చారు.
చిన్నప్పటి నుంచే ఇమాన్వీకి (iman ismail)డ్యాన్స్ అంటే తెగ ఇష్టం. కూతురు ఇష్టాన్ని కనిపెట్టిన ఆమె తల్లిదండ్రులు ఆ దిశగా ప్రొత్సహించారు.
MBA పూర్తి చేసిన ఇమాన్వీ, జాబ్ చేయకుండా తల్లిదండ్రుల ప్రొత్సాహంతో యూట్యూబ్ ఛానెల్ పెట్టింది
ఈవెంట్స్, డ్యాన్స్ షోలు చేస్తూ క్రేజ్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఆమె పెట్టే రీల్స్, వైరల్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వచ్చేవి.
ఇన్‌స్టాలో ఆమె చేసే రీల్స్‌కు యువతలో మంచి క్రేజ్ వచ్చింది. అందం, అభినయంతో కుర్రాళ్లను ఉర్రూతలూగించేది.
ఇమాన్వీ ఇస్మాయిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో 7లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.
ప్రభాస్ సరసన హీరోయిన్గా ఛాన్స్ కొట్టేయడంతో ఈ సంఖ్య మరింత పెరగనుంది
యూబ్యూబ్‌లో ఇమాన్వీ ఛానల్‌ను 1.8 మిలియన్స్‌కు పైగా ఫాలో అవుతున్నారు. ఆమె పెట్టే వీడియోలకు లక్షల్లో వ్యూస్ ఉన్నాయి.
ఇప్పటి వరకు ఇమాన్వీ ఎలాంటి సినిమాల్లో నటించనప్పటికీ.. కెమెరా ఎక్స్పీరియన్స్ బాగానే సంపాదించింది.
బాలీవుడ్ నటులు రేఖ, మాధురీ దీక్షిత్, వైజయంతీ మాల నుంచి యాక్టింగ్, డ్యాన్స్ నేర్చుకుందని చెబుతుంది
ఇమాన్వీకి స్వీట్స్ చాలా ఇష్టమట, బయటకు వెళ్తే ఎప్పుడూ తన వెంట ఉంచుకుంటానని ఓ సందర్భంలో చెప్పింది.
లెడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టిని పొలిన ఈ ముద్దుగుమ్మ ప్రభాస్‌కు సరైన జోడీ అంటూ అభిమానులు కితాబిస్తున్నారు.
ఇమాన్వి డ్యాన్స్ చూసి ఫిదా అయిన బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెకు కొరియోగ్రాఫర్‌గా అవకాశమిచ్చారు. 2020లో ‘తాల్’ సినిమాలోని ‘రామ్ తా జోగీ’ అనే పాటకు ఆమె కొరియోగ్రాఫ్ చేసింది.
అంతేకాదు పలు పాపులర్ హిందీ సాంగ్స్‌కు తనదైన స్టైల్లో ఓన్‌గా డ్యాన్స్ చేసి యూట్యూబ్‌లో ఇమాన్వి షేర్ చేసేది. ఆ వీడియోలు పలుమార్లు వైరల్‌గా మారి ఇమాన్వీకి(iman ismail) గుర్తింపు తీసుకొచ్చాయి.
సోషల్ మీడియాలో ఇమాన్వీ టాలెంట్ గుర్తించిన బాలీవుడ్ చిత్ర నిర్మాతలు.. ఆమెకు సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్‌గా ఛాన్స్ ఇచ్చారు. 2020లో విడుదలైన తాల్ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమె చేసిన ‘రామ్ తా జోగీ’ పాట గుర్తింపు తీసుకొచ్చింది.
అయితే “బీయింగ్ సా- రా” అనే షార్ట్ ఫిల్మ్‌లో మాత్రం నటించింది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫాలోయింగ్ గమనించిన హను రాఘవపూడి పిలిచి మరి ఏకంగా ప్రభాస్ పక్కన నటించే అవకాశం ఇచ్చాడు.
ఇమాన్వీ ఇన్‌స్టా ఖాతా ఓపెన్ చేస్తే.. మొత్తం ఫుల్ జోష్‌లో ఆమె చేసిన డ్యాన్స్ వీడియోలే( iman ismail Dance Videos) కనిపిస్తాయి. ఇమాన్వీ టాలెంట్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
కొసమెరుపు ఏమిటంటే.. ఫౌజీ చిత్రం పూజా కార్యక్రమంలో ప్రభాస్ పక్కన ఫొటోకు స్టిల్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెగ సంబరపడి పోతోంది. డార్లింగ్ ప్రభాస్‌ను తదేకంగా చూడటం క్యూట్‌గా అనిపించింది.
Click Here For Top 15 Unknown Facts About Iman Ismail