అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్ సిరీస్ రెండో సీజన్ నేడు(oct 31) ఆహాలో విడుదలైంది. గతేడాది ఆహా ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సెకండ్ సీజన్‌ను రూపొందించారు. ఆదిత్య కేవీ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌లో(Arthamainda Arun Kumar Season 2 Review) అరుణ్ కుమార్ పాత్రలో సిద్ధు పవన్ నటించగా, తేజస్వి మదివాడ, అనన్య శర్మ, రాశి సింగ్ ఇందులో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సిరీస్‌పై అంచనాలు పెంచింది. ఫస్ట్ సీజన్‌లో అమలాపురం నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అబ్బాయి కార్పొరేట్ ఆఫీస్‌లో పడే తిప్పలను ఎంటర్‌టైనింగ్‌గా చూపిస్తే, సీజన్-2లో తను జాబ్‌లో ఎలా పైకొచ్చాడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు అమ్మాయిలను ఎలా ఫేస్ చేసాడు అనే విషయాలను ఇంటరెస్టింగ్‌గా చూపించారు. మరి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ వెబ్‌సిరీస్ ప్రేక్షకుల అంచనాలు అందుకుందా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
అరుణ్ కుమార్ తన ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు షిప్ట్ అవుతాడు. తన లేడీ బాస్‌తో సమస్యలు ఎదుర్కొంటూనే.. అసిస్టెంట్ మెనేజర్‌గా ప్రమోషన్ సంపాదిస్తాడు. ఈక్రమంలో అతనికి ఓ ప్రాజెక్ట్ అసైన్ అవుతుంది. దీంట్లో అతన్ని నెగ్గకుండా చూసేందుకు తేజస్విని చూస్తుంటుంది. మరి ఈ అడ్డంకులను అరుణ్ కుమార్ అదిగమించాడా? లేదా? అనేది మిగతా కథ.( Arthamainda Arun Kumar Season 2 Review)
వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
ఈ వెబ్‌సిరీస్‌లో మొత్తం 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ 25 నుంచి 30 నినిమిషాల నిడివితో ఉంటుంది. మొత్తం అన్ని ఎపిసోడ్లు కలిపితే దాదాపు ఈ వెబ్‌సిరీస్ 2 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. ఈజీగా చూసేయవచ్చు. ప్రతి ఎపిసోడ్ చాలా సింపుల్‌గా కనెక్ట్ అవుతుంది. ఎక్కడా ల్యాగ్ ఉండదు. హ్యాపీగా అన్ని ఎపిసోడ్లు చూసేయవచ్చు. 4 వ ఎపిసోడ్ కాస్త డ్రామెటికల్‌గా ఉండి ఎంగేజింగ్‌గా ఉండదు. ఎందుకంటే పాత్రల మధ్య ఎక్కువగా కన్వర్జేషన్స్ అవుతుంటాయి. స్టోరీ ముందుకు వెళ్లదు. క్లైమాక్స్ వరకు వచ్చినట్లు అర్ధమవుతుంది. ఎపిసోడ్ 5 మాత్రం చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. మిస్‌కాకుండా చూడండి. ఈ వెబ్‌సిరీస్‌లో అడల్ట్ కంటెంట్ ఉండటం వల్ల కుటుంబంతో అయితే కలిసి చూడకపోవడమే మంచిది. కపుల్స్ చక్కగా చూడవచ్చు.
ఎవరెలా చేశారంటే?
ఇక వెబ్‌సిరీస్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది తేజస్విని మదివాడా గురించి.. వెబ్ సిరీస్ రిలీజ్‌కు ముందు విడుదలైన ట్రైలర్‌లో తేజస్విని బికినీలో కనిపించి ఒక్కసారిగా అందర్ని ఆశ్యర్యపరిచింది. తన హాట్ కంటెంట్‌తో వెబ్‌సిరీస్‌లో ఆకట్టుకుంది. ఇదివరకు ఇలాంటి గ్లామర్ పాత్రలో కనిపించని తెజస్విని తన రొమాంటిక్ లుక్‌తో ఆకట్టుకుంది. తన పంతం నెగ్గించుకునే లేడీగా బాగా నటించింది. అరుణ్ కుమార్‌ను ఓడించేందుకు వేసే ఎత్తులు మెప్పిస్తాయి. ఇక లీడ్ రోల్‌లో అరుణ్ కుమార్‌గా నటించిన పవన్ సిద్ధు బాగా చేశాడు. అయితే ఫస్ట్ సీజన్‌లో నటించిన హర్షిత్ రెడ్డి మార్క్ యాక్టింగ్ అయితే కనిపించలేదు. తేజస్వినితో వచ్చే కన్‌ఫ్లిక్ట్ సన్నివేశాల్లో మెప్పించాడు. ఇక పల్లవిగా నటించిన అనన్య తనదైన యాక్టింగ్‌తో మెప్పించింది. తనకు యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్ దొరికింది. అరుణ్ కుమార్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌గా అతనితో వచ్చే సీన్లలో టెంపర్‌మెంట్‌ను బాగా చూపించింది.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
ఆదిత్య కేవీ డైరెక్షన్ బాగుంది. ఫస్ట్ సీజన్‌లో అమలాపురం నుంచి హైదరాబాద్‌కి వచ్చిన అబ్బాయి కార్పొరేట్ ఆఫీస్‌లో పడే తిప్పలను ఎంటర్‌టైనింగ్‌గా చూపిస్తే.. సెకండ్ సీజన్‌లో తన జాబ్‌లో ఎలా పైకొచ్చాడు, ఆఫీస్‌లో అమ్మాయిల నుంచి ఎదురైన సమస్యలను ఎలా ఫేస్ చేశాడు అనే అంశాలను చాలా ఎంగేజ్డ్‌గా చూపించాడు. అయితే 4 వ ఎపిసోడ్‌లో డ్రామెటికల్ యాంగిల్ ఎంగేజింగ్‌గా అనిపించదు. పస్ట్ సీజన్‌తో పోలిస్తే అరుణ్ కుమార్ క్యారెక్టర్‌ను ఇంకొంచెం ఎంటర్‌టైనింగ్ డిజైన్ చేస్తే బాగుండేది అనిపించింది.
సాంకేతికంగా
టెక్నికల్ పరంగా ఈ వెబ్‌సిరిస్ చాలా ఉన్నతంగా ఉంది. ప్రతి సీన్ చాలా రిచ్ లుక్‌ను కలిగి ఉంటుంది. అజయ్ అరసాడా అందించిన సంగీతం మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుటుంది.
బలాలు:
తేజస్విని గ్లామర్
కథనం
అనన్య శర్మ- పవన్ సిద్ధు ట్రాక్
బలహీనతలు
4Th ఎపిసోడ్
కొన్ని చోట్ల అవసరం లేని సన్నివేశాలు
చివరగా: వీకెండ్‌లో మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కోసం ఎదురు చూసే వారికి అర్థమైందా అరుణ్ కుమార్ ఫుల్ మీల్స్ అందిస్తుంది.