ఓ అమ్మాయి ఒక అబ్బాయిని విపరీతంగా ప్రేమించింది. రెండేళ్ల క్రితం చిగురించిన ఈ ప్రేమ, ఇప్పుడు ఓ వృక్షంగా మారింది. మానసికంగా తెగిపోని బంధాన్ని ఏర్పరుచుకుంది. ఆ బంధాన్ని నెక్స్ట్‌లెవెల్‌కు తీసుకెళ్లాలని ఆలోచనతో పెళ్లికి కూడా సిద్ధమైంది. అయితే, ఇంతలోనే ఆ అబ్బాయి తనకు సోదరుడవుతాడనే ఓ నమ్మలేని నిజం తెలిసి(Reddit Viral News) గుండెలవిసేలా బాధపడుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తనకు మంచి సలహా ఇచ్చి ఆదుకోండంటూ రెడ్డిట్‌లో పోస్ట్ పెట్టింది. నైతిక విలువలతో నడుస్తున్న ఈ సమాజ పోకడకు వ్యతిరేకంగా ఉన్న ఈ కథను చూసి యూజర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. తమదైన రీతిలో స్పందించారు. అసలు కథేంటీ, యూజర్లు ఏమన్నారో మీరు కూడా చూసేయండి.
ఇదీ అసలు కథ!
ఆ అమ్మాయి ప్రేమ రెండేళ్ల నాటిది. చాలా ముచ్చటైన జంటగా వారు పేరు సంపాదించారు. చాలా సంతోషంగా ప్రేమను ఆస్వాదిస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లని ఇలానే ప్రేమించుకుంటాం, ఇంకాస్త కొత్తగా ప్రేమించుకుందాం. ఆ ప్రేమను మన కుటుంబాలకూ దగ్గర చేద్దామని ఆ జంట నిర్ణయించుకుంది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. అయితే తమ జీవిత నిర్ణయాన్ని చెబుతామని తెలిపారే తప్ప, ముందూ వెనుకా వివరాలేవీ చెప్పలేదు. తొలుత సాంప్రదాయం ప్రకారం అబ్బాయి వాళ్ల ఇంట్లో చెబితే మంచిదని భావించి, మొదటి మీటింగ్ అబ్బాయి(Reddit Viral News) ఇంట్లో ఏర్పాటు చేశారు. చక్కని లంచ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ జంట ఇంట్లో అడుగుపెట్టడంతోనే వంటగది నుండి వాసనలు వస్తూనే ఉన్నాయి.
ఆకలితో ఉన్న ఆ జంట విషయం ముందే చెప్పకుండా, డైరెక్టుగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లిపోయారు. అబ్బాయి సరాసరీ అమ్మాయితో రావడంతో ఇంట్లో వాళ్లకి వాళ్లు ఏం చెప్తారో అర్థమైపోయింది. ఇంకెందుకులే దాపరికమని అబ్బాయి తల్లి అన్ని విషయాలను అమ్మాయికి చెబుతోంది. అమ్మాయి కూడా తమ కుటుంబసభ్యుల వివరాలను చెబుతోంది. ఈలోగా తమ ఫ్యామిలీని పరిచయం చేయడానికి బాగుంటుందని ఆమె ఫొటో ఆల్బమ్ తీసుకొచ్చి చూపించింది.
ఫొటోలు తిరగేస్తూ…. అబ్బాయి తండ్రి, నా భర్త ఇతనే అని తన పక్కన కూర్చొన్న వ్యక్తి ఫొటోను అమ్మాయికి చూపించింది. ఆ ఫొటోను చూసి అమ్మాయి నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత ఆ ఇంట్లో వాళ్లు ఏం మాట్లాడుతున్నా కూడా తనకు వినిపించట్లేదు. ఎందుకంటే, ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి తనకు తండ్రి అవుతాడు. కానీ, ఈ విషయాన్ని అక్కడే చెప్పేస్తే పరిస్థితి మరింత (Reddit Viral News)అసహ్యకరంగా మారుతుందని భావించి ఆమె నోరు మెదపలేదు. కానీ, మనసంతా అలజడిగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలనే ఆలోచిస్తోంది. పోనీ, తన బాయ్‌ఫ్రెండ్‌కు చెబుదామా అంటే, వాడు ఎలా అర్థం చేసుకుంటాడోనని భయపడింది. దీంతో ఇక చేసేదేమీ లేక ఒక యూజర్‌గా రెడ్డిట్‌లో తన కథను పోస్ట్ చేసింది.
మనసులో మాట చెబితే భారం తగ్గుతుందని ఆమె అనుకుంది. కానీ, నెటిజన్లు కూడా ఈ వార్తను భరించలేకపోయారు.
నెటిజన్ల తింగరి సలహాలు
ఆమె పోస్ట్‌పై నెటిజన్లు విపరీతంగా చర్చించారు. తీసుకోవాల్సిన నిర్ణయంపై ఆమెకు సలహా ఇచ్చారు. డీఎన్ఏ పరీక్ష చేయాలని మరొకరు సూచించారు. ఎందుకంటే, ఆమె తల్లికి ఎఫైర్ ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఈ మాట ఆమెకు సాంత్వన ఇవ్వకపోగా, కొత్త గందరగోళాన్ని తీసుకొచ్చింది. ఆ కామెంట్‌కు కాస్త వ్యతిరేకంగానే స్పందించింది. మరి కొందరు సానుభూతి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మానసికంగా చాలా ఆందోళనకరమైనదని మరికొందరు అనగా, దురదృష్టకరమైన ఈ పరిస్థితిలో లవర్స్ ఇద్దరిదీ తప్పు లేదని తెలిపారు. పనిలోపనిగా బాయ్‌ఫ్రెండ్‌కే చెప్పేస్తే బెటర్ కదా అని కొందరు సలహా ఇవ్వగా, రహస్యంగా ఉంచి, అదే ప్రేమను కొనసాగిస్తేనే ఇబ్బంది ఉండదని మరికొందరు సలహా ఇచ్చారు.
నైతికంగా ఆలోచిస్తే మరింత గందరగోళానికి గురవుతాని కూడా చెప్పారు. ఇంకొందరు తమ జీవితంలో ఇలానే జరిగిన ఘటనలను వివరించారు. ఓ అమ్మాయి పుట్టిన 24 ఏళ్ల తర్వాత తన తండ్రిని తొలిసారిగా కలసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తండ్రిని కలసినప్పుడు వేరొకరిని పెళ్లి చేసుకుని ఆయన నలుగురు అబ్బయిలకు జన్మనిచ్చారని(Reddit Viral News) ఆమె తెలిపారు. అయితే ఇద్దరు సోదరులు మాత్రమే తనతో మాట్లాడారని, మిగిలినవాళ్లు దూరం పెట్టారని బాధను గుర్తు చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ ఆమెకు మాత్రం సంతృప్తికరమైన సలహాను ఎవరూ ఇవ్వలేదు.