మయాబజార్ (MAYABAZAAR)
తెలుగులో మయాబజార్ చిత్రం ఆల్‌టైమ్ గ్రెటేస్ట్ చిత్రం. సాంకేతికంగా అభివృద్ధి చెందని ఆరోజుల్లో కేవలం కెమెరా టెక్నిక్స్‌తో అద్భుతాలు సృష్టించారు. (Goat Telugu Movies) ముఖ్యంగా “వివాహ భోజనంబు” పాటలో SV రంగారావు లడ్డూలను ఇతర తినుబండారాలను మింగే పద్దతి, ప్రియదర్శినిలో కనిపించే దృశ్యాలు, పెళ్లిపీటలపై శశిరేఖ వింత రూపాల్లో … లక్ష్మణ కుమారుడ్ని ఆటపట్టించే తీరు నిజంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. ఇక ఈ చిత్రంలోని పాత్రలను మహాభారతం నుంచి తీసుకున్నారు. కృష్ణుడిగా ఎన్టీఆర్, ఘటోత్కచుడిగా SVR, అభిమన్యుడిగా అక్కినేని నాగేశ్వరరావు తమ పాత్రల్లో జీవించారు. ఈ చిత్రాన్ని ఎప్పటికీ విజువల్ వండర్‌గా చెప్పవచ్చు. ఆ కాలంలో దేశంలో మరేఇతర చిత్రరంగంలో చేయని ప్రయోగాలను డైరెక్టర్ కేవీ రెడ్డి చేసి విజయం సాధించారు.
మహాకవి కాళిదాసు (Mahakavi Kalidasu)
మహాకవి కాళిదాసుగా అక్కినేని నాగేశ్వరరావు మహోన్నతంగా నటించారు. ముఖ్యంగా నిరక్షరాస్యుడైన వ్యక్తిగా అక్కినేని సరస్వతి దేవిని ప్రసన్నం చేసుకునే క్రమంలో ఆయన నటన అద్భుతంగా ఉంటుంది. ఇదే పాత్రను తమిళ్‌లో శివాజి గణేషన్, కన్నడ రాజ్‌కుమార్ నటించారు. కానీ ఈ ఒక్క సీన్‌లో మాత్రం నాగేశ్వరరావు గారు వారికంటే ఓ మెట్టు పైన ఉన్నారని చెప్పవచ్చు.
జగదేకవీరుని కథ (Jagadekaveeruni Katha)
KV రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన (Goat Telugu Movies)మరో క్లాసిక్ బ్లాక్‌బాస్టర్ హిట్. ఈ చిత్రంలో ఘంటసాల- పెండ్యాల మ్యూజిక్ కాంబినేషన్‌లో వచ్చిన ఆల్‌టైం గ్రేట్ సాంగ్స్‌లో శివశంకరి సాంగ్ ఒకటి. ఈ పాటలో ఎన్టీఆర్.. 5 పాత్రల్లో కనిపిస్తాడు. ఎలాంటి గ్రాఫిక్స్ లేని సమయంలో ఇలాంటి సీన్లు చేయడం నిజంగా వండర్.
గుండమ్మకథ (Gundamma Katha)
ఈ చిత్రం టైం లెస్ క్లాసిక్. గుండమ్మ అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. పెద్దకూతురు సావిత్రి ఆమెకు సవతి కూతురు. ఎప్పుడు పెద్దకూతురును గుండమ్మ ఇబ్బందులు పెడుతుంటుంది. మరి గుండమ్మకు ఆమె మేన అల్లుడులు ఎలా బుద్ది చెప్పారన్నది కథ.
సినిమా కథ చాలా సింపుల్‌గా ఉన్నా ఈ చిత్రం అప్పటి సమాజంపై పెద్ద ప్రభావాన్ని చూపించింది. ఈ చిత్రంలో గుండమ్మ పాత్ర చేసిన సూర్యకాంతం పేరును (Goat Telugu Movies) ఆ తర్వాత తమ పిల్లలకు పెట్టేందుకు ఇష్టపడలేదు. అలాగే ఈ చిత్రంలో పెద్ద పాలేరుగా ఎన్టీఆర్ నటన కడుపుబ్బ నవ్విస్తుంది.
దక్షయజ్ఞం (Dakshayagnam)
ఈ చిత్రం ఆల్‌టైమ్ క్లాసిక్. ఎన్టీఆర్, SVR పోటా పోటీగా నటించిన చిత్రమిది. ఈ చిత్రంలో ఇద్దరు లెజెండ్ల నట విశ్వరూపం చూడవచ్చు. నిరీశ్వరయాగంలో దక్షుడిగా SVR నటనకు మాటలు చాలవు. అలాగే సతీదేవి అవమాన భారంతో మరణించిన క్షణాన.. శివుడిగా(Goat Telugu Movies) ఎన్టీఆర్ శివతాండవం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఈ చిత్రంలో కంచు కాంతం, పి సూరిబాబు వంటి చాలా మంది స్టేజ్ ఆర్టిస్టులు నటించారు.
దాన వీర శూర కర్ణ (Daana Veera Soora Karna)
ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో మెప్పించారు. కృష్ణుడిగా, కర్ణుడిగా, ధుర్యోధనుడిగా నటనలో వైవిధ్యం చూపారు. ఆ సినిమా చూస్తున్నంతా సేపు ఎన్టీఆర్ కనిపించరు ఆ పాత్రలే కనిపిస్తాయి. ముఖ్యంగా కోర్ట్ సీన్‌లో కర్ణుడిని అవమానించినప్పుడు.. ధుర్యోధనుడిగా ఎన్టీఆర్ చెప్పే.. ”ఏమంటివి ఏమటివి డైలాగ్‌ను” సింగిల్ టేక్‌లో దాదాపు 3 నిమిషాల పాటు అనర్గళంగా చెప్పారు.
పాతాళ భైరవి (Patala Bhairavi)
తెలుగు వారికి తొలిసారి అరేబియన్ జానపద తరహా కథను పరిచయం చేసిన చిత్రమిది. ఈ సినిమాలో మాయల మారఠి అయిన నేపాలి మాంత్రికుడిని తోటరాముడు అంతమొందించే సీన్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో పాతల భైరవిని చేరేందుకు(Goat Telugu Movies) గుహకు వెళ్లే సీన్.. దాని వెనుక వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కట్టిపడేస్తుంది. ఎలాంటి VFX పరిజ్ఞానంలేని ఆ కాలంలో ఇలాంటి సీన్లు తీయడం నిజంగా గ్రేట్.
రక్త సంబంధం (Rakta Sambandham)
ఈ చిత్రం అన్నా- చెల్లెల అనుబంధానికి గుర్తుగా ఎప్పటికీ ఈసినిమా నిలిచి ఉంటుంది. ఎన్టీఆర్- సావిత్రిల మధ్య వచ్చే భావోద్వేగ పూరితమైన సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను ద్రవింపజేస్తుంది. “చంద్రునికి మించి.. అందములోలికించు ముద్దు పాపాయివే” అనే క్లాసిక్ సాంగ్ ఈ సినిమాలోనిదే.
శంకరాభరణం (Sankarabharanam)
ఎలాంటి స్టార్ నటులు లేరు. కేవలం సంగీతమే ప్రధానంగా వచ్చిన సినిమా. అప్పటి వరకు వచ్చిన తెలుగు సినిమాల మూసధోరణి మార్చి.. జయకేతనం ఎగరవేసింది. సోమాయాజులు వంటి వ్యక్తిత్వం ఆ తర్వాత సమాజంలో భాగమైంది. ఈ సినిమాలో SPB పాటలు… శంకరా… నాదశరీరపరా.. సాంగ్ ప్రేక్షకులకు వీనుల విందుగా ఉంటుంది.
కన్యాశుల్కం (Kanyasulkam)
ఆనాటి సాంఘీక దురాచారలను కళ్లకు గట్టింది ఈసినిమా. బాల్య వివాహాలు వంటి సాంఘీక దురాచారాలపై గళమెత్తింది. జిత్తులమారి గిరీషం పాత్రలో ఎన్టీఆర్, వేశ్య మధురవాణి పాత్రలో సావిత్రి మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి.
గులేబకావళి కథ(Gulebakavali Katha)
ఈ చిత్రం ద్వారా లెజెండరీ రచయిత, జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహిత సి. నారాయణ రెడ్డి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. “నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని వంటి ఆల్ టైం క్లాసిక్ సాంగ్” ఈ సినిమాలోనిదే. ఈ చిత్రం పూర్తి జానపదమయంగా ఉంటుంది. (Goat Telugu Movies)గులేబకావళి అనే పుష్పం చుట్టూ తిరుగుతుంది. ఈ పుష్పం సాధించడం కోసం ఎన్టీఆర్ చేసే సాహసం అబ్బురపరుస్తుంది.
మూగమనసులు (Mooga Manasulu)
అంతస్తుల కారణంగా విడిపోయిన ఓ జంట పునర్జన్మలో వివాహం చేసుకుని కలవడం ఈ సినిమా కథాంశం. ముళ్ళపూడి వెంకటరమణ మూగమనసులు పేరిట ఈ సినిమాకు స్క్రిప్ట్ రాశారు. సాధారణంగా అప్పటి సినిమాలు మద్రాసులోని వివిధ స్టూడియోల్లో చిత్రీకరణ జరుపుకునేవి. కానీ ఈ చిత్రం తొలిసారి గోదావరి పూర్తి స్థాయి అందాలను ప్రేక్షకుల కళ్లకుగట్టింది. చాలాభాగం భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకూ ఉన్న గోదావరి పరిసరప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఓ మంచి ఓల్డ్ క్లాసిక్ సినిమా చూడాలనుకునే వారు ఈ సినిమాను మాత్రం తప్పక చుడండి.
సాగర సంగమం (Sagara Sangamam)
తరాలు మారిన ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న చిత్రం సాగరసంగమం. ఔత్సాహిక నృత్య కళాకారుడిగా కమల్ హాసన్ నటన, భావోద్వేగ సన్నివేశాలు.. ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తాయి. 100 ఏళ్ల భారతీయ సినిమా ప్రస్థానం(Goat Telugu Movies) సందర్భంగా.. CNN IBN లిస్ట్ చేసిన టాప్ 100 చిత్రాల్లో సాగరసంగమం 13 స్థానం దక్కించుకుంది. ఈ సినిమాకు సంగీతం అందించినందుకు ఇళయరాజాకు జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో పాటలు పాడినందుకు గాను SP బాల సుబ్రహ్మణ్యంకి కూడా నేషనల్ అవార్డు వచ్చింది.
రుద్రవీణ (Rudraveena)
ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ సహజంగా ఉంటుంది. చూసే ప్రతీ ప్రేక్షకున్ని ప్రశ్నించే విధంగా ఉంటుంది. వంశపారంపర్యంగా వస్తున్న కర్నాటక సంగీతాన్ని.. తన వారసుడు సూర్యంకు అందించాలని బిలహరి శాస్త్రి తాపత్రయపడుతుంటాడు. పేదల పట్ల చులకన భావం కలిగి ఉంటాడు. దీంతో తండ్రి మాటన పెడచెవిన పెట్టిన సూర్యం.. మత్తులో మునిగి తేలుతున్న ఊరిని దారిలో పెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఈక్రమంలో తండ్రితో ఘర్షణకు దిగి ఇంటికి దూరమవుతాడు. ఈ చిత్రం చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా సరిగా ఆడకపోయినా… నటనలో ఆయన్ను మరో మెట్టు ఎక్కించింది.
డాక్టర్ చక్రవర్తి (Doctor Chakravarty)
తెలుగులో నవలల ఆధారంగా వచ్చిన సినిమాల్లో ఇది ప్రసిద్ధి చెందిన చిత్రం. కోడూరి కౌసల్య దేవి రచించిన చక్రభ్రమణం నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో చాలా పాటలు ‘క్లాసిక్ హిట్స్’గా నిలిచాయి. “ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుకా”, “నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది”, “మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన”వంటి పాటలు దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. మరణించిన చెల్లెల్ని తన స్నేహితుని భార్యలో చూసుకునే వ్యక్తిని ఆ స్నేహితుడు అపార్థం చేసుకోవడం ఈ చిత్రం ప్రధాన కథాంశం.
అహ! నా పెళ్ళంట! (Aha Naa Pellanta)
ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి లక్ష్మిపతి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ఆకట్టుకుంటుంది. ఎలాంటి ద్వంద్వ అర్థాలు లేకుండా, అసభ్యపదజాలం వాడకుండా హస్యాన్ని పండించిన ఘనత జంద్యాలకే దక్కింది.
Aha Naa Pellanta Dialogues
ఈ సినిమాల్లో కొన్ని కామెడీ డైలాగ్స్ చూస్తే అర్థమవుతుంది.
”నన్ను, ఈ రాళ్లు కొట్టి నిప్పు చేయమంటావ్‌రా నిత్యదరిద్రుడా.. నీ పిండం పిచ్చుకులెత్తుకుపోనూ, తొక తెగిన తొండ మొహంలా ఆ మొహం చూడు, పోతావురరేయ్, నాశనమైపోతావ్”…
6 రూపాయల 10 పైసల జీతంలో 6 రూపాయలు కొసెస్తావ్‌రా దొడ్డికాళ్ల దద్దమ్మ..
నీ కళేబరాన్ని కాకులెత్తుకుపోనూ..
పాపం పసివాడు (Papam Pasivadu)
అప్పటి వరకు తెలుగులో వచ్చిన చిత్రాల్లో ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉంటుంది. విమానం కూలి ఓ పిల్లవాడు ఎడారిలో చిక్కుకుంటాడు. ఎడారిలో ఆ పిల్లవాడు ఎదుర్కొన్న పరిస్థితులను చాలా హృద్యంగా చూపారు. ఎడారిలో దారి వెతుక్కుంటూ.. పిల్లవాడు పాడే ‘అమ్మ చూడాలి.. నిన్ను నాన్ను చూడాలి’ అనే పాట ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తుంది.
గూఢచారి 116 (Gudachari 116 )
ఈ సినిమా తెలుగులో స్పై జనర్‌లో వచ్చిన తొలి చిత్రం. కెరీర్ స్టార్టింగ్‌లోనే గూఢచారి 116 లాంటి స్పై సినిమా చేసి తొలి సారి బాండ్ క్యారెక్టర్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు సూపర్ స్టార్ కృష్ణ. ఇదే చిత్రం హిందీలో ఫార్జ్‌గా రీమెక్ అయి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ఆ తర్వాత వచ్చిన అనేక స్పై చిత్రాలకు మార్గదర్శిగా నిలిచింది.
సంపూర్ణ రామాయణం (Sampoorna Ramayanam)
అప్పటి వరకు పద్యరూపకాలతో వచ్చిన పౌరాణిక చిత్రాలకు విభిన్నంగా పూర్తిస్థాయి డైలాగ్స్, సాధారణ వాడుక భాషలో వచ్చిన చిత్రం ఇది. ఎలాంటి పద్యాలు లేకుండా ప్రేక్షకునికి అర్థమయ్యే సులభమైన సంభాషణలతో ఉంటుంది. ఈ చిత్రం రామాయాణాన్ని(Goat Telugu Movies) అద్భుతంగా కళ్లకు కట్టింది. ఈ సినిమాలో రావణాసురుడిగా SV రంగారావు నట విశ్వరూపం చూపారు.
భక్త కన్నప్ప (Bhakta Kannappa)
తెలుగులో వచ్చిన భక్తిరస చిత్రాల్లో ఈ సినిమా ప్రముఖమైంది. శివరాత్రి రోజు.. ఈ చిత్రం టీవీల్లో మారుమోగాల్సిందే. ఈ సినిమాలో కన్నప్పగా కృష్ణంరాజు అమాయకమైన నటన అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా శివుడికి తన రెండు కళ్లను పెట్టే సీన్ భక్తుల హృదయాలను కదిలిస్తుంది.
సింహాసనం (Simhasanam)
ఈ సినిమా తెలుగులో వచ్చిన తొలి 70mm 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్‌తో వచ్చింది. ఈ సినిమా మొదటి వారం 1 కోటి 51 లక్షల 65 వేల 291 రూపాయలు కలెక్ట్ చేసి ఆల్‌టైమ్ స్టేట్ రికార్డ్ క్రియేట్ చేసింది. జానపదాలు కనుమరుగైన రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ ప్రయోగం ద్వారా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది.
స్వయంకృషి (Swayam Krushi)
చిరంజీవికి ఉన్న ఇమేజ్‌కు ఈ చిత్రం పెద్ద సాహసంగా చెప్పవచ్చు. ఆయన తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. చెప్పులు కుట్టే ఓ సాధారణ వ్యక్తి పాత్రలో ఆయన నటించడం గొప్ప విషయం. ఈ సినిమా తర్వాత అనేక మంది ఫుట్‌వేర్ షాపులు, ఫుట్‌పాత్‌లపై చెప్పులు కుట్టే వ్యక్తులు తమ షాపులకు స్వయం కృషి అని పేరు పెట్టుకున్నారు. చిత్రంలో మరో విశేషం ఏమిటంటే.. చిరంజీవి- విజయశాంతి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు.. “అట్టా సూడమాకయ్యా” అని విజయశాంతి బుంగమూతి పెట్టి చిరంజీవిని ఆటపట్టిస్తుంటుంది.
మోసగాళ్లకు మోసగాడు (Mosagallaku Mosagadu)
ఇది తెలుగులో కౌబాయ్ జనర్‌లో వచ్చిన తొలి చిత్రం. అంతేకాదు ఇంగ్లీష్‌లో డబ్ అయిన తొలి భారతీయ చిత్రం మోసగాళ్లకు మోసగాడు. పూర్తిగా కొత్తదైన ఈ క్యారెక్టర్‌ను కృష్ణ అలవోకగా చేశారు. ఈ సినిమాలో హీరోది పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం పొందిన నేరస్తుల్ని పట్టించి డబ్బు సంపాదించే బౌంటీ హంటర్ పాత్ర. ఈ సినిమా ప్రభావం తెలుగు యూత్‌పై పడింది. ఆ సినిమాలో కృష్ణ ధరించిన దుస్తులు ధరించేందుకు ఉత్సాహం చూపారు. ఈ చిత్రం తర్వాత చాలామంది హీరోలు ఈ తరహా పాత్రలు చేసేందుకు మొగ్గు చూపారు. ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణకు స్టార్ ఇమేజ్‌ను అందించింది.
నువ్వు నాకు నచ్చావ్ (Nuvvu Naaku Nachchav)
సినిమా బాగుంటే ప్రేక్షకులు 3 గంటలైనా… థియేటర్లలలో కూర్చొని చూస్తారని చెప్పడానికి ఈ చిత్రం నిదర్శనం. ఈ సినిమాలో పెద్దగా కథ ఏమి ఉండదు. వెంకటేష్ కామెడీ టైమింగ్,(Goat Telugu Movies) ఆర్తి అగర్వాల్ అందం, బ్రహ్మానందం, సునిల్ కామెడీ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ భోజనం కోసం కూర్చున్న సమయంలో అతను చదివే కవిత… వెంకటేష్ ప్రార్థనను ఆ సినిమా చూసిన ప్రేక్షకులు ఎప్పటికి మరచిపోరు.
లవకుశ (Lava Kusa)
ఈ చిత్రం సాహసోపేతమైన పౌరాణిక చిత్రంగా చెప్పవచ్చు. అప్పటి వరకు ఎవరు టచ్ చేయని రామాయణంలోని ఉత్తరకాండను కథా వస్తువుగా తీసుకున్నారు. అంటే రావణుడి సంహారం తర్వాత జరిగిన కథ. సీతా వియోగం, తన కుమారులు లవకుశలతో శ్రీరాముడు యుద్ధం చేయడం, శ్రీరాముడిగా మహా విష్ణువు తన అవతారాన్ని చాలించడం వంటివి ఈ సినిమాలో ప్రధాన ఘట్టాలు.
స్వాతిముత్యం (Swathi Muthyam)
తెలుగులో వచ్చిన ఆల్‌టైమ్ క్లాసిక్ చిత్రాల్లో ఈ సినిమా ఒకటి. లోక జ్ఞానంలేని ఓ అమయాకుడు, పెళ్లై భర్తను కోల్పోయిన ఓ పెద్దింటి మహిళ మెడలో అనుకోకుండా మంగళ సూత్రం కడుతాడు. ఆ తర్వాత వారి జీవితం ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నది కథ. వాస్తవంగా ఈ సినిమాలో పెద్దగా కమర్షియల్ హంగులేమి లేవు. కానీ కళాతపస్వి విశ్వానాథ్ చేతిలో దృశ్య కావ్యంగా చెక్కబడింది. ఈ సినిమాలో కమల్ హాసన్ నటన అద్భుతం, వెర్రిబాగులు వాడిగా ఆ పాత్రకు జీవం పోశారు. అమాయకత్వంతో ఆయన మాట్లాడే మాటలు, ప్రవర్తన జాలి కలిగిస్తాయి. ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య’, ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’, ‘రామా కనవేమిరా’, ‘మనసు పలికే మౌన గీతం’ పాటలు ఆల్‌టైమ్ హిట్స్‌గా నిలిచాయి.
ఆ నలుగుగురు (Aa Naluguru)
మంచి కథా బలంతో నిర్మించిన ఈ చిత్రం ఇది. మనం ఎంత బాగా జీవించినా, ఎంత ధనం సంపాదించినా మనకు కావలసింది ఆ నలుగురు మనుషులే అనే మూల సిద్ధాంతం మీద తీసిన సినిమా ఇది. ఈ చిత్రంలో నీతి నిజాయితి, అంకితభావంతో ఉండే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఆలోచింపజేస్తుంది.
శివరంజని (Sivaranjani)
సినిమా ఇండస్ట్రీ నేపథ్యంగా వచ్చే కథలను ప్రేక్షకులు ఆదరిస్తారు అనే ఉదంతానికి ఈ చిత్రం నిదర్శనం. ఈ సినిమా మహానటి సావిత్రి జీవితంలోని కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించినట్లు దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు చెప్పారు.(Goat Telugu Movies) పల్లేటూరి నుంచి వచ్చిన ఓ యువతి స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుంది. ఆమెను అభిమానించే ఓ పట్టణ యువకుడు అభిమాన సంఘం ఏర్పాటు చేసి ఆరాధిస్తుంటాడు. అతనిలో నిజమైన ప్రేమను కనుగొన్న శివరంజని.. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. మరి ఆమెకు ఎదురైన సమస్యలు ఏమిటి అన్నది స్థూలంగా కథ. ఈ చిత్రంలో జయసుధ, హరిబాబు, మోహన్ బాబు అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో చేసిన విలన్ క్యారెక్టర్ ద్వారా మోహన్ బాబు మరింత పాపులర్ అయ్యారు. “తిరుపతిలో లడ్డూలు… సినిమా స్టార్ల దగ్గర డబ్బులు” లేవంటే ఎవ్వరు నమ్మరు అని చెప్పిన డైలాగ్ వైరల్ అయింది.
ఆకలి రాజ్యం (Aakali Rajyam)
డిగ్నిటి ఆఫ్ లేబర్ ప్రధాన ఇతివృత్తంతో … శ్రీశ్రీ అభ్యుదయ స్ఫూర్తితో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో కమల్ హాసన్ నిరుద్యోగ యువకుడిగా…చెప్పిన శ్రీశ్రీ కవితలు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయి.ఆకలి రాజ్యంలోని మాటలు మన ఆలోచన స్థాయిని మార్చేస్తాయి. “ఎలాగోలా బతకాలంటే ఎలాగైనా బతకొచ్చు, కానీ ఇలాగే బతకాలి అనుకున్నాను అది వీలుపడదు ఈ దేశంలో”..
“వేళకాని వేళలో లేని పోని వాంఛలతో, దారికాని దారులలో, కానరాని కాంక్షలతో దేని కోసం దేవులాడతావు”వంటి డైలాగ్స్‌తో పాటు ఓ మహర్షి, ఓ మహాత్మ.. ఏది నీతి.. “ఏది నేతి, సాపాటు ఏటులేదు పాటైన పాడు బ్రదర్ వంటి సాంగ్స్ జీవితంపై మనకున్న దృక్పథాన్ని మార్చేస్తాయి. అందుకే ఈ చిత్రాన్ని క్లాసిక్‌గా నిలిపింది.
నర్తనశాల (Nartanasala)
మహాభారతంలోని ‘విరాట పర్వం’లో జరిగిన పాండవుల అజ్ఞాతవాస గాథ ఈ చిత్రానికి ఇతివృత్తం. కీచకునిగా ఎస్. వీ. రంగారావు ఆ పాత్రకే వన్నె తెచ్చాడు. “అద్వైతాన్ని అయినా అర్థం చేసుకోవచ్చు కాని, ఆడదాని మనసు అర్థం చేసుకోలేము”, “తిరస్కారం చేస్తే బలత్కారం తప్పదు” వంటి పదునైన డైలాగ్స్‌తో అలరించాడు. ఇక ఈ చిత్రంలో మాట్లాడుకోవాల్సిన మరో పాత్ర బృహన్నల. ఈ పాత్రలో ఎన్టీఆర్ తొలిసారి ఆడ వేషంలో నటించి మెప్పించారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు సాంకేతికంగా అబ్బురపరుస్తాయి. ముఖ్యంగా అర్జునుడు ప్రయోగించిన సమ్మోహనాస్త్రం పనిచేసిన విధం అద్భుతంగా చూపించారు. అస్త్రం పైన ఒక స్త్రీ ప్రత్యక్షమై కూర్చుండి, మత్తుమందు సైన్యంపై చల్లిన విధానం బాగుంటుంది.
భక్తప్రహ్లాద (Bhakta Prahlada)
ఈ చిత్రం ఎస్‌వీ రంగారావు నటనకు మచ్చుతునక. హిరణ్యకశిపుడిగా ఆ పాత్రకు వన్నే తెచ్చారు. ప్రహ్లాదుడిగా తన వయసుకు మించిన పాత్ర చేసిన రోజా రమణికి మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రానికి సంగీతం అదనపు బలాన్ని అందించాయి. సాలూరి రాజేశ్వరరావు బాణిలు వీనుల విందుగా ఉంటాయి. క్లైమాక్స్‌లో హిరణ్యకశిపుడిని నృసింహస్వామి చంపే సమయంలో వచ్చే బీజీమ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
జగదేకవీరుడు అతిలోకసుందరి (Jagadeka Veerudu Athiloka Sundari)
శ్రీదేవి అందం, చిరంజీవి మేనరిజం, రాఘవేంద్రరావు డైరెక్షన్, ఇళయరాజా బాణీలు, జంద్యాల మాటలు ఈ చిత్రాన్ని ఆల్‌టైం క్లాసిక్‌గా మార్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలో దేవకన్య అయిన శ్రీదేవి- సాధారణ మానవునిగా చిరంజీవి మధ్య జరిగే సంభాషణలు ఆకట్టుకుంటాయి. వారిమధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్స్ అలరిస్తాయి.
మానవా! అధరములు మండి పోవు అగ్ని పుట్టినది!అమృతం లేదా మీ ఇంటా!
ఇంద్రజ(శ్రీదేవి): మానవా!
రాజు(చిరంజీవి): నువ్వా పిలుపు మానవా?
ఇంద్రజ: ఒక్క పర్యాయము నీ వామ హస్తాన్ని నా దక్షిణ హస్తానికి అందించెదవా?
అంతస్తులు (Antastulu)
ఈ సినిమాలో ధనము, అధికారము గల జమిందారి జీవితము గురించి చూపించారు. జమిందారు పెద్ద కొడుకు పాత్రలో నాగేశ్వరరావు అద్భుతంగా సెంటిమెంట్ పండించారు. కుటుంబ సమస్యలను పరిష్కరించిన తీరు ఆలోచింపజేస్తుంది. తండ్రి చివరి కోరికను తీర్చి ముందుకు సాగుతాడు. ఈ చిత్రంలో నాగేశ్వరరావు సోదరిగా భానుమతి డ్యాన్సర్‌గా నటించింది. (Goat Telugu Movies)ఆమె నటనకు నేషనల్ ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది. ఈ సినిమా సిడ్నీలో(1966) జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైనది .
కీలుగుర్రం (Keelugurram)
ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో.. కేవలం కెమెరా టెక్నిక్స్ ద్వారా సినిమాను అద్భుతంగా చూపించారు. కీలు గుర్రాన్ని(Goat Telugu Movies) ఆకాశంలో ఎగురుతు వెళ్లే దృశ్యాలు కనులపండవగా ఉంటుంది. “కాదు సుమా కల కాదు సుమ” సాంగ్‌లో ANR, హీరోయిన్‌తో కలిసి కీలుగుర్రంపై ఆకాశంలో విహరించే దృశ్యాలు చూడొచ్చు.
మల్లీశ్వరి (Mallishwari)
గాఢంగా ప్రేమించుకున్న బావ, మరదళ్లు ఆ దేశ రాజు వల్ల విడిపోతారు. వారి విరహ వేదనను మునుపెన్నడు లేని విధంగా బీఎన్ రెడ్డి చిత్రీకరించారు. అనురాగం, ప్రణయం, విజయనగర వైభవం ప్రధాన కథావస్తువులుగా ఉంటాయి. రాచరికపు ఆడంబరాలను, ఆచారాలను చిత్రించినా ఆ సినిమా కమ్యూనిస్టు దేశమైన చైనా లోనే వందరోజులకు పైగా ఆడింది. ఈ సినిమాలోని పాటలు అన్నీ జనాదరణ పొందాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. లంబోదర లకుమికరా, కోతీ బావకు పెళ్ళంట, కోవెల తోట విడిదంట, ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు వంటి పాటలు క్లాసిక్స్‌గా నిలిచాయి. భానుమతి తన గానంతో పాటు నటనతోనూ ఆలరించింది. కోరుకున్న ప్రియురాలు దక్కని బాధలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. సాలూరు రాజేశ్వరరావు అందించిన సంగీతం ఈ చిత్రాన్ని క్లాసిక్‌గా నిలబెట్టాయి.
ప్రేమనగర్ (Premnagar)
తెలుగులోని ప్రేమ కథా చిత్రాల్లో ప్రేమ నగర్ సినిమా ట్రెండ్ సెట్టర్. “ప్రేమనగర్’ సినిమాలో వాణిశ్రీ మేకప్, హెయిర్ స్టైయిల్, వస్త్రధారణ, అప్పట్లో ఫేమస్ అయ్యాయి. అంతేకాదు నవలా నాయికగా వాణిశ్రీకి ఈ సినిమా పెద్ద పేరు తీసుకొచ్చింది. దేవదాసు సినిమా తర్వాత అక్కినేనికి అంతటి పేరును ఈ సినిమా తీసుకొచ్చింది. కేవీ మహదేవన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు రెండు దశాబ్దాలపాటు ప్రేక్షకులను అలరించాయి. ”ఎవరికోసం… ఎందుకోసం”, “తేట తేట తెలుగులా”.., నీకోసం వెలసింది ప్రేమ మందిరం”. ఈ చిత్రంలో ఆత్రేయ డైలాగ్స్ సినిమాకు ప్రాణం పోశాయి అని చెప్పవచ్చు. పాత్రల మధ్య పదునైన సంభాషణలు.. ప్రేక్షకులను కన్నార్పకుండా చేస్తాయి. తన ప్రేయసిని మరచిపోయేందుకు విస్కి తాగే సీన్‌లో ‘పగిలిన హృదయం ముక్కలను ఈ విస్కీతో అతుకుపెడదామనుకుంటున్నా’ అని చెప్పే డైలాగ్ అతని ప్రేమతాలుకు గాఢతను తెలియజేస్తుంది.
దేవదాసు (Devadasu)
తెలుగు కళామతల్లికి మణిహారం లాంటి సినిమా దేవదాసు. అక్కినేని, సావిత్రిల నటనకు, ఘంటసాల గానానికి ఈ సినిమా చరిత్రలో మచ్చుతునకగా నిలిచి పోయింది. భగ్న ప్రేమికులకు “దేవదాసు” అనే పదం తెలుగు సాహిత్యంలో భాగమైపోయింది.
భూకైలాష్ (Bhookailas)
తెలుగులో వచ్చిన పౌరాణిక చిత్రాల్లో ఈ సినిమా ఎపిక్‌గా చెప్పవచ్చు. ఆత్మలింగాన్ని సాధించడం కోసం రావణసురుడు చేసే తపస్సు అద్భుతంగా చూపించారు. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు రావణుడు తన పేగులను బయటకు తీసి రుద్రవీణ వాయించే సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అలాగే కైలాస పర్వాతాన్ని తన భుజస్కందాలపై ఎత్తే సీన్లు అన్ని కలిపి ఈ చిత్రాన్ని ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిపాయి.
అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju)
స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడు మన్యం దొర అల్లూరి సీతారామరాజు జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. తెలుగు వీర లేవర… దీక్ష భూమి సాగర పాట… చాలా మందిలో దేశభక్తిని రగిలించింది. ఈ చిత్రం తెలుగులో తొలి స్కోప్ చిత్రం. అల్లూరిగా సూపర్ స్టార్ కృష్ణ ఆ పాత్రకు జీవం పోశారు. క్లైమాక్స్ సీన్‌లో.. అల్లూరి సీతారామరాజు చెప్పే డైలాగ్స్… గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ సినిమా క్లారెక్టర్లు, గంటం దొర, మల్లుదొర పాత్రలు సినిమాను ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిపాయి అని చెప్పవచ్చు.
గీతాంజలి (Geethanjali)
తెలుగులో వచ్చిన ప్రేమ కథా చిత్రాల్లో ఆల్‌టైమ్ ఎవర్‌గ్రీన్ చిత్రాల్లో ఒకటి. ఈ సినిమాలో ప్రతిదీ ప్రత్యేకంగా ఉంటుంది. నాగార్జున నటన, ఇళయరాజా సంగీతం, లోకేషన్స్ సందర్భోచితంగా వచ్చే డైలాగ్స్, చక్కని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి. ఈ చిత్రంలో సరదా సన్నివేశాలతో పాటు… ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను అలరిస్తాయి.(Goat Telugu Movies) ప్రకాశ్(నాగార్జున).. గీత ఇంటికి ఫొన్ చేసి ఆమెను ఇరికించే సీన్ చాలా సరదాగా ఉంటుంది. ఆ టైంలో కుటుంబం అంతా.. లంచ్ చేస్తుంటుంది. ఫొన్ రాగానే గీతా చెల్లెలు (చాలా తెలివైన ఫన్నీ కిడ్!) లిఫ్ట్ చేస్తుంది. ”గీతక్కా నీకే ఫోన్”… ఎవరో కనుక్కో.. “ఎవరినో ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాము” అన్నవంట..ఎప్పుడెలా అని అడుగుతున్నాడు”అని బిగ్గరగా చెబుతుంది. ఈ సీన్ ప్రేక్షకుల చేత నవ్వులు పూయిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపూ మంచి ఎమోషనల్ జర్నీ క్యారీ అవుతుంది.
సీతారామం (Sita Ramam)
వెండితెరపై ఇప్పటి వరకు ఎన్నో లవ్ స్టోరిలు ప్రేక్షకులకు కొత్తగా అనుభూతిని పంచాయి. అలాంటి అనుభూతిని పంచడానికి వచ్చిన సినిమా సీతారామం.
ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ ఆఫీసర్ రామ్ (దుల్కర్ సల్మాన్). అనాథగా ఉండే రామ్‌కు భార్య అంటూ సీత (మృణాల్ థాకూర్) ఉత్తరం రాస్తుంది. దాంతో తనను ప్రేమిస్తున్న సీతను వెతుక్కుంటూ రామ్ వెళ్తాడు. సీతను కలిసిన తర్వాత రామ్ జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలు వారిని విడిపోయేలా చేస్తుంది. మల్టీ లేయర్స్ ఉన్న ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సీతతో రామ్ రాజమండ్రి ప్రయాణం, వరంగల్ ఎపిసోడ్ గుండెను కుదిపేస్తాయి. ఇక ప్రీ క్లైమాక్స్‌కు ముందు నుంచి సాగే కథ ప్రేక్షకుడి హృదయాన్ని కలిచే వేసేలా ఉంటుంది. రామ్, సీత ఒక అద్బుతమైన నోట్‌తో ముగియడంతో ఫీల్‌గుడ్‌గా మారుతుంది. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ప్రతీ ప్రేక్షకుడిని పాత్రలు, సన్నివేశాలు వెంటాడుతాయి.
జయభేరి (Jayabheri)
తెలుగులో ఆల్‌టైం క్లాసిక్ చిత్రాల్లో ఈ సినిమా ఒకటి. సినిమాలో పాటలు బాగా హిట్టయ్యాయి. ‘రాగమయీ రావే అనురాగమయీ రావే’.., ‘రసికరాజ తగువారముకామా’ అగడు సేయ తగవా ఏలుదొరవు అరమరకలు.. వంటి పాటలు చాలాకాలం సినిమా సంగీత ప్రియుల ఆదరణకు నోచుకొన్నాయి.
బొబ్బిలి యుద్ధం (Bobbili Yuddham)
బొబ్బిలి యుద్ధం తెలుగు నాట జరిగిన యదార్థ గాథ. ఈ యుద్ధం నాటి సంగతులు నేటికి జానపదాలుగా జనాల నోట నానుతుంటాయి. రెండు ప్రధాన రాజవంశాలు, బొబ్బిలి, విజయనగరం ఇరుగుపొరుగు సంస్థానాలు. ఈ రెండింటి మధ్య వైరమే బొబ్బిలి యుద్ధానికి దారితీసింది. రంగానాయుడిగా ఎన్టీఆర్, తాండ్రపాపరాయుడిగా ఎస్‌వీ రంగారావు, భానుమతి వంటి హేమా హెమీలు ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి అలరించారు. అనాటి రాజకీయాలు, స్వదేశి సంస్థానాల్లో ఐరోపా శక్తుల ప్రమేయం వంటి అంశాలు ఈ సినిమా కళ్లకు గట్టింది.
ముత్యాల ముగ్గు (Mutyala Muggu)
ఈ చిత్రం తెలుగులో ఎవర్‌గ్రీన్ క్లాసిక్ చిత్రం. ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన రావ్‌గోపాల్‌రావు తన నటనతో మరో 30 ఏళ్లకు తిరుగులేని విలన్‌గా పునాది వేసుకున్నాడు. ఈ సినిమా క్లాసిక్ నిలవడానికి అనేక అంశాలు దోహదపడ్డాయి. విలన్ అంటే కండలు తిరిగిన దేహం, భయంకరమైన రూపం ఉండాలన్న సాంప్రదాయన్ని పక్కకు పెట్టింది ఈ సినిమా. రావ్‌గోపాల్‌రావు ద్వారా కొత్త విలన్ శైలీ ప్రేక్షకులకు పరిచయం అయింది.
Mutyala Muggu Dailogues
ఈ చిత్రంలోని డైలాగ్స్.. సినిమా నిఘంటువులో చేరాయి. ”సెగట్రీ! పైనేదో మర్డరు జరిగినట్టు లేదూ ఆకాసంలో!….సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ”? ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కూసంత కలాపోసనుండాల. ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది?”.
అలాగే ఈ చిత్రంలో కలర్ గ్రేడింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అప్పటి వరకు లేని కొత్త అనుభూతిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. లైట్లు వాడకుండా.. శాటిన్ క్లాత్‌తో అవుట్ డోర్ సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు సినిమాటో గ్రాఫర్ ఇషాన్ ఆర్య. ముత్యాల ముగ్గులోని పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అన్ని పాటలు జనాదరణ పొందాయి.(Goat Telugu Movies) ఇప్పటికీ తెలుగు వాళ్ల లోగిళ్లలో ధ్వనిస్తుంటాయి. ముత్యమంతా ముగ్గు ముఖమెంతో ఛాయ, ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది వంటి పాటలు ఈ చిత్రాన్ని తెలుగు వారి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందేలా చేసింది.
బైరవద్వీపం (Bhairava Dweepam)
మాస్ యాక్షన్, ప్రేమ కథా చిత్రాలతో దూసుకెళ్తున్న రోజుల్లో మరోసారి తెలుగు జానపద వైభవాన్ని ప్రేక్షకులకు గుర్తు చేసింది ఈ సినిమా. ముఖ్యంగా ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా తీర్చి దిద్దాడు కబీర్ లాల్. ఆయన గతంలో ఆదిత్య 369కు పనిచేశారు. “నరుడా ఓ నరుడా ఏమి కోరిక” పాటలో ఆయన కెమెరా పనితనం కనబడుతుంది. ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ మరో అంశం కాస్ట్యూమ్స్. శాపగ్రస్థుడిగా.. అంద వీహినంగా బాలకృష్ణ కనిపించేలా చేయడంలో డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్‌రావు సక్సెస్ అయ్యారు. పరిమితమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఆరోజుల్లో విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమా ఎప్పటికీ గుర్తిండిపోయేలా చేశాయి.
మాతృ దేవో భవ (Matru Devo Bhava)
విధివశాత్తూ భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, క్యాన్సర్ సోకి తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని తన ముగ్గురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పడే తపన, ఆరాటమే ఈ సినిమా. ఈ చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం భావోద్వేగపూరితమైన సన్నివేశాలకు మరింత గాఢతను పెంచాయి. ఈ చిత్రంలో వేటూరి సుందర్రామూర్తి రాసిన పాటల్లోని సాహిత్యం ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తుంది. రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే, ‘వేణువై వచ్చాను భువనానికి ‘ వంటి పాటలు కంటతడి పెట్టిస్తాయి. క్లైమాక్స్ సీన్‌లో మాధవి తన పిల్లల కోసం తనను బ్రతికించమని దేవుళ్లను ప్రార్థించే సన్నివేశం వీక్షకుల హృదయాలను బరువెక్కిస్తుంది.
శివ (Shiva)
తెలుగులో శివ సినిమా ట్రెండ్ సెట్టర్. కాలేజీ రాజకీయాలను ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం చేశాడు రామ్‌గోపాల్ వర్మ. అప్పటి వరకు ఒక మూసలో పోతున్న తెలుగు సినిమాను ‘శివ’ చిత్రంతో పూర్తిగా మార్చేసాడు. అప్పటి వరకు తెలుగు సినిమాల్లో ఫైట్లు, సీన్లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ రకంగా ఉండాలన్న దానికి ‘శివ’తో బ్రేక్ చేసాడు. ఈ సినిమాలో నాగార్జున సైకిల్ చైన్ లాగే సీన్ మాస్ ఎపిక్. తన పైకి పంపిన మనిషిని శివ భుజాన వేసుకొని నేరుగా భవానీ ఎదుటకి వెళ్ళే సమయంలో నానాజీ(తనికెళ్ల భరణి) భవానీ(రఘువరన్) చెవిలో చిన్నగా శివ అంటే వీడే అని చెప్పే పతాక సన్నివేశం గూస్ బంప్స్ తెస్తుంది. ఈ చిత్రం తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ శివకు ముందు ఆ తర్వాత అనేలా ప్రభావం చూపింది. తెలుగులో సౌండ్ ఎఫెక్ట్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఇళయరాజా సంగీతం, BGM బిగ్గెస్ట్ అసెట్స్. భవానిగా రఘువరన్ విలనిజం కొత్త ట్రెండ్ సెట్ చేసింది. జెడి పాత్ర చక్రవర్తికి స్థిరపడిపోయింది. (జెడి చక్రవర్తి అని చెబితే తప్ప ఏ చక్రవర్తో పోల్చుకోలేనంతగా).
తొలి ప్రేమ (Tholi Prema)
తెలుగులో వచ్చిన ప్రేమ కథ చిత్రాల్లో తొలి ప్రేమ చిత్రం ఒకటి. ఈ చిత్రంలో దీపావళి రోజున మతాబులు విరజిల్లే వెలుగులో హీరోయిన్ ఇంట్రడక్షన్ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ అని చెప్పవచ్చు. ఇక సినిమాలో బాలు, తన చెల్లెలు, తన ఫ్రెండ్స్ మధ్య వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్ సీన్లు ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి.
జెర్సీ (Jersey)
కలలు కనడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు( Never late to dream) అనే ట్యాగ్‌పై ఈ చిత్రం వచ్చింది. తెలుగులో వచ్చిన బలమైన స్పోర్ట్స్ డ్రామా చిత్రాల్లో ఈ సినిమా ఒకటి. హీరో రంజీ టీమ్‌కు సెలెక్ట్ అయినప్పుడు రైల్వే స్టేషన్‌కు వెళ్లి రైలు వెళ్తున్నప్పుడు తన ఆనందం, బాధను వెలిబుచ్చే సీన్ నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. క్లైమాక్స్ సీన్‌లో తన జట్టును గెలిపించుకునేందుకు అతని పోరాటం ప్రేక్షకులను కదిలిస్తుంది. ఈ సినిమాకు మరో బిగ్ అసెట్ నాని నటన. వీటితో పాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సంగీతం, స్ఫూర్తి వంతమైన పాటలు ఈ సినిమాను క్లాసిక్‌గా నిలిపాయి.
జంబ లకిడి పంబ (Jamba Lakidi Pamba)
తెలుగులో ‘జంబ లకిడి పంబ’ చిత్రం ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. మగవారు ఆడవారిగా మారితే పరిస్థితులు ఎలా ఉంటాయన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ యూట్యూబ్‌లో ఈ సినిమా క్లిప్స్ పెట్టుకొని చూస్తుంటారు ఆడియన్స్.
మన్మథుడు (Manmadhudu)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ ఈ చిత్రాన్ని క్లాసిక్‌గా నిలిపాయి. ఈ చిత్రంలో నాగార్జు కామెడీ టైమింగ్… ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. మరికొన్ని డైలాగ్స్ ప్రేక్షకులను కదిలిస్తాయి.
Manmadhudu Movie Dailogues:
నాగ్: ముందు మీరావిడని ప్రేమించారా? లేక ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా?
బ్రహ్మీ: ముందు తను నన్ను ప్రేమించింది… తర్వాత నేను తనని ప్రేమించాల్సి వచ్చింది.
“నువ్వు చూస్తున్న అభి అభి కాదమ్మా, వాడు వేరు, వాడి ప్రేమ ఒక సముద్రం, వాడి జాలి ఒక వర్షం, వాడి కోపమొక ప్రళయం”
బొమ్మరిళ్లు (Bommarillu)
తన సొంతకాళ్లపై నిలబడాలని చూసే కొడుకు.. కొడుకు అడిగినదానికంటే ఎక్కువ ఇచ్చి సంతోషపెట్టాలని చూసే తండ్రి మధ్య సంఘర్షణ ఏర్పడితే ఆ ప్రతి రూపమే ఈ చిత్రం. ఈ సినిమా తర్వాత చాలా మంది తండ్రులు తమ పిల్లలపై ఉన్న దృక్పథాన్ని మార్చేలా చేసింది. ఈ చిత్రం తర్వాత నిజ జీవితంలో స్టిక్‌గా ఉండే తండ్రిని ‘బొమ్మరిళ్లు ఫాదర్’ అనే ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇక ఈ చిత్రంలో సిద్ధార్థ నటన, జెనిలియా అమాయకత్వం, అల్లరి సినిమాను క్లాసిక్‌గా నిలిపాయి.
ప్రేమాభిషేకం (Premabhishekam)
ఈ చిత్రం తెలుగు సినిమాలపై గణనీయమైన ప్రభావాని చూపించింది. ఈ సినిమా స్ఫూర్తితో ‘బొబ్బిలి సింహం’ ఓయ్ వంటి సినిమాలు వచ్చాయి. బలమైన దాసరి నారాయణరావు కథనం, శ్రీదేవి అందం, నాగేశ్వరరావు నటన ఈ సినిమాను క్లాసిక్‌గా నిలిపాయి.(Goat Telugu Movies) తాను చనిపోతానని తెలిసి… తన ప్రేయసి సుఖం కోసం ANR పడే తపన ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తుంది. ఫస్టాప్‌లో నాగేశ్వరరావు, శ్రీదేవిని ఆటపట్టించే చిలిపితనం, సెకాండాఫ్‌లో భావోద్వేగపూరితమైన సన్నివేశాలు ప్రేక్షకున్ని రంజింపజేస్తాయి. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పాలి. ఈచిత్రంలోని అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి.
మేఘసందేశం (Meghasandesam)
ఈ చిత్రంలోని పాటల సాహిత్యం ప్రేక్షకులను రంజింపజేస్తుంది. వేటూరి, దేవులపల్లి కృష్ణశాస్త్రి అందించిన సాహిత్యం సినిమాకు ప్రధాన బలాన్ని అందించాయి. ఈ చిత్రంలో ప్రకృతిని ఆరాధించే కవిగా నాగేశ్వరరావు నటన అద్భుతంగా ఉంటుంది.
గ్యాంగ్ లీడర్ (Gang Leader)
మెగాస్టార్ చిరంజీవికి మాస్ ఇమేజ్‌ను మరింత పటిష్టం చేసిన చిత్రమిది. “చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో! రఫ్ ఆడించేస్తాను” అనే డైలాగ్ జనాల్లోకి చొచ్చుకెళ్లి పోయింది. ఈ చిత్రంలో విజయశాంతి, చిరంజీవితో పోటీపడి మరి నటించింది. తన అన్న చదువు కోసం చేయని నేరాన్ని చిరంజీవి తనపై వేసుకుని జైలుకు వెళ్లే సీన్, తన పెద్దన్నయ్య చావుకు ప్రతీకారం తీర్చుకునే పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
ప్రస్థానం (Prasthanam)
‘ఒక్కసారి పురాణాలు దాటి వచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప, హీరోలు, విలన్‌లు లేరీ నాటకంలో’ అనే డైలాగ్‌తో ప్రారంభమయ్యే సినిమా ప్రస్థానం. రాజకీయాల్లో ఉన్న కొత్త కోణం, మనుషుల్ని నడిపించే అహాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది.
మహానటి (Mahanati)
ఈ చిత్రం మహానటి సావిత్రి తెరవెనుక జీవితాన్ని ఆవిష్కరించింది. పేదరికాన్ని దాటి సినిమా స్టార్‌గా ఎదగడంలో సావిత్రి పడిన కష్టాలు, ఆమె వ్యక్తిత్వం, దాతృత్వం, సావిత్రి జీవితంలో దాగివున్న ఇతర కోణాలను వెలుగులోకి తెచ్చింది.
ఓసెయ్ రాములమ్మ (Osey Ramulamma)
భూస్వాములైన దొరల ఆగడాలకు వ్యతిరేకంగా ఓ దళిత మహిళ చేసిన పోరాటమే ఈ చిత్రం. ఆ టైంలో ఆర్ నారాయణ మార్తి విప్లవ సినిమాలతో ప్రభంజనం సృష్టిస్తుండటంతో ఆయన గురువైన దాసరి నారాయణ రావు విప్లవాత్మత సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రంలో రాములమ్మగా విజయశాంతి నటన ప్రేక్షకులను కదిలిస్తుంది. ముఖ్యంగా ఆడదాని మానం, మర్యాదల గురించి చెప్పే సన్నివేశంలో ఆమె నటన సినిమా చూసిన ప్రేక్షకులను వెంటాడుతుంది. భూస్వామిగా జగన్నాయక పట్వారిగా రాంరెడ్డి నటన ప్రేక్షకులను రంజింపజేస్తుంది. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం మరో బిగ్ అసెట్‌గా చెప్పవచ్చు. ఓ ముత్యాల బొమ్మా.., ‘లచ్చులో లచ్చన్నా’, ‘ఏ అసురుడు సృష్టించిన పంచమ వేదం’ వంటి పాటలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలోని పాటలన్ని ప్రజాకవులే రాయడం విశేషం.
ఠాగూర్ (Tagore)
ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతిని అంతమొందించే ACF అధినేతగా మెగాస్టార్ చిరంజీవి నటన అద్భుతం. క్లైమాక్స్‌లో.. కోర్టు హాలులో సమాజంలో పేరుకుపోయిన అవినీతి, లంచగొండితనం గురించి ఆయన చెప్పే డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. “ప్రభుత్వంతో పని చేయించుకోవటం మన హక్కు, ఆ హక్కుని లంచంతో కొనొద్దు అన్న చిరంజీవి స్వరంతోనే చిత్రం ఆరంభం, అంతం అవుతుంది”.
Seetharamaiah Gari Manavaralu
ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు తొలి సారి విగ్గు లేకుండా నటించారు. సీతారామయ్య గారి మనవరాలు సినిమా తెలుగు సినీరంగంలో నిలిచిపోయే విజయాన్ని సాధించింది. ఈ సినిమా ప్రభావం తదనంతర కాలంలోని పలు చిత్రాలపై పడింది. గోవిందుడు అందరివాడేలే చిత్రంపై పాక్షికంగా సీతారామయ్యగారి మనవరాలు సినిమా ప్రేరణగా కనిపిస్తుంది. ఈ సినిమా కన్నడ, హిందీ భాషల్లో రీమెక్ అయి సంచలన విజయం సాధించింది.
ఖైదీ (Khaidi)
మెగాస్టార్ చిరంజీవికి స్టార్ డం అందించిన చిత్రం ఖైదీ. ఈ చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఈ సినిమాలో ‘రగులుతుంది మొగలి పొద’ పాటకు చిరంజీవి డ్యాన్స్ హైలెట్. ఈ చిత్రంలో చిరంజీవి యాక్టింగ్ మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసింది. చిరంజీవిని అగ్రనటునిగా, కోదండరామిరెడ్డికి స్టార్ డైరెక్టర్‌గా, పరుచూరి సోదరులును ప్రముఖ రచయితలుగా ఈ చిత్రం నిలిపింది.
యమలీల (Yamaleela)
ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా కేవలం కథా బలంతో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రమిది. హాస్యరస ప్రధానమైన సోషియో ఫాంటసీ చిత్రం. ఈ చిత్రంలో యముడిగా సత్యనారాయణ నటన అబ్బురపరుస్తుంది. ముఖ్యంగా భూలోకానికి వచ్చి భవిష్యవాణి పుస్తకం కనిపెట్టేందుకు అతను పడే పాట్లు అలరిస్తాయి. తన తల్లి ప్రాణాలు దక్కించుకునేందుకు అలీ పడే తాపత్రయం(Goat Telugu Movies) ప్రేక్షకులను కదిలిస్తుంది. ఇక చిత్రంలోని ‘నీ జీన్ పాయింటు చూసి బుల్లెమ్మో, ‘అభివందనం యమరాజగ్రణి’, ‘జుంబారే, జుంజుంబరే’ వంటి సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
మేడమ్ (Madam)
ఈ చిత్రం ఓ సంచలనంగా చెప్పవచ్చు. రాజేంద్ర ప్రసాద్ పూర్తి స్థాయిలో మహిళ వేషంలో నటించిన చిత్రమిది. స్టారో హోదాను పక్కకు పెట్టి ఇలాంటి క్యారెక్టర్ చేయడం నిజంగా సాహసమనే చెప్పాలి. స్నేహితుడి బామ్మ చివరి కోరిక తీర్చేందుకు రాజేంద్ర ప్రసాద్ మహిళగా మారి అతన్ని వివాహం చేసుకుంటాడు. మహిళా సాధికారత కోసం ఆమె ఉద్యమించడంతో మేడమ్‌గా ప్రసిద్ధి పొందుతుంది. తాను మహిళగా కవర్ చేసుకునేందుకు రాజేంద్ర ప్రసాద్ పడే కష్టాలు ప్రేక్షకులను నవ్విస్తాయి
దృశ్యం (Drushyam)
ఆపద వస్తే తన కుటుంబం కోసం ఎంత దూరమైన ఒక తండ్రి వెళ్తాడని ఈ సినిమా ద్వారా చూపించారు. ఈ చిత్రంలో మరోసారి వెంకటేష్ తనదైన నటనతో ప్రేక్షకులను కదలించాడు. తన కుటుంబం చేసిన హత్యను కప్పిపుచ్చేందుకు అతని వేసే ప్లాన్స్ థ్రిల్లింగ్ ఉంటాయి. సస్పెన్స్ సీన్లలో వెంకటేష్ నటన హైలెట్‌గా ఉంటుంది. ఓ మధ్యతరగతి పెద్దకు తన కుటుంబమే ప్రపంచమని… ఆ కుటుంబానికి హాని తలపెట్టడానికి ఎవరు వచ్చినా వారిని అంతమొందించే మొండి ధైర్యం చూపుతారని ఈ సినిమా ద్వారా చూపించారు.
చిక్కడు దొరకడు (Chikkadu Dorakadu)
విఠలాచార్య డైరెక్షన్‌లో వచ్చిన జానపద చిత్రమిది. ఇందులో ఎన్టీఆర్, కంతారావు పోటా పోటీగా చేసే కత్తి యుద్ధ విన్యాసాలు ఆకట్టుకుంటాయి.
దేవత (Devatha)
తెలుగు సినిమాల్లో ఆల్‌టైం క్లాసిక్ చిత్రం దేవత. ఈ సినిమా చూస్తున్నంతా సేపూ నటీనటులు కనిపించరు. ఆ పాత్రలే మనకు కనిపిస్తాయి. శోభన్ బాబు- శ్రీదేవి మధ్య రొమాన్స్, శ్రీదేవి- జయప్రద మధ్య సెంటిమెంట్ సీన్లు ప్రేక్షకులను కదిలిస్తాయి. ఈ చిత్రంలో ఆత్రేయ రాసిన పాటలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. “ఎల్లువచ్చి గోదారమ్మ”, ”కుడి కన్ను కొట్టగానే” వంటి క్లాసిక్ సాంగ్స్ ఈ సినిమాలోనివే.
అన్నమయ్య (Annamayya)
తెలుగులో వచ్చిన భక్తిరస చిత్రాల్లో ఈ సినిమా ఆల్ టైమ్ ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. ఈ చిత్రంలో తిరుమల అందాలు, అన్నమయ్యగా నాగార్జున నటన, వెంకటేశ్వరుడిగా సుమన్ నటన, కీరవాణి సంగీతం ఈ చిత్రాన్ని క్లాసిక్‌గా నిలిపాయి. విన్నపాలు వినవలే వింతవింతలు, కొండలలో నెలకొన్న, అదివో అల్లదివో పాటలు భక్త జనాన్ని ఉర్రూతలూగించాయి. ఈ చిత్రంలోని కొన్ని ప్రత్యేకతను చాటుకుంటాయి. ముఖ్యంగా తన మరదళ్ల సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్న అన్నమయ్యకు గోవిందుడు అసలైన సౌందర్యం అంటే ఏమిటో చూపించే సీన్ అద్భుతంగా ఉంటుంది. అలాగే.. పతాక సన్నివేశంలో అంతర్యామిని పాటతో అన్నమయ్య తనువు చాలించే సీన్ ప్రేక్షకులను కదిలిస్తుంది.
విక్రమార్కుడు (Vikramarkudu)
తెలుగులో వచ్చిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాల్లో విక్రమార్కుడు ఒకటి. ఈ చిత్రంలో విధి నిర్వాహణ గురించి, భయం గురించి ప్రకాశ్ రాజ్‌కు వివరించే సీన్ నిజంగా ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. “చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో బెరుకు ఉండకూడదు, నా మూతిమీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సర్”, “మన గురించి వందేళ్లు చెప్పుకోవాలంటే, వందేళ్లు బతకాల్సిన పని లేదు. ఒక్క రోజు బతికినా వెయ్యేళ్లు చెప్పుకునేలా బతకాలి!” అలాగే.. విక్రమ్ రాథోడ్‌ను ఇంటికి పిలిచి అవమానించేందుకు విలన్ ప్రయత్నించినప్పుడు.. తన ప్రమేయం లేకుండా అతన్ని చంపే సీన్ హైలెట్‌గా ఉంటుంది. అలాగే ఈ చిత్రంలోని BGM విక్రమార్కుడు క్యారెక్టర్‌ను ఎలివేట్ చేయడంతో పాటు సినిమాకు ప్రాణంగా నిలిచింది. అత్తిలి సత్తిబాబు కామెడీ, అనుష్క గ్లామర్, కీరవాణి మ్యూజిక్ సినిమాను క్లాసిక్‌గా నిలిపాయి.
వేదం (Vedam)
సమకాలిన సమాజం పోకడలను ఈ చిత్రం విశదీకరించింది. మనుషుల ఆలోచనలు, కోరికలు, మానవ సంబంధాలు వంటి వాటిని సూటిగా ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చేసింది. ఈ చిత్రంలో డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని చూసే కేబుల్ రాజు(అల్లు అర్జున్), వేశ్య సరోజ (అనుష్క), కోడుకు చదువు కోసం కిడ్నీ అమ్ముకునే ఓ మహిళ చుట్టూ కథ తిరుగుతుంది. ఈ చిత్రంలో తన దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు(Goat Telugu Movies) చేస్తున్న పోలీసును ఉద్దేశించి సరోజ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను కదిలిస్తుంది. “మేము గుడ్డలు విప్పి అమ్ముడు పోతాం… మీరు గుడ్డలు వేసుకుని అమ్ముడు పోతారు”. “ఏ ఉద్యోగానికైనా.. ఎంత అనుభవం ఉంటే అంత ఎక్కువ జీతం వస్తుంది.. మనది ఒక్కటే, ఎంత అనుభవం తక్కువ ఉంటే అంత డబ్బులు ఎక్కువ వస్తాయ్”
బాహుబలి 2 (Baahubali 2)
భారతీయ సినిమా ప్రయాణంలో ఈ సినిమాను గొప్ప మైలురాయిగా చెప్పవచ్చు. బాహుబలికి ముందు ఆ తర్వాత అనే విధంగా ఈ చిత్రం ట్రెండ్ సెట్ చేసింది. ‘బాహూబలి’ చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు మహిష్మతి సామ్రాజ్యంలో మునిగి తేలుతాడు. రాజమౌళి సృజనాత్మకతకు తగ్గట్టు ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ మాహిష్మతి సామ్రాజ్యాన్ని, కుంతల దేశాన్ని చాలా అద్భుతంగా రూపొందించారు. ఇక వాటిని సిల్వర్ స్క్రీన్ మీద గొప్పగా కనబడేలా ఆర్.సి. కమల్ కణ్ణన్ ప్రపంచస్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌ను, సెంథిల్ కుమార్ అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. వీరి నలుగురి పనితనం.. ప్రేక్షకులకు సీట్లలోనే కట్టిపడేస్తాయి. ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక్కో పాత్రను మహాభారతంలోని పాత్రలకు తీసిపోని విధంగా శ్రద్ధగా బలంగా రూపొందించారు. అమరేంద్ర బాహుబలి, కట్టప్ప, దేవసేన, బిజ్జలదేవుడు, శివగామి వంటి క్యారెక్టర్స్ సినిమా అయిపోయాక కూడా ప్రేక్షకులను వెంటాడుతాయి.
ఇక ప్రభాస్ హీరోయిజం, ముఖ్యంగా కోర్టు సీన్‌లో అనుష్కను బందీచేసినప్పుడు… సైన్యాధిపతి తలను బాహుబలి తెగనరికే సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. మరోవైపు భల్లాలదేవుని పాత్రలో రానా జీవించాడు. ఆ క్యారెక్టర్‌లో స్వార్థం, రాజుననే అహం, బలవంతుడిగా అతని నటన, హావభావాలు, సిసలైన విలనిజం అంటే ఏమిటో ప్రేక్షకులకు చూపించింది. ఇన్ని బలమైన అంశాలు ఈ చిత్రాన్ని అల్‌టైం గ్రెటెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిపింది.
రంగస్థలం (Rangasthalam)
రంగస్థలం చిత్రం.. సమాజంలో వాస్తవికతకు చాలా దగ్గరగా ఉండే కథ. ఈ చిత్రంలోని పాత్రలు సినిమాతో ప్రేక్షకుడు లీనమమయ్యేలా చేస్తాయి. ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతుంది. ప్రథమార్థంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర పరిస్థితులకు అనుగుణంగా కఠినంగా మారి పతాక సన్నివేశాల్లో క్రూరంగా మారిన తీరు ప్రేక్షకులను చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లో చిట్టిబాబు నటన అత్యంత సహజంగా ఉంటుంది. చెవిటివాడిగా ఆయన చేసిన ఈ పాత్ర నటుడిగా మరో మెట్టు ఎక్కించిందని చెప్పవచ్చు. ఎక్కడా బెరుకు లేకుండా పాత్రలో లీనమయ్యాడు. ఇక ఈ చిత్రంలో పల్లెటూరి యువతి పాత్రలో రామలక్ష్మిగా సమంత పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది. ఆమెకు, చరణ్ కు మధ్యన నడిచే ప్రతి సన్నివేశం అందంగా, ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. చరణ్ అన్నయ్య కుమార్ బాబు, రంగమ్మత్తగా అనసూయ, విలన్ పాత్రలో జగపతిబాబులు కథను రక్తి కట్టించే నటన కనబర్చారు. దేవీశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రత్నవేలు కెమెరా మ్యాజిక్, రామకృష్ణ, మౌనికల ప్రొడక్షన్ డిజైన్ ప్రేక్షకుడ్ని కొత్త ప్రపంచంలోకి వెళ్లెలా చేస్తాయి.
బలగం (Balagam)
తెలుగులో వచ్చిన ఆల్‌టైం క్లాసిక్ చిత్రాల్లో బలగం కూడా చేరుతుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆయా పాత్రల జీవితాలను మనం దగ్గరనుండి చూస్తున్న భావన కలుగుతుంది. తెలంగాణ యాసలో వచ్చిన ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. అమాయకపు పాత్రలను రాసుకుని వాటిని చక్కగా తెరమీద ఆవిష్కరించిన డైరెక్టర్‌ను వేణును అభినందించాలి. సందర్భానుసారంగా పాత్రల మధ్య వచ్చే సున్నితమైన హాస్యం సినిమాకు బాగా ప్లస్ అయింది. ఎమోషనల్ సీన్లను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. హీరోగా ప్రియదర్శి, హీరోయిన్‌గా కావ్యా కళ్యాణ్ రామ్ నటన సహజంగా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషనల్ సీన్లను బాగా ఎలివేట్ చేశాయి. బలరామ నర్సయ్యో సాంగ్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను హృదయాలను కదిలిస్తాయి. ఈ సినిమాను చిన్న సినిమాల్లో బాహుబలి చిత్రంగా పొల్చవచ్చు.
ఐతే (Aithe)
‘ఐతే’ స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంది. డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి కథనాన్ని వేగవంతంగా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించాడు. సందర్భానుసారంగా వచ్చే కామెడీ బాగుంటుంది. కళ్యాణి మాలిక్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. ఈ సినిమాలోని సింగిల్ సాంగ్ మంచి మూడ్ అందిస్తుంది. నేపథ్య సంగీతం చాలా యాప్ట్‌గా ఉంటుంది. ఎలాంటి స్టార్స్ లేని ఈ సినిమా ప్రేష్ మూడ్‌ను, ప్రేక్షకుడు ఎంజాయ్ చేసేలా ఉంటుంది.
ఆనంద్ (Anand)
ఈ చిత్రం చాలా ఫ్రెష్‌నెస్‌తో పాటు క్లాస్‌గా ఉంటుంది. కె బాలచందర్, కె విశ్వనాథ్, బాపు వంటి దిగ్గజాలు చేసిన పాత క్లాసిక్ సినిమాలా ఈ చిత్రం చూస్తున్నంతసేపు కలుగుతుంది. కమలినీ ముఖర్జీ.. రూప పాత్రను చక్కగా పోషించింది. అప్పటి వరకు హీరోయిన్ అంటే హీరో అడుగు జాడల్లో నడిచిం, 5 డ్యూయెట్ సాంగ్స్‌కే పరిమితమయ్యేది. అలాంటి భావనను ఈ సినిమా చెరిపేసింది. స్వతంత్ర భావాలున్న యువతిగా చక్కగా చూపించారు. తెలుగింటి ఆడపడుచులా అందమైన రూపం, అంతే అందంతో ఆమె చిరునవ్వు, అన్ని భావాలను వ్యక్తికరించే కళ్లు ప్రేక్షకులను మైమరిపిస్తాయి.
బొబ్బిలి పులి
మీ పేరు?
బొబ్బిలి పులి,
అసలు పేరు?
బొబ్బిలి పులి (Bobbili Puli)
న్యాయస్థానంలో శ్రీదేవి అడిగే ప్రశ్నలకు ఎన్టీఆర్ ఆవేశంగా చెప్పే డైలాగ్స్ ఇవి. ఎన్టీఆర్ కోర్టు హాలులోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఆయన చెప్పే ప్రతి డైలాగ్ ఉర్రూతలూగిస్తుంది. దాదాపు 13 నిమిషాల పాటు సాగే కోర్టు సీన్‌తోనే సినిమా ముగిస్తుంది. బొబ్బిలి పులికి ఉరి శిక్ష విధించినప్పుడు.. న్యాయమూర్తిని ప్రశ్నించే తీరు.. ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. పైకోర్టుకు వెళ్తే ఏమవుతుందని ప్రశ్నిస్తాడు. శిక్ష తగ్గించవచ్చు, లేదా ఇదే శిక్షను అమలు చేయవచ్చు. కోర్టు, కోర్టుకి.. తీర్పు తీర్పుకి ఇంత మార్పు ఉంటే.. మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్లా అని ప్రశ్నిస్తాడు.
ఖుషి (Kushi)
నిజానికి ఈ సినిమాలో కథ లేదు. 3 గంటల పాటు సినిమా మొత్తం చక్కని స్క్రీన్‌ప్లేతో నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రతి విభాగంలోనూ తన సత్తా చాటాడు. అది డైలాగ్ డెలివరీ అయినా, ఫైటింగ్ అయినా, పాడినా లేదా డ్యాన్స్ అయినా. పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్ కిర్రాక్‌గా ఉంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్- భూమిక మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. తన నడుము చూశావు అని భూమిక, పవన్‌తో గొడవపడే సీన్ చాలా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఆరు పాటలతో పాటు, పవన్ కళ్యాణ్ యాప్టెడ్ డ్యాన్స్ అలరిస్తాయి.(Goat Telugu Movies) మణిశర్మ సంగీతం, పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం సినిమాకు మరో అసెట్‌గా చెప్పవచ్చు. ఇవన్నీ సినిమాను క్లాసిక్‌గా నిలిపాయి.
1: Nenokkadine
తెలుగులో వచ్చిన తొలి సైకలాజికల్ చిత్రం ఇది. ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ విషయం మహేష్ క్యారెక్టరైజేషన్ సింప్లీ సూపర్బ్‌గా ఉంటుంది. ఎమోషనల్, సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేసే సన్నివేశాల్లో మహేష్ యాక్టింగ్ ఉంటుంది. సినిమా కథ చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ స్క్రీన్‌ప్లే చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇలాంటి ప్రయోగం తెలుగులో మొదటిసారి చెప్పవచ్చు. గోవాలో జరిగే కొన్ని సీన్లు ఇవి నిజమా? అబద్దమా అనే సందిగ్దత మధ్య ప్రేక్షకుడు ఊగిసలాడుతాడు. క్లైమాక్స్ సీన్‌లో హీరో తల్లిదండ్రుల ముఖాలను రివీల్ చేసిన విధానం యూనిక్‌గా ఉంటుంది. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించనప్పటికీ.. హలీవుడ్ స్టైల్ స్క్రీన్‌ప్లే ఈ చిత్రాన్ని క్లాసిక్‌గా నిలిపింది.
అనార్కలి (Anarkali)
అనార్కలి చిత్రంలో సలీంగా నాగేశ్వరావు, అనార్కలిగా అంజలీ దేవి నటన, అక్బర్‌గా ఎస్‌వీరంగారావు అద్భుతమైన నటన ఈ సినిమాను క్లాసిక్‌గా నిలిపాయి. అనార్కలి, సలీంల మధ్య ప్రేమ కథను చక్కని దృశ్యకావ్యంగా మలిచాడు దర్శకుడు. క్లైమాక్స్ సీన్‌లో అనార్కలి సమాధి అవుతున్న సమయంలో… సలీం పడే హృదయ వేదనను నాగేశ్వరరావు తన నటనతో అద్భుతంగా పండించారు.
సమర సింహారెడ్డి (Samarasimha Reddy)
అప్పటి వరకు లేని ఫ్యాక్షనిజం అనే కొత్త జనర్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. రాయలసీమ ముఠాకక్షలు నేపథ్యంగా కథ సాగుతుంది. ఈ సినిమా తర్వాత సరిగ్గా ఇదే మూసలో రాయలసీమ ముఠాకక్షల నేపథ్యంగా దశాబ్దానికి పైగా తెలుగు సినిమాలు వచ్చాయి. ఈ చిత్రంలో రైల్వేస్టేషన్లో బాలకృష్ణ, జయప్రకాశ్‌ను ఎదుర్కొనే సీన్.. ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమా పూర్తైన తర్వాత కూడా ప్రేక్షకున్ని వెంటడాతుంటాయి.
హ్యాపీడేస్ (Happy days)
ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ కథ లేనప్పటికీ..నాలుగేళ్ల బీటెక్ కోర్సులో నలుగురు స్నేహితుల మధ్య స్నేహం, ప్రేమను చక్కని స్క్రీన్ ప్లేతో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించాడు. స్నేహితులు విడిపోవడం, తిరిగి కలుసుకోవడం వంటి భావోద్వేగాలు యూత్‌ను అట్రాక్ట్ చేస్తాయి. కాలేజీ లైఫ్‌లో ఉండే ర్యాగింగ్, సీనియర్లు- జూనియర్ల మధ్య ఉండే గొడవలు చాలా నేచురల్‌గా ఉంటాయి. ఇవి యూత్‌ను బాగా అట్రాక్ట్ చేస్తాయి.
ఆర్య (Arya)
ఈ చిత్రాన్ని అద్భుతమైన క్యారెక్టరైజేషన్స్‌తో, అసాధారణమైన స్క్రీన్‌ప్లేతో హ్యాండిల్ చేశాడు దర్శకుడు సుకుమార్. సినిమా చూస్తున్నంత సేపు తర్వాత వచ్చే సీన్‌ను ప్రేక్షకుడు ఊహించని విధంగా మాయ చేశాడు. తెలుగులో అప్పటి వరకు రాని ఓ వెరైటీ లవ్‌స్టోరీ ఇది. వన్ సైడ్ లవ్ అంటూ ప్రేక్షకులకు కొత్త ప్రేమ కథను చెప్పాడు సుకుమార్. ఇక ఆర్యగా అల్లు అర్జున్ చిలిపితనం, కామెడీ సెన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. క్లైమాక్స్ సీన్, ఆర్య ఇంట్రడక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. థకదిమితోం.. థకదిమితోం పాటలో అల్లు అర్జున్ డ్యాన్స్ అలరిస్తుంది.
అంకుశం (Ankusam)
రాజశేఖర్ పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ రోల్.. జీవిత నటన ఈచిత్రాన్ని ఆల్‌టైమ్ గ్రేట్ మూవీగా నిలబెట్టింది. ఈ చిత్రంలో విలన్ రాంరెడ్డిని రొడ్డు మీద ఈడ్చుకుంటూ రాజశేఖర్ తీసుకెళ్లే సీన్ హైలెట్‌గా ఉంటుంది.
పుట్టింటి పట్టుచీర (Puttinti pattucheera)
సవితి తల్లి, అత్త పెట్టే చిత్రహింసలు పెడుతున్న ఓర్పుగా జీవించే యమున క్యారెక్టర్… ప్రేక్షకులను కదిలిస్తుంది. క్లైమాక్స్‌లో యమున కోసం అతని తమ్ముడు (Goat Telugu Movies)చిన్నా తాపత్రయ పడే సీన్ కంటతడి పెట్టిస్తుంది. కష్టాల సుడిలో చుట్టుకున్న ఓ మహిళ విషాధ గాథను ఈ చిత్రం కళ్లకు కట్టింది.
నిన్నే పెళ్లాడతా (Ninne Pelladatha)
కుటుంబ కథా చిత్రాల్లో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా చెప్పవచ్చు. ఈ చిత్రంలో తన స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో కృష్ణవంశీ.. మూడు గంటల పాటు ప్రేక్షకులను థియేటర్లలో నిలబెట్టేలా చేశాడు. నాగార్జున… టబును పండు.. పండు అని ఏడిపించే సీన్.. ఉమ్మడి కుటుంబంలో ఉండే అనురాగాలు, చిలిపితనం ఈ చిత్రంలో ప్రస్పుటమయ్యాయి. ఈ చిత్రంలో మరో ముఖ్య విషయం సంగీతం. సందీప్ చౌతా అందించిన మ్యూజిక్ సినిమాకు మంచి అసెట్‌గా నిలిచాయి. ‘కళ్లలోని రూపమే’… ఎటో వెళ్లిపోయింది మనసు వంటి పాటలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు ఈ తరహాలో వచ్చాయి.
అంతపురం (Anthahpuram)
రాయలసీమలో తొలిసారి ఫ్యాక్షన్ ముఠా కక్ష్యలను అవిష్కరించింది ఈ సినిమా. వారి పగ, ప్రతీకారాలు ఎంత కర్కషంగా ఉంటుందో చూపిస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఫ్యాక్షన్ ముఠా నాయకుడిగా.. ప్రకాశ్ రాజ్ నటన అద్భుతం.
సూర్యవంశం (Suryavamsam)
డ్యుయల్ రోల్‌లో వెంకటేష్ నటన, మీనా గ్లామర్, SA రాజ్‌కుమార్ సంగీతం ఈ చిత్రాన్ని క్లాసిక్ కల్ట్ మూవీగా నిలిపాయి. కుటుంబ కథా చిత్రాల్లో ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
అర్జున్ రెడ్డి (Arjun Reddy)
తెలుగులో వచ్చిన ప్రేమ కథా చిత్రాల్లో అర్జున్ రెడ్డి క్లాసిక్ కల్ట్. ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీతో పాటు ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ప్రేమ కథా చిత్రాలు ఇలాగే తీయాలి అనే బౌండరీని దాటి నయా ట్రెండ్ సెట్ చేసింది. కెమెరా వర్క్, నీట్ స్క్రీన్‌ప్లే, విజయ్ దేవరకొండ యాక్టింగ్, సందీప్ వంగా డైరెక్టింగ్ స్కిల్స్ అల్టిమెట్‌గా ఈ చిత్రాన్ని ఆల్‌టైమ్ గ్రెటెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిపింది.
బడి పంతులు (Badi Panthulu)
ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం తెలుగులో ఒక క్లాసిక్. కన్నబిడ్డలకన్నా, సాయం పొందిన బైటవారే మానవత్వంతో వ్యవహరిస్తారని తెలియజేస్తుంది చిత్రకథ.అమ్మ నాన్నలను బిడ్డలు చెరొక చోటకు విడదీసి పెట్టిన హింసలు చూసి ఎన్నోసార్లు మనము దుఖిస్తాము. వృద్ధుల సమస్యలపై ఎన్నో సంఘటనలతో రూపు దిద్దిన బడిపంతులు ఎప్పటికీ చూడదగ్గ సినిమా
నువ్వే కావాలి (Nuvve Kavali)
ఫ్రెండ్స్ ఉన్నా ఇద్దరు యువతీ యువకులు.. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నా బయటకు చెప్పుకోక మదన పడుతుంటారు. వారి మానసిక సంఘర్షణ అద్భుతంగా ఆవిష్కరించారు. కాలేజీ బ్యాక్ డ్రాప్ యూత్‌ను ఆకర్షిస్తుంది.
చత్రపతి (Chatrapathi)
తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. యాక్షన్ సీక్వెన్స్‌లలో ప్రభాస్ యాక్టింగ్, అతని స్క్రీన్ ప్రెజెన్స్ కనుల విందుగా ఉంటుంది. ఈ చిత్రంలో కొన్ని సీన్లు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ప్రభాస్, బానోజీ మృతదేహాన్ని తీసుకెళ్లి కోట శ్రీనివాస్ రావుకు వార్నింగ్ ఇచ్చే సీన్, ప్రభాస్‌కి చత్రపతి అనే బిరుదును ప్రసాదించే అంతిమ సన్నివేశం సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులను వెంటాడుతుంది.
మగధీర (Magadheera)
ఈ సినిమా కథ పునర్జన్మల నేపథ్యంగా సాగుతుంది. ఓపెనింగ్ సీన్, రామ్ చరణ్ స్టంట్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్, హీరోను ఎలా గుర్తించాలో అఘోరా, విలన్‌కు చెప్పే సీన్స్ అలరిస్తాయి. ఈసినిమాలో VFX, మగధీర చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెట్టాయి.
ఏ మాయ చేశావే (Ye Maaya Chesave)
తెలుగులో వచ్చిన ఎన్నో మరుపురాని ప్రేమ కథ చిత్రాల్లో ‘ఏ మాయ చేశావే’ ఒకటి. ప్రేమ విషయంలో అబ్బాయిలు సాదాసీదాగా ఉంటారు. ఎటువంటి చిక్కులు లేకుండా ప్రపోజ్ చేస్తారు. అమ్మాయిలు మాత్రం సంక్లిష్ట ప్రవర్తనతో సాధారణ విషయాలను క్లిష్టతరం చేస్తారు. గౌతమ్ మీనన్ ఆ పాయింట్‌ను అందంగా చూపించారు. అద్భుత దృశ్యకావ్యంగా మలిచారు. ఈ చిత్రంలో నాగచైతన్య- సమంత కెమిస్ట్రీ రంజింపజేస్తుంది.
RRR
ఎన్టీఆర్, చరణ్‌ల నటన హృదయాలను కదిలిస్తాయి. ఇద్దరి పాత్రల మధ్య ఎమోషన్స్ గుండె బరువెక్కేలా ఉన్నాయి. ఇద్దరి సిద్ధాంతాలు భిన్నమైనా… రెండు పాత్రల మధ్య బాండింగ్‌ను రాజమౌళి చాలా బాగా ఎలివేట్ చేశారు. చరణ్ డయ్యర్‌గా మారి చేసే లాఠీ ఛార్జ్ సీన్, “కోమురం భీముడో సాంగ్”లో జూ. ఎన్టీఆర్ యాక్టింగ్, పతాక సన్నివేశాలు ఈ చిత్రాన్ని అపురూప దృశ్య కావ్యంలా మార్చాయి
ముఠామెస్త్రీ (Muta Mestri)
మార్కెట్‌లో మూటలు మోసే కూలి.. మంత్రి స్థాయికి ఎదిగితే అనే పాయింట్ ఈ చిత్రంలోని ప్రధాన కథ. ఈ సినిమాలో టైటిల్ సాంగ్‌కు చిరు డ్యాన్స్.. ఆల్ టైం గ్రెట్ డ్యాన్స్‌ల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఎప్పటిలాగే చిరంజీవి మాస్ యాక్షన్, డిఫరెంట్ మేనరిజం, మీన గ్లామర్, రాజ్ కోటీ సంగీతం ఈ చిత్రాన్ని ఎవర్ గ్రీన్ హిట్‌గా నిలిపాయి.
బాబాయి హోటల్(Babai Hotel)
కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో బ్రహ్మానందం నటన ప్రేక్షకులన కదలిస్తుంది. ఓవైపు కామెడీని పంచుతునే బలమైన భావోద్వేగ సన్నివేశాలతో కథనం సాగుతుంది.
చూడాలనిఉంది (Choodalani Vundi)
మెగాస్టార్ చిత్రాల్లో చూడాలని ఉంది చిత్రం క్లాసిక్ కల్ట్. చిరంజీవి యాక్టింగ్, సౌందర్య గ్లామర్, మణిశర్మ సంగీతం.. రామ్మ చిలకమ్మ.. ప్రేమ మొలకమ్మ వంటి సాంగ్స్ ఈ సినిమాను క్లాసిక్ కల్ట్‌గా మార్చాయి.
పొకిరి (POKIRI)
”ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు”.. అనే డైలాగ్ ఓ దశబ్దంపాటు యూత్‌లో క్రేజ్ తెచ్చింది. మహేష్ బాబు లుక్స్, స్టైల్, డైలాగ్ డెలివరి, మణిశర్మ సంగీతం, పూరిజగన్నాథ్ డెరెక్టింగ్ స్కిల్స్ ఈ చిత్రాన్ని మరుపురాని చిత్రంగా నిలిపాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ట్విస్ట్ రివీల్.. ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. ఇలియానా, మహేష్ బాబు మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుకుంటుంది.
పెదరాయుడు (PEDDARAYUDU)
కుటుంబ కథా చిత్రాల్లో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్. ఈ చిత్రం తర్వాత అనేక సినిమాలు ఇదే తరహాలో వచ్చాయి. పాపారాయుడు ఏపిసోడ్ ప్రేక్షకులను సీట్ల నుంచి కదలకుండా చేస్తుంది. తీర్పు చెప్పే సమయంలో ఎదురు తిరిగిన వ్యక్తిని ఉద్దేశించి.. “ఆపరా..ఆపరా అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక కోస్తా” అంటూ రజనీకాంత్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్స్ విజిల్స్ వేయిస్తుంది. మోహన్ బాబు.. మెస్మరైజింగ్ యాక్టింగ్ ఈ సినిమాను క్లాసిక్‌గా నిలిపింది.
అమ్మోరు (Ammoru)
తెలుగులో పూర్తిస్తాయిలో గ్రాఫిక్స్‌ను ఉపయోగించి అఖండ విజయం సాధించిన చిత్రం అమ్మోరు. రమ్యకృష్ణ అమ్మోరు తల్లిగా భయంకర రూపంలో కనిపించేలా గ్రాఫిక్స్‌లో చూపించారు. అప్పట్లో ఈ సినిమాను చూసిన శివసత్తువలు, భక్తులు సినిమా హాళ్లలోనే పూనకాలతో ఊగిపోయారు. ఈ చిత్రం తర్వాత గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ సాయంతో అనేక సినిమాలు వచ్చి విజయం సాధించాయి.
సైరా నరసింహా రెడ్డి (Sye Raa Narasimha Reddy)
తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో చిరంజీవి నటన, ఆయన చెప్పే డైలాగ్స్ గూస్‌బంప్స్ తెస్తుంది.
Sye Raa Narasimha Reddy Dialogues
“రేనాడు వీరులారా.. చరిత్రలో మనం ఉండకపోవచ్చు, చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి”, “ఈ భూమి మీద పుట్టింది మేము.. ఈ మట్టిలో కలిసేద మేము, మీకెందుకు కట్టాలి రా శిస్తు”
“స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరిగుబాటు… నా భరతమాత గడ్డమీద నిలబడి హెచ్చరిస్తున్న.. నాదేశం వదిలి వెళ్ళిపోండి… లేదా యుద్దమే”
పుష్ప (Pushpa)
“చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే” … ఈ పాటలో అల్లు అర్జున్ వేసిన రోలింగ్ స్టేప్ దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసింది. సినీతారాల నుంచి క్రికెటర్ల వరకు ఈ స్టెప్‌ను తెగ ఫాలో అయ్యారు. ఈ చిత్రంలో బన్నీ చెప్పిన ”నీ యమ్మ తగ్గేదేలే” డైలాగ్ కూడా విస్తృత ప్రాచుర్యం పొందింది. పోలీసుల కన్నుగప్పి ఎర్రచందనం స్మగ్లింగ్, పుష్ప- పోలీస్ ఆఫీసర్ బైరాంసింగ్ షెకావత్ మధ్య వచ్చే క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ చిత్రంలో నటనకుగాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.
జగన్మోహిని (Jaganmohini)
హర్రర్ కామెడీ జనర్‌లో జగన్మోహిని చిత్రం ఓ క్లాసిక్‌గా చెప్పవచ్చు. ఈ చిత్రం ఆ తర్వాత ఇలాంటి చిత్రాలు తీసే డైరెక్టర్లకు ఒక పాఠ్యాంశంగా మారింది. ఇందులో పొట్టేలు, పులి,పాము కూడా భాగమయ్యాయి. మాయలు, మంత్రాలూ, రొమాన్స్, భక్తి, ప్రేమ, సరసం ఇలా ఆల్ ఇన్ వన్ ప్యాకేజీగా జగన్మోహనిని విఠలాచార్య తీర్చిదిద్దిన తీరు అద్భుతం. టెక్నాలజి లేని రోజుల్లో జగన్మోహిని మేకింగ్ ఇప్పటికీ విజువల్ వండర్‌గా పేర్కొంటారు. దెయ్యాలను, ఆత్మలను చూపించిన తీరు, వాటికి అందించిన BGM ఒళ్లు గగుర్పొడుస్తుంది.
వెంకీ (Venky)
ట్రైన్‌లో రవితేజ అతని ఫ్రెండ్స్, బ్రహ్మానందం, వేణుమాధవ్, ఏవీఎస్‌ల మధ్య కామెడీ ట్రాక్.. తెలుగులో వచ్చిన అత్యంత సక్సెస్‌ఫుల్ కామెడీ ట్రాక్‌గా చెప్పవచ్చు.
శ్రీమంతుడు (Srimanthudu)
ఈ చిత్రం తెలుగులో ట్రెండ్ సెట్టర్. మహేష్ బాబు ఇన్ని వేరియేషన్స్ ఉన్న పాత్రని తన కెరీర్లో అప్పటి వరకూ చేయలేదు. ఓ రిచ్ కిడ్‌గా, ప్రేమికుడిగా, కాలేజీ విద్యార్థిగా, ఊరి కోసం నిలబడే ఒక బాధ్యతాయుతమైన పౌరుడిలా, ఫ్యామిలీ మంచి కోసం ఆరాటపడే ఓ కొడుకుగా.. సినిమాకు కావల్సిన అన్ని ఎమోషన్స్‌ను పండించి తనలోని ఓ సరికొత్త నటున్ని తెరపై ఆవిష్కరించాడు మహేష్ బాబు. ప్రీ క్లైమాక్స్‌లో మహేష్ చేసిన ఎమోషనల్ సీన్ ప్రేక్షకులను కదిలిస్తుంది.
కర్తవ్యం (Karthavyam)
తెలుగులో వచ్చిన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాల్లో కర్తవ్యం ఒకటి. ఈ సినిమా విజయశాంతికి మంచి గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రం తర్వాత కర్తవ్యం విజయశాంతి అనేలా మార్మొగింది. ఈసినిమాలో విజయశాంతి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అవినీతి పరులను చట్టం ముందు నిలబెట్టే తీరు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది.
అరుంధతి (Arundhati)
అరుంధతి సినిమాలో జేజెమ్మ, అరుంధతి పాత్రలలో అనుష్క శెట్టి నటనకు తెలుగు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. రాహుల్ నంబియార్ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఈ సినిమాలో అద్భుతంగా ఉన్నాయి. ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి. పశుపతి పాత్రలో నటించిన సోనూసూద్.. “వదల బొమ్మాలి వదల” అని చెప్పే డైలాగులు ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించింది. మరొక సందర్భంలో.. పశుపతి.. అరుంధతిని చూడగానే ‘రా… రా… రాకపోతే చచ్చిపోతావ్’ అనగానే… అరుంధతిలో జేజమ్మ ఆవహించి “నువ్వు నన్ను ఏం చేయలేవురా” అంటూ అనుష్క చెప్పే డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
అత్తారింటికి దారేది (Atharintiki Daaredi)
పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మరో సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ ‘అత్తారింటికి దారేది’. ఈ చిత్రంలో కథ చాలా సాధరణమైనప్పటికీ.. త్రివిక్రమ్ అద్భుతమైన స్క్రీన్‌ప్లే, ప్రేక్షకులను కుర్చీలకు అంకితం చేస్తుంది. హీరో ఇంట్రడక్షన్ సీన్, సిద్ధప్పతో (Goat Telugu Movies)పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్స్, క్లైమాక్స్ సీన్‌లో తన అత్తతో జరిగే సంభాషణలు ప్రేక్షకులను కదిలిస్తాయి. ఈ చిత్రంలోని డైలాగ్స్ చాలా పాపులర్ అయ్యాయి.
Atharintiki Daaredi Dialogues
“ఎక్కడ నెగ్గాలో కాదు… ఎప్పుడు తగ్గాలో తెలిసినోడే గొప్పోడు”
“చూడప్ప సిదప్ప నేను సింహం లాంటోడిని… ఆధి గెడ్డం గీసుకోలేదు నేను గీసుకోగలను అంతే తేడా మిగిలిందంతా సేమ్ టు సేమ్… ఆహ్!”
“మీ వెనక ఏది పవర్ ఉందమ్మా… అధి ఉండగా మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు”
“తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది… వెళ్లిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది”
సాహసవీరుడు సాగర కన్య
ఈ చిత్రంలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రం. సాగర కన్య భూమికి మీదకు వచ్చి.. అందమైన యువతిగా మారినప్పుడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుందో దర్శకుడు రాఘవేంద్రరావు బాగా చూపారు. ఈ చిత్రంలో సాహసవీరుడిగా వెంకటేష్, సాగరకన్యగా శిల్పశెట్టి నటన ఆకట్టుకుంటుంది. నీరు తాకినప్పుడు శిల్పశెట్టి సాగర కన్యగా మారే తీరును కెమెరామెన్ ఎ. విన్సెంట్ అద్భుతంగా చూపారు. సముద్ర అంతర్భాగంలో ఉండే జలచరాలు, ఇతర అందమైన ప్రదేశాలు చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.
బాల భారతం (Bala Bharatam)
కేవలం చిన్న పిల్లలతో మహా భారతం వంటి ఇతిహాసాన్ని ప్రేక్షకులకు విడమర్చి చెప్పారు డైరెక్టర్ కమలాకర కామేశ్వరరావు. ఈ చిత్రంలో మహా నటి శ్రీదేవి బాల నటిగా నటించి మెప్పించారు. “మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడే” పాటలో ఐరావతం తెచ్చేందుకు భీముడు బయల్దేరే దృశ్యం ఆకట్టుకుంటుంది.
జీవన జ్యోతి (Jeevana Jyothji)
హత్తుకునే భావోద్వేగాలకు ప్రేక్షకులు ఏ కాలంలోనైనా ఆదరిస్తారు అని నిరూపించింది ఈ సినిమా. ఇందులో స్టార్ నటీనటులు లేకపోయినా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. శోభన్ బాబు వయసు మళ్ళిన వాడిగా, యువకుడిగా డ్యూయల్ రోల్‌లో నటించి ఆకట్టుకున్నాడు. వాణిశ్రీ కూడా ద్విపాత్రభినయం చేసింది. తనది కానీ బిడ్డ మీద విపరీతమైన ప్రేమను పెంచుకున్న ఓ తల్లి కథగా విశ్వనాథ్ దీన్ని తెరకెక్కించిన తీరు జనాన్ని బాగా కదిలించింది.
చంద్రగుప్త మౌర్య (Chankya Chandra Gupta)
ముగ్గురు ఉద్ధండులు ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చిన సినిమా ఇది. చంద్రగుప్తుడిగా ఎన్టీఆర్, చాణక్యుడిగా నాగేశ్వరరావు, అలెగ్జాండర్‌గా శివాజి గణేషన్ నటన ఈ చిత్రాన్ని ఆల్‌టైం క్లాసిక్‌గా నిలిపింది. ముఖ్యంగా చంద్రగుప్తుడు- అలెగ్జాండర్ మధ్య యుద్ధం, నాగేశ్వరావు నటన ప్రేక్షకులను అలరిస్తాయి.
మయూరి (Mayuri )
తెలుగులో వచ్చిన అత్యుత్తమ బయోపిక్స్‌లో ఈ చిత్రం ఒకటి. ఈ చిత్రం ఎంతో మందికి స్పూర్తిని కలిగించింది. సుధా చంద్రన్ ప్రమాదంలో ఒక కాలు పొగొట్టుకున్నా… తన లక్ష్యం కోసం ఆమె చూపిన తెగువ ప్రేక్షకులను కదిలిస్తుంది.
చంటబ్బాయి (Chantabbai)
తొలిసారి కమర్షియల్, మాస్ చిత్రాలకు దూరంగా.. చిరంజీవి చేసిన కామెడీ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో డిటెక్టివ్ పాండు అతని అసిస్టెంట్ గణపతి చేసే కామెడీ గిలిగింతలు పెడుతుంది. చార్లీ చాప్లిన్ గెటప్‌లో చిరంజీవి నటన నవ్వులు పూయిస్తుంది. “అట్లాంటి ఇట్లాంటి హీరోని కాదు నేను” అనే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
స్వర్ణకమలం (Swarnakamalam)
పదే పదే వినాలనిపించే పాటలను స్వరపరిచిన ఇళయరాజా, సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం ఈ సినిమాను ఉన్నత స్థానంలో నిలిపింది. తండ్రి నుంచి వచ్చిన గొప్ప సాంప్రదాయక నృత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ డబ్బులు సంపాదించడం కోసం గాలి మెడలు కడుతున్న ఓ అమ్మాయిని సరైన లక్ష్యం వైపు నడిపిస్తాడు పెయింటింగులు వేసుకుని మాములు జీవితంం గడిపే ఓ కుర్రాడు. ఇదే సింపుల్‌గా కథ. ఈ చిత్రంలో వెంకటేష్‌లోని అసలు సిసలు నటన బయటపడింది.
పెళ్లి పుస్తకం (Pelli pustakam)
“శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం.. ఇక ఆకారం దాల్చుతుంది క్రొత్తజీవితం” ఈ పాట ప్రతీ పెళ్లిలోనూ మారుమోగుతుంది. బాపు స్క్రీన్‌ప్లే, కేవీ మహదేవన్ సంగీతం, రాజేంద్ర ప్రసాద్- దివ్యవాణి మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రాన్ని క్లాసిక్‌గా నిలిపాయి.
మనీ (Money)
అప్పటి తెలుగు సినిమాల్లో కనిపించని కొత్త తరహా హాస్యాన్ని అందించిన సినిమా ‘మనీ’. పంచ్‌డైలాగులు, వన్ లైనర్ల ఆధారంగా సాగే హాస్యానికి భిన్నంగా హాస్యాన్ని పుట్టించగల సన్నివేశాన్ని తయారుచేసి డైలాగుల బలంతో కాక సన్నివేశాల బలంతో నవ్వించడం ఆకట్టుకుంటుంది. మనీలో బ్రహ్మానందం నటించిన ఖాన్ దాదా పాత్ర బాగా ప్రేక్షకాదరణ పొంది బ్రాండ్ స్థాయికి ఎదిగింది. మనీ సినిమా విజయానికే కాక తదనంతరం సీక్వెల్స్ నిర్మాణానికి కూడా ఖాన్ దాదా పాత్ర కీలకమైన ఆకర్షణగా నిలిచింది.
మేజర్ చంద్రకాంత్ (Major ChandraKanth)
రాజకీయాల్లోకి వచ్చి సినిమాలకు విరామం ఇచ్చిన 10 ఏళ్ళ తర్వాత మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టీఆర్ నటించారు. భారత దేశ కీర్తిని పుణ్యభూమి నాదేశం సినిమాలో ఎన్టీఆర్ వర్ణించే తీరు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
పెళ్లి సందడి (Pelli Sandadi)
ఈ చిత్రాన్ని క్లాసిక్‌గా నిలెబెట్టింది… ఈ సినిమాలోని సంగీతం. కీరవాణి అందించిన సంగీతం ప్రేక్షకులను అప్పటికీ.. ఎప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. “మా పెరటి జాంచెట్టు పళ్లన్ని”.., “సౌందర్యలహరి, స్వప్నసుందరి” వంటి పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
రాంబంటు (Rambantu)
రాంబంటు చిత్రం బాపు గారి అపురూప దృశ్య కావ్యం.. రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్.. ఈశ్వరిరావు అందం, వేటూరి సాహిత్యం ఈ చిత్రాన్ని క్లాసిక్‌గా నిలబెట్టాయి.
పెళ్లిచేసి చూడు (Pelli Chesi Choodu)
సమాజంలోని వరకట్నంపై తనదైన శైలీలో బాణాలు వదిలింది ఈ సినిమా. ఇందులో హీరోగా ఎన్టీఆర్ ఇంటర్వెల్ తర్వాత కనిపిస్తాడు. ఇక అప్పటి నుంచి వరకట్నం దురాచారంపై హీరో వెసే చమక్కులు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. ఈ చిత్రంలో సావిత్రి, ఎస్వీ రంగారావు, వరలక్ష్మి నటన ఈ సినిమాను క్లాసిక్‌గా నిలిపాయి. ఈ సినిమాలో 14 పాటలకు పింగళి నాగేంద్రరావు సాహిత్యం అందించారు. అన్ని పాటలు వినసొంపుగా ఉంటాయి.
దొంగరాముడు (Donnga ramudu)
అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ ఆధారంగా వచ్చిన ఈసినిమా ఆకట్టుకుంటుంది. అడుగడుగున ట్విస్ట్‌లతో అలరిస్తుంది. జమున- నాగేశ్వరావు అన్నా చెల్లెళ్లుగా భావోద్వేగాలను పండించారు. తన చెల్లెలు ఇంట్లోనే రాము డ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆమె భర్త(జగ్గయ్య) ఖరీదైన వాచ్ పోతుంది. ఈనేరం అతనిపై పడినప్పుడు నాగేశ్వరరావు నటన ప్రేక్షకులను కదిలిస్తుంది.
దసరా బుల్లోడు (Dasara Bullodu)
పల్లెటూరి నేపథ్యంగా వచ్చిన చిత్రాల్లో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్. ఊరంతా సరదాగా తిరిగే యువకుడి గోపి పాత్రలో నాగేశ్వరరావు మెప్పించారు. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే పాత్రలో నాగేశ్వరరావు ప్రేక్షకులను కదిలించారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. “పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయి.. నీ పైటకొంగు జారిందే గడుసుపిల్లా”, “అరెరెరెరె…. ఎట్టాగో వున్నాది ఓలమ్మీ ఏటేటో అవుతుందే చిన్నమ్మి” వంటి పాటలు ఈ చిత్రాన్ని ఆల్ టైం క్లాసిక్ హిట్‌గా నిలిపాయి.
అతడు (Athadu)
అతడు తెలుగులో ఓ ట్రెండ్ సెట్టర్. త్రివిక్రమ్ తన పదునైన డైలాగ్స్, స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని మరుపురాని చిత్రంగా మార్చాడు.
Athadu Dialogues
“గన్ చూడాలనుకో తప్పులేదు.. కానీ బుల్లెట్ చూడాలనుకోకు చచ్చిపోతావ్” అంటూ గ్యాంగ్‌స్టర్ నందూ.. బాజిరెడ్డిని ఉద్దేశించే చెప్పే డైలాగ్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించింది. ఇంట్రడక్షన్ సీన్‌లో ‘తొలి తుపాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే’ సాంగ్, బ్రహ్మానందం కామెడీ ట్రాక్, నాయుడు(తనికెళ్ల భరణి) తమ పొలానికి కంచే వేసినప్పుడు అతన్ని మహేష్ బాబు బెదిరించే సీన్ సినిమాకే హైలెట్.
ఈగ (Eega)
తెలుగులో గ్రాఫిక్స్ ఆధారంగా వచ్చిన సినిమాల్లో ‘ఈగ’ చిత్రం ట్రెండ్ సెట్టర్. పెద్ద స్టార్స్ లేకున్నా కేవలం గ్రాఫిక్స్ మాయాజాలంతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతం. ఈ చిత్రానికి ‘మకుట VAFX’ సంస్థ.. స్పెషల్ ఎఫెక్ట్స్ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టింది. ఈ సినిమాలో సుదీప్ విలనిజం, నాని అమాయకపు నటన, ఈగ- సమంత మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్లు అలరిస్తాయి. క్లైమాక్స్ సీన్.. ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తుంది. ఇవన్నీ ఈ చిత్రాన్ని క్లాసిక్‌గా నిలబెట్టాయి.
ఫిదా (Fidaa)
“భానుమతి హైబ్రిడ్ పిల్లా.. రెండు కులాలు రెండు మతాలు” అంటూ సాయి పల్లవి చెప్పే డైలగ్‌కు ఎవరైన ఫిదా అవ్వాల్సిందే. తెలంగాణ యాస, సంస్కృతిని చాలా ఎళ్ల తర్వాత ఈ చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చింది. ఈ చిత్రం హిట్‌తో తెలంగాణ యాస, సంస్కృతి చాలా సినిమాలు వచ్చి హిట్ సాధించాయి.
నిన్నుకోరి (Ninnu Kori)
నానిలోని సిసలైన నటున్ని పరిచయం చేసింది ఈ సినిమా. ఒక డిఫరెంట్ జనర్‌లో ఈ సినిమా వచ్చి విజయం సాధించింది. నాని.. తను ప్రేమించిన అమ్మాయికి పెళ్లైన విషయం తెలిసి బాధపడే సన్నివేశాలు, వారిని విడదీసేందుకు అతను చేసే ప్లాన్లు, ఈ క్రమంలో నాని తన ప్రేమ గురించి తన ప్రేయసి భర్తకు వివరించే సీన్ ప్రేక్షకులను కదలిస్తుంది. ఈ చిత్రంలోని ‘అడిగా అడిగా.., ఉన్నట్టుండి గండే సాంగ్స్ వెంటాడుతాయి.
మల్లేశం (Mallesham)
ఈ చిత్రం ‘ఆసు’ యంత్రాన్ని కనిపెట్టిన పద్మ శ్రీ మల్లేశం గారి బయోపిక్.. అత్యంత ప్రజాదరణ పొందిన బయోపిక్ చిత్రాల్లో ఈ సినిమా ఒకటి. తన తల్లితో పాటు చేనేత కార్మికుల కష్టం తీర్చేందుకు ఆసు యంత్రం కనిపెట్టడంలో మల్లేశం పడిన శ్రమను ఈ చిత్రం కళ్లకు కట్టింది.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju)
మనసుకు హత్తుకునేలా అనిపించిన ఓ అందమైన, స్వచ్చమైన ప్రేమకథ.. మళ్లీ మళ్లీ ఇది రానిరోజు. పరణతి చెందిన ప్రేమ కథను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు కె. క్రాంతి మాధవ్. ప్రేమించిన ప్రేయసిని దక్కించుకోవడం కోసం కడదాక ఎదురు చూడటంలో(Goat Telugu Movies) ఉన్న బాధ, ఆనందాన్ని మంచి ఎమోషనల్ యాంగిల్‌లో చూపించాడు. కళ్లతో నిత్యమీనన్ పలికే భావాలు, శర్వానంద్, నిత్య మధ్య క్యూట్ లవ్ ట్రాక్, విడిపోయినప్పుడు వచ్చే ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను కదిలిస్తాయి. ఇవన్నీ ఈ చిత్రాన్ని క్లాసిక్‌గా నిలిపాయి.
ఊపిరి (Oopiri)
సినిమా మొత్తం వీల్ ఛైర్‌కే పరిమితమయ్యే పాత్రలో నాగార్జున కదిలించారు. నాగార్జున కార్తీల జర్నీని సినిమా మొత్తం అలా చూస్తూండిపోయేలా సన్నివేశాలను రూపొందించిన తీరు అబ్బురపరుస్తుంది. కార్తీ పాత్రలోని చలాకీతనం, నాగార్జున పాత్రలోని స్వచ్ఛమైన నిండుతనం, ఈ రెండింటినీ ప్రతిబింబించేలా వీరి ప్రయాణంలో వచ్చే సన్నివేశాలు నవ్విస్తూ, ఏడిపిస్తూ, ఒక అద్భుతమైన అనుభూతినిస్తూ సాగిపోతూ కట్టిపడేస్తాయి.
అంజలి (Anjali)
ఇది డబ్బింగ్ చిత్రమైనప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సినిమా. చిన్న పిల్లల్లో ఉండే అమాయకత్వం, ఆవేశం, అల్లరి, తెగింపును డైరెక్టర్ మణిరత్నం అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ చిత్రంలో ‘అంజలి అంజలి చిలికి నవ్వుల పువ్వుల జాబిల్లి’ ప్రేక్షకులను వెంటాడుతుంది.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (Agent Sai Srinivasa Athreya)
కనిపించకుండా పోయి శవమై తేలిన వ్యక్తుల కేసును ఒక చిన్న డిటెక్టివ్ ఛేదించిన విధానం బాగుంది. మూవీలో దర్యాప్తు సీన్లు, అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ కొత్తగా ఉంది. కామెడీ సీన్లలో నవీన్ నటన ఆకట్టుకుంటుంది. చివరి 10 నిమిషాల వరకు కూడా కథలో సస్పెన్సు క్యారీ అయ్యేలా ఉండి ప్రేక్షకులను అలరిస్తుంది. .
భక్త పోతన (Bhakta Potana)
ఈ చిత్రం దిగ్గజ దర్శకుడు కేవీ రెడ్డి తొలి చిత్రం. ఈ సినిమాలో చిత్తూరు నాగయ్య పొతన క్యారెక్టర్‌ను అద్భుతంగా సినిమాటిక్‌గా నిర్వచించారు.
పాండవ వనవాసం (Pandava Vanavasam)
మహాభారతంలోని అరణ్యక పర్వం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆల్‌టైమ్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటి. ద్రౌపదిగా సావిత్రి, భీమ సేనుడిగా ఎన్టీఆర్ హైపర్ యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఘంటసాల అద్భుతమైన సంగీతాన్ని అందిస్తారు. నిండు సభలో ద్రౌపదికి అవమానం జరిగిన సమయంలో.. ఎన్టీఆర్ “ధారుణి రాజ్య సంపద” అనే పౌరుషాగ్నితో పద్యం ఎత్తుకోవడం దానికి ప్రతిచర్యగా.. SVR, “హా, బానిసెలు” అని కౌంటర్ ఇవ్వడం రక్తికట్టిస్తుంది.
జస్టిస్ చౌదరి (Justice Chowdary)
ఎన్టీఆర్…నిజాయతి గల న్యాయమూర్తి పాత్రలో ఆయన నట వైభవం మరోసారి కళ్లముందు కదలాడుతుంది. “చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో అనే సాంగ్‌లో ఎన్టీఆర్ హావభావాలు.. ప్రేక్షకులను కదలకుండా చేస్తాయి. ఆ తర్వాత అనేక చిత్రాలు ఈ సినిమాను పోలి వచ్చినా జస్టిస్ చౌదరిలా అలరించలేకపోయాయి.
సిరివెన్నెల (Sirivennela)
సిరివెన్నెల చిత్రంలోని ప్రతి పాట వీనుల విందుగా.. మళ్లీ మళ్లీ వినాలనిపించే విధంగా ఉంటాయి. ఈ చిత్రానికి సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం ఈ సినిమాను ఆల్‌టైం క్లాసిక్‌గా నిలిపాయి. “ఈగాలి.. ఈనేల, “ఆది భిక్షువు వాడిని ఏమి కోరిది” వంటి పాటలు అలరిస్తాయి. ఈ చిత్రం తర్వాత సీతారామశాస్త్రి పేరు సిరివెన్నెల సీతారామశాస్త్రిగా స్థిరపడింది.
లేడీస్ టైలర్ (Ladies Tailor)
వంశీమార్క్ కామెడీ, స్క్రీన్‌ప్లే, రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్, గోదావరి అందాలు ఈ చిత్రాన్ని మరుపురాని సినిమాగా నిలిపాయి.
పడమటి సంధ్యారాగం (Padamati Sandhya Ragam)
జంద్యాల.. సరసమైన హాస్యానికి మరో మణి హారం ఈ చిత్రం. ఓ అమెరికన్ కథానాయకుడిగా నటించిన తొలి భారతీయ చిత్రం ఇదే. విజయశాంతి, అమెరికన్ నటుడు థామస్ జేన్ మధ్య వచ్చే సన్నివేశాలు, విజయశాంతి తండ్రి పాతకాలం మనిషిగా.. అమెరికా అమెరికాకు వచ్చినా తన పద్ధతులు మార్చుకోకుండా అందరినీ విసిగించే సీన్లు కడుపుబ్బ నవ్విస్తాయి.
పసివాడి ప్రాణం (Pasivadi Pranam)
చిరంజీవి, విజయశాంతి మధ్య కెమిస్ట్రీ, బాలనటిగా సుజీత యాక్టింగ్.. రఘువరన్ విలనిజం అన్నీ కలిపి పసివాడి ప్రాణం సినిమాను క్లాసిక్‌గా నిలిపాయి. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని బ్రేక్ డ్యాన్స్‌ను చిరంజీవి పరిచయం చేశాడు.
వివాహ భోజనంబు (Vivaha Bhojanambu)
జంద్యాల కలం నుంచి వెలువడిన మరో దృశ్యకావ్యం. అమ్మాయిల చేత మోసపోయిన వారికోసం కథానాయకుడు ఓసంఘం పెట్టడం, అతను స్త్రీల ద్వేషిగా ఎందుకు మారాడో తెలిపే సీన్లు చాలా కామెడీగా, ఆలోచించే విధంగా ఉంటాయి.
దేవుళ్లు (Devullu)
విడిపోతున్న తమ తల్లిదండ్రులు కలవాలని ఇద్దరు పిల్లలు దేవాలయాలకు వెళ్తూ మొక్కులు చెల్లించే ప్రయత్నాలు ప్రేక్షకులను కదిలిస్తాయి. క్లైమాక్స్ సీన్‌లో అయప్ప స్వామి వచ్చి పిల్లల్ని రక్షించే సీన్, కలి పురుషున్ని సంహరించే సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమాలోని ప్రతి పాట భక్తి ప్రధానంగా ఉండి దేవభక్తిని పెంపొందిస్తుంది.
లిటిల్ సోల్జర్స్ (Little Soldiers)
సన్నీ, బన్నీ అల్లరి ఆకట్టుకుంటుంది. సడెన్‌గా వారి తల్లిదండ్రులు ప్రమాదంలో మరణించడం ప్రేక్షకులను కదిలిస్తుంది. వారు అన్ని ఇబ్బందులను అధిగమించి తమ అమ్మమ్మ- తాతయ్యలను కలుస్తారు. ఈక్రమంలో తమ తల్లిదండ్రులను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటారు.
ఏప్రిల్ 1 విడుదల (April 1 Vidudala)
వంశీమార్క్ స్క్రీన్ ప్లే ఈ చిత్రాన్ని క్లాసిక్‌గా నిలిపింది. ఈ సినిమాలో ఎక్కడా అశ్లీలత కానీ అసభ్యత కానీ ఉండవు. ఆరోగ్యకరమైన హాస్యంతో సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇళయరాజా మెలోడీస్ ప్రేక్షకులను రంజింపజేశాయి. సాక్షి రంగారావు ఇంట్లో టీవీ పేలడం, దివాకరం నిజాలు చెప్పినప్పుడు జరిగే సన్నివేశాలు ఒకదాన్ని మించి మరొకటి పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. మల్లికార్జునరావు, జయలలిత, రాళ్ళపల్లి, కళ్ళు చిదంబరం అందరూ పోటీపడి నటించారు.
పెద్దరికం (Peddarikam)
ఈ సినిమాలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది… అడుసుమిల్లి బసవపున్నమ్మగా భానుమతి నటన, పర్వతనేని పరశురామయ్యగా మలయాళ నటుడు అయిన ఎన్. ఎన్. పిళ్ళై గురించి. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను రంజింపజేస్తాయి. పగలకు ప్రతీకరాలకు నడుమ నలిగే ప్రేమ జంట కథ అయిన చాల విభిన్నంగా తెరకెక్కించారు.
బాలరామకృష్ణులు (Balarama Krishnulu)
యాంగ్రీమెన్ రాజశేఖర్, అందాల నటుడు శోభన్ బాబు మధ్య వచ్చే ఉద్రిక్త సన్నివేశాలు, సెంటిమెంట్ డ్రామా ప్రేక్షకులను రంజింపజేస్తుంది.
అల్లరి ప్రియుడు (Allari Priyudu)
ఒక మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు అందించాడు కె. రాఘవేంద్రరావు. రమ్యకృష్ణ, రాజశేఖర్ మధ్య ఫైటింగ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలోని అన్ని పాటలు ప్రేక్షకులను అలరించాయి. “రోజ్.. రోజ్ రోజా పువ్వ, అందమా నీ పేరేమిటి అందమా” వంటి సాంగ్స్ ప్రేక్షకులను వెంటాడుతాయి. క్లైమాక్స్‌లో రమ్యకృష్ణ, రాజశేఖర్, మదుబాల మధ్య ఉద్విగ్న సన్నివేశాలు రంజింపజేస్తాయి.
ఆమె (Aame)
ఈ చిత్రంలో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఊహా యాక్టింగ్. ఆత్మభిమానం గల పెదింటి యువతిగా ఆమె నటన అద్భుతం. భర్త కోల్పోయినప్పుడు ఓ మహిళ వేదన ఎలా ఉంటుందో ఊహ నటన కళ్లకు కట్టింది. ఈ చిత్రంలో ఆమె పడే బాధలు ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టిస్తుంది.
సుస్వాగతం (Suswagatham)
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటన అద్భుతం. చదువును పక్కన పెట్టి సంధ్య అనే అమ్మాయి కోసం వెంటపడటం, ఆమె ఛీ కొట్టడం, ప్రకాశ్ రాజ్ ఎపిసోడ్ ఆకట్టుకుంటాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తాయి.
పెద్దరికం (Peddarikam)
ఈ సినిమాలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది… అడుసుమిల్లి బసవపున్నమ్మగా భానుమతి నటన, పర్వతనేని పరశురామయ్యగా మలయాళ నటుడు అయిన ఎన్. ఎన్. పిళ్ళై గురించి. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను రంజింపజేస్తాయి. పగలకు ప్రతీకరాలకు నడుమ నలిగే ప్రేమ జంట కథ అయిన చాల విభిన్నంగా తెరకెక్కించారు.
బాలరామకృష్ణులు (Balarama Krishnulu)
యాంగ్రీమెన్ రాజశేఖర్, అందాల నటుడు శోభన్ బాబు మధ్య వచ్చే ఉద్రిక్త సన్నివేశాలు, సెంటిమెంట్ డ్రామా ప్రేక్షకులను రంజింపజేస్తుంది.
అల్లరి ప్రియుడు (Allari Priyudu)
ఒక మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు అందించాడు కె. రాఘవేంద్రరావు. రమ్యకృష్ణ, రాజశేఖర్ మధ్య ఫైటింగ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలోని అన్ని పాటలు ప్రేక్షకులను అలరించాయి. “రోజ్.. రోజ్ రోజా పువ్వ, అందమా నీ పేరేమిటి అందమా” వంటి సాంగ్స్ ప్రేక్షకులను వెంటాడుతాయి. క్లైమాక్స్‌లో రమ్యకృష్ణ, రాజశేఖర్, మదుబాల మధ్య ఉద్విగ్న సన్నివేశాలు రంజింపజేస్తాయి.
ఆమె (Aame)
ఈ చిత్రంలో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఊహా యాక్టింగ్. ఆత్మభిమానం గల పెదింటి యువతిగా ఆమె నటన అద్భుతం. భర్త కోల్పోయినప్పుడు ఓ మహిళ వేదన ఎలా ఉంటుందో ఊహ నటన కళ్లకు కట్టింది. ఈ చిత్రంలో ఆమె పడే బాధలు ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టిస్తుంది.
ఘటోత్కచుడు (Ghatothkachudu)
ఘటోత్గచుడు భూమి మీదకు వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఎస్వి కృష్ణారెడ్డి రాసుకున్న స్టోరీ తెలుగు ప్రేక్షకులకు మరో సోషియో ఫాంటసిని అందించింది. ఘటోత్గచుడిగా సత్యనారాయణ గొప్పగా నటించారు.
సినిమా ప్రారంభంలో వచ్చే కురుక్షేత్ర యుద్ధం, స్పెషల్ క్యామియోల్లో రాజశేఖర్, శ్రీకాంత్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రొబొ- రోజా మధ్య లవ్ ట్రాక్ ఇవన్నీ సినిమాను క్లాసిక్‌గా నిలిపాయి.
దెయ్యం (Deyyam)
రాంగోపాల్ వర్మ ప్రతి సున్నితమైన సన్నివేశం ద్వారా ప్రేక్షకులను(Goat Telugu Movies) భయపెట్టడానికి ప్రయత్నించారు. క్లైమాక్స్‌లో అందరూ దెయ్యాలుగా కనిపించడం ఒళ్లు గగుర్పొడుస్తుంది. విఠాలాచార్య జగన్మోహిని తర్వాత ఆ స్థాయిలో భయపెట్టిన సినిమా ఇది.శుభాకాంక్షలు
శుభాకాంక్షలు (Subhakankshalu)
ఇద్దరు ప్రేమికుల వల్ల రెండు కుటుంబాలు విడిపోతే వాళ్లకు ఏ మాత్రం సంబంధం లేని ఓ అనాథ యువకుడు మనవడిగా నటించి వారి మధ్య విభేదాలు తొలగించడం అసలు కథ. ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందనేది భావోద్వేగపూరితమైన ఫ్లాష్ బ్యాక్‌లో చూపిస్తారు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా హీరో చివరికి ఒంటరిగానే మిగిలిపోవడం ఇందులో కొత్తదనం. తను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే తనను ప్రేమించిన మరో అమ్మాయిని బలవంతంగా ఎస్ చెప్పలేకపోతాడు. లవ్ స్టోరీనే అయినప్పటికీ ఇందులో చూపించిన విధానం, ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్‌కు ప్రేక్షకుడు ఫిదా అవుతాడు.
ప్రేమించుకుందాం రా (Preminchukundam ra)
ప్రేమ కథా చిత్రాల్లో ప్రేమించుకుందాం రా చిత్రానిది ప్రత్యేక స్థానం. ఈ సినిమా అప్పటి వరకు వచ్చిన ప్రేమకథల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. హీరో వెంకటేష్, అంజలా ఝవేరి మధ్య వచ్చే లవ్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేసాయి. ఇక మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రాణంగా నిలిచాయి. జయప్రకాశ్ నారాయణ రాయలసీమ యాసలో చెప్పే డైలాగ్స్ బాగా అలరిస్తాయి.
క్షేమంగా వెళ్లి లాభంగా రండి (Kshemamga Velli Labhamga Randi)
కోవై సరళ- బ్రహ్మానందం మధ్య వచ్చే ఫైటింగ్ సీన్లు, శ్రీకాంత్- రోజా, రాజేంద్రప్రసాద్- ప్రితీ కామెడీ ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. స్వచ్ఛమైన కామెడీకి ఈ సినిమా కేరాఫ్ అడ్రస్. ఈ సినిమా ద్వారా దర్శకడు రెండు లక్ష్యాలు చెప్పాలనుకున్నాడు. ఒకటి డబ్బు ఆదా చేయడానికి ఉపదేశించడం. మరొకటి మహిళలు ఉద్యోగం చేయడం సరైనదని పేర్కొనడం. ఈ రెండింటిని సెన్సిబుల్ కామెడీ ద్వారా రాజా వన్నెం రెడ్డి చూపించాడు.
సంపంగి (Sampangi)
మతం మధ్యలో నలిగిపోయే రెండు హృదయాల కథను ఫ్యామిలీ డ్రామా మలిచాడు దర్శకుడు. ఈ చిత్రంలోని అన్ని పాటలు విస్తృత ప్రేక్షాకాదరణ పొందాయి. “అందమైన కుందనాల బొమ్మరా”.., “ప్యాంటేస్తే గానీ తెలియలేదురా మామో”పాటలు ఆకట్టుకున్నాయి.
ఖడ్గం (Khadgam)
సీరియస్ కాప్‌గా శ్రీకాంత్, రవితేజ- ప్రకాశ్ రాజ్ కామెడీ, ఆయా పాత్రల మధ్య దేశ భక్తిని రగిలించే సీన్లు ఈ చిత్రాన్ని ఓ క్లాసిక్‌గా నిలిపాయి. పతాక సన్నివేశాల్లో చివరి పది నిమిషాలు ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
ఒక్కడు (Okkadu)
కబడ్డి ప్లేయర్‌గా మహేష్ బాబు పవర్‌ఫుల్ యాక్షన్ ప్రేక్షకులను అలరిస్తుంది. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ప్రకాశ్ రాజ్‌ను కొట్టి భూమికను మహేష్ బాబు తీసుకెళ్లే సీన్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
వర్షం (Varsham)
ఫ్రెష్ ప్రేమకథను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో(Goat Telugu Movies) ఉన్న నాలుగు ప్రధాన పాత్రలు(ప్రభాస్, త్రిష, ప్రకాశ్ రాజ్, గోపిచంద్ పాత్రలు చాలా బలంగా ఉన్నాయి. సినిమాలోని అన్ని పాటలకు అవుట్ డోర్ విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ఎస్ గోపాల్ రెడ్డి ఫొటోగ్రఫీ సినిమాను మరింత అందంగా తీర్చిదిద్దింది. గోపిచంద్- ప్రభాస్ మధ్య పతాక సన్నివేశాలు ప్రేక్షకులను రంజింపజేస్తాయి. “ఇన్నాళ్లకు గుర్తొచ్చాన వానా” సాంగ్ ప్రేక్షకులను వెంటాడుతుంది.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా (Nuvvostanante Nenoddantana)
తెలుగులో వచ్చిన ప్రేమకథా చిత్రాల్లో మరుపురాని చిత్రం ఇది. శివరామకృష్ణ(శ్రీహరి) తన సోదరి(త్రిష) ఎంత ఇష్టమో తెలిపే ఓపెనింగ్ సీన్, సిద్ధార్థ్- త్రిషల మధ్య రొమాంటిక్ అల్లరి సన్నివేశాలు అలరిస్తాయి. సిరి(త్రిష) చిన్నప్పుడు తన అన్న ఒక గుర్రపు బొమ్మను బహుకరిస్తాడు. ఆ బొమ్మ పగిలినప్పుడు.. సంతోష్ మళ్లీ దానిని అందంగా తయారు చేసే ఇచ్చే సీన్, అదే బొమ్మ మంటల్లో కాలిపోకుండా ప్రాణాలకు తెగించే కాపాడే సీన్లు ప్రేక్షకులను కదలిస్తాయి.
గమ్యం (Gamyam)
కేవలం అప్పటి వరకు హాస్యానికే పరిమితమైన అల్లరి నరేష్.. ఓ లుంపెన్ క్యారెక్టర్‌లో నటించి ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించాడు. పోలీసులకు, నక్సలైట్లకు (Goat Telugu Movies)మధ్య జరిగే ఎన్‌కౌంటర్‌లో గాలి శ్రీను(అల్లరి నరేష్) బలి కావడం కలచి వేస్తుంది. కోటీశ్వరుడైన అభిరామ్(శర్వానంద్), జానకి(కమిలినీ ముఖర్జిని) వెతుకుంటూ వేళ్లే క్రమంలో జీవిత గుణపాఠాలు నేర్చుకునే తీరు దర్శకుడు గొప్పగా చూపించాడు.
రెడీ (Ready)
రెడీ సినిమాలో బ్రహ్మానందం- రామ్ పొత్తినేని కామెడీ ట్రాక్ మేజర్ ప్లస్ పాయింట్. జెనిలియా- రామ్ మధ్య రొమాన్స్, జయప్రకాశ్, కోటా శ్రీనివాస్‌రావు ఫ్యామిలీ కామెడీ ట్రాక్ వంటివి ప్రేక్షకుడికి ఫుల్ మీల్ తిన్న ఫీలింగ్ ఇస్తుంది. ఇవన్నీ ఈ చిత్రాన్ని క్లాసిక్‌గా నిలబెట్టాయి.
మజిలి (Majili)
మిడిల్ క్లాస్ వారి జీవితాల్లో జరిగే సంఘటనలు, పరిస్థితుల ఆధారంగా సాగే జీవిత ప్రయాణాలను దర్శకుడు శివా నిర్వాణా అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమాలో ప్రేమతో పాటు ఆ ప్రేమలోని అన్ని ఎమోషనల్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాడు. క్రికెటర్‌గా అలాగే ఏ పని చెయ్యని భర్తగా నాగ చైతన్య నటన, భర్తకు ఇష్టం లేకున్నా అతన్ని ప్రేమించే భార్యగా సమంత నటన కదిలిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకున్ని ఆకట్టుకుంటాయి.
ఆరెంజ్ (Orange)
తెలుగు తెరపై ఇంతకు ముందెన్నడూ ప్రేమ కథ ఈ చిత్రం. కాలం గడిచే కొద్ది జంటల మధ్య ప్రేమ అనేది ఆవిరైపోతుందని, చాలా జంటలు ఆ సంబంధంలో ఉండటానికి అబద్దాలు వెతుకుతారు అనే సిద్ధాంతాన్ని డైరెక్టర్ తన కథ ద్వారా ఒప్పించే ప్రయత్నం చేశాడు. హారిస్ జయరాజ్ సంగీతం, పప్పీ పాత్రలో బ్రహ్మానందం ఫుల్ లెంగ్త్ కామెడీ, రామ్‌చరణ్- జెనిలియా క్యారెక్టరైజేషన్ ఈ చిత్రాన్ని క్లాసిక్‌గా నిలిపాయి.
ఈనగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi)
జీవితమంటే నచ్చినవాళ్లతో ఉంటూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన పనిచేసుకోవడమే అంటూ ఈ సినిమాలో అంతర్లీనంగా కథ చెప్పాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. హాస్యపూరితమైన పాత్రలు, కామెడీ పంచ్ లైన్‌లు ఆకట్టుకుంటాయి. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు ‘ మందు తాగుదాం తాగుదాం’ అంటూ విశ్వక్ సేన్, అతని ఫ్రెండ్స్ మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బ నవ్విస్తాయి.
జాతిరత్నాలు (Jathi Ratnalu)
ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్. సందర్భానుసారంగా వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బ నవ్విస్తాయి. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హెలెరియస్ పెర్ఫామెన్స్‌తో నిజమైన జాతిరత్నాలు అనిపించుకున్నారు.