Kalki Climax Dialogues
కల్కి చిత్రంలో క్లైమాక్స్ డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ముఖ్యంగా కర్ణుడి గొప్పతనం గురించి శ్రీకృష్ణుడు వివరించే డైలాగ్స్ అలరిస్తాయి. క్లైమాక్స్‌లో మహాభారతం ఎపిసోడ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది
‘ఆలస్యమైందా ఆచార్య పుత్ర’ అంటూ ప్రభాస్ విల్లు పట్టుకుని రథంపై నిలబడినప్పుడు… థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది. భైరవను కర్ణుడిగా పరిచయం చేసే సందర్భంలో వచ్చే కురుక్షేత్రంలోని డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.
అర్జునుడు : “అశ్వత్థామ.. తలరాతను రాసే బ్రహ్మ చేసిన గాంఢీవం ఇది. దీనిని ఎవరు అడ్డుకోలేరు”.
(kalki movie dialogues English)
కర్ణుడు: ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి అర్జునుడు వేసిన బాణాన్ని నిలువరిస్తాడు. ఆ సందర్భంలో “ఆలస్యమైందా ఆచార్య దేవా”? అని అశ్వత్థామతో అంటాడు.
అశ్వత్థామ: “లేదు, సరైన సమయంలోనే వచ్చావు”.
అర్జునుడు: “చూశావా.. కేశవ (కృష్ణుడు). తను నాకు సమానుడా? వాడ్ని (కర్ణుడు) అడ్డుకొని మన రథం కేవలం రెండు అడుగులు వెనక్కి వెళ్లింది. నా అస్త్రానికి అతడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్లింది”.
కృష్ణుడు : “ఓ ధనుంజయ! నీ రథం అగ్నిదేవుడి వరం. కాపాడుతున్నది.. జెండాపై కపిరాజు (హనుమంతుడు). నడుపుతున్నది ముల్లోకాలు నడిపించే నేను. అయినా రెండడుగులు వెనక్కి తోశాడంటే ఆలోచించు అర్జునా”.
కృష్ణుడు: “తను (కర్ణుడు) సామాన్య యోధుడు కాదు. తన కళ్లల్లోని తేజస్సు, తన చేతిలోని ధనస్సు.. తన పేరు.. చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. సూర్య పుత్ర వైకర్ణ.. కర్ణ”.
ఈ ఎపిసోడ్‌తో కల్కి పార్ట్ 1 ముగుస్తుంది.
(kalki movie dialogues telugu)
అయితే కల్కి చిత్రంలోని మరికొన్ని సీన్లలోని డైలాగ్స్ కూడా ప్రేక్షకులను అలరించాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
Supreme yaskin last dialogue
సుప్రీమ్ యాస్కిన్ (Kamal hasan) బృందంలోని ఒక సైంటిస్టు అతడ్ని చంపడానికి యత్నిస్తాడు. యస్కిన్ ఆ సెంటిస్టును చంపుతూ చెప్పే డైలాగ్స్ అలరిస్తాయి.
సుప్రీమ్ యాస్కిన్: “చావుకు నేను చాలా ప్రాణాలు ఇచ్చాను. అది నన్నేం చేయదు. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎందుకు నన్ను చంపాలనుకున్నావ్?“
సైంటిస్టు : మంచి కోసం..
సుప్రీమ్ యాస్కిన్ : “మంచి చరిత్రలో ఎన్ని ప్రాణాలు తీసిందో తెలుసా! ఈ మంచి… రాజులు రాజ్యాలు మారుతున్న ప్రతీసారి మారుతుందీ మంచి. దాన్ని నమ్మోద్దు. ఇంతకీ నీకేం కావాలి”?
సైంటిస్టు : ఈ లోకాన్ని కాపాడాలి
సుప్రీమ్ యాస్కిన్ : “అదే కదా.. నేనూ చేసింది. దేవుడిని, డబ్బులని, వందల యుద్ధాలు చేసే అందరినీ ఒక్క యుద్ధంతో గెలిచాను తప్పా?. మీరు బూడిద చేస్తున్న ప్రకృతిని అందనంత దూరంలో పెట్టాను.. తప్పా”?
సైంటిస్టు : “నీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి నువ్వు ఎవరు”?
సుప్రీమ్ యాస్కిన్ : “మరి నాశనం చేయడానికి మీరు ఎవరు? ఎన్ని యుగాలు అయినా.. ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు.. మారలేడు. ఇది నీ తప్పు కాదులే. హ్యూమన్ బీయింగ్స్‌కు ఉన్న డిఫెక్టే అది”.
kamal haasan jagannath dialogue
‘జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయ్ వస్తున్నాయ్.. రథచక్ర ప్రళయఘోళ భూమార్గం పట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను’
ఈ డైలాగ్ ద్వారా సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్ కల్కి పార్ట్ 2లో ఎంత బీభత్సంగా ఉంటుందో తెలుస్తోంది.
ఈ డైలాగ్ శ్రీశ్రీ మహా ప్రస్థానం లోనిది. ఈ డైలాగ్‌ను కమల్ హాసన్ 44 ఏళ్ల క్రితం వచ్చిన ఆకలి రాజ్యం చిత్రంలో కమల్ చెప్తారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఆయన మళ్లీ ఈ సినిమాలో శ్రీశ్రీ కవిత నిజంగా సూపర్బ్‌గా అనిపించింది.