Devara Movie Dialogues: The Most Impactful Dialogues


Jr. NTR’s latest movie Devara is generating a lot of buzz right now. Directed by Koratala Siva, this action drama has hit the screens with high expectations. In the film, Jr. NTR takes on dual roles, showcasing his versatility as an actor. With massive (Devara Movie Dialogues) anticipation surrounding its release, Devara has lived up to the hype. Jr. NTR’s stellar performance elevates the movie to a whole new level, and his powerful dialogues are sure to give the audience goosebumps. Let’s take a look at the standout lines that have left fans in awe.

Plot Overview: “Devara” is set in the backdrop of four villages near the fictional Erra Samudram region, where Devara (played by Jr NTR) stands as a protector for his village. Bhaira (Saif Ali Khan), the antagonist, rules another village and often clashes with Devara. Together with the remaining villages, Bhaira and Devara carry out maritime raids on ships. However, as a series of dramatic events unfold, Devara finds himself at odds with Bhaira.

The story takes deeper turns, questioning Devara’s motives, the reasons behind his conflict with Bhaira, and how Devara’s son, Vara (also Jr NTR), comes into play. The film also focuses on the love story between Vara and Thangam (played by Janhvi Kapoor).

Devara Movie Dialogues (English)

When Police Officer Ajay comes and threatens Baira about doing a job on the Red Sea…

Baira (Saif Ali Khan) Intro Dialogue:

“Erra samudram kadiki vachi raktham gurinchi matlaaduthunnava… naaku chaavu gurinchi chebutunnava?”

After Ajay escapes and goes to Prakash Raj…

Prakash Raj Dialogue: “Konda meeda kochi bhayapeduthamanukunnava?”

Ajay (Police): “Evadraa nuvvu?”

Prakash Raj: “Singappa… nuvvu digivachina konda meeda thoopudu dikkuna untanu.”

Ajay: “Nenu ikkada ko panimedha vachanu. Peddayanavi, mee vallu ki oka maata cheppi oppinchagalava?”

(Devara Movie Dialogues)

While traveling on a boat over the sea…

When Ajay jumps into the sea for his diamond ring and gets scared seeing the treasure cages underwater, Prakash Raj’s dialogue stands out.

Prakash Raj: “Vajrapu ungara dorikinda? Samudram lo neeku kanachina dani bhayam tho vajram gurtuku raaledu! Ee bhayame neelanti vallu entha mandi vachina, entha aasha choopinachina, ikkada unnollu ee samudram joli ki matrame raaru.”

Prakash Raj’s dialogue about Devara’s intro is whistle-worthy for fans.

Ajay: “Kallu moosina, terisina samudram lo choosindhe kanipisthundi. Asalu evaru vallantha? Evaru chesaru idhantha?”

Prakash Raj: “Chala pedda katha saami, raktham tho samudrame errapekkina katha.”

Ajay: “Evari katha?”

Prakash Raj: “Padi padi leche samudram meeda padakunda nilabadi unnavaadi katha… maa Devara katha.”

“Bhayam povalante devudi katha vinalaa… bhayam ante enti teliyalante Devara katha vinalaa…!”

“Kulam ledu, matham ledu, bhayam ledu vari ki telisindhi dhairyame.”

Devara… in the scene where he tells his son Varun about his father…

Vara (Young Jr. NTR): “Abba… eppudu mee nanna kathalu, valla nanna kathalu chebutuntav! Maa nanna katha cheppu, Devara katha cheppu naaku!”

Devara: “Tharuvatha taraniki cheppukunetanta kathalu kaavura… mee nayanavi. Maa nayanollavi desam kosam poraadina veerula kathalu. Maavi… evariki cheppukoleni cheekati kathalu, batikunname kaani, bhavitharalaku kathalu ga cheppukuneela ee batukulu maruthaya leda maaku teliyadu.”

Some more dialogues from the movie…

“Devara adaginda ante cheppinadu ani.”

(Devara Movie Dialogues)

In the scene where Devara first confronts the arms dealers, the dialogues are powerful.

Devara: “Maa ayudha lekke lo kuda ayudhallu unnayanantav.”

“Maa ayudhallu manchini chedu nundi kapadatanki puttay… mee ayudhallu manchini champataniki puttay.”

Villain: “Maatalu ekkuva avuthunnayi… samudram ekkala? Samudram elaala?”

When NTR says a superb dialogue after Kond in Devara’s gang turns against them.

Devara: “Chese pani tappani telisinappati ki mana avasaram kosam chesthunnav annukunnanu… ippudu ade alavatu ga maari tappu panulu mana raktham lo inkipoyani ippude ardham avutundi.”

“Manishi ki batike antha dhairyam chaalu… champe antha dhairyam kaadu. Kaaddu ani meeru malli aa dhairyani kudagadithe.. aa dhairyani champaye bhayanni avutaa…!”

“Devara adaginda ante… cheppinadu ani
Ade cheppinadu ante”… BGM

Before the interval bang, there’s an action sequence where Devara kills everyone who came to attack him. The sea turns red with the blood of those Devara killed.
Prakash Raj’s dialogue while narrating Devara’s flashback is also powerful.

“Dhairyam thappa emi teliyani kallalo… modati sari bhayam poralu kammukunnayi.”

“Dhairyam ekkuvai tappu panulu chestunna… manoole kada maata chebuthe maarutharu annukunna…”

“Kaani bhayam ante emitto teliyani mrigaluga maaripoyaru ani arthamai undadi…”

“Me kallamundu unte bhagavantudiki, bhootaniki kuda bhayapadaru.”

“Anduke ee roju nunchi vallalu ekkuva dooramga vellipoyi… kanarani bhayani aitaha.”

“Bhayam marichi eppudaina tappu panikosam sandram ekkite… sandram odduna itta pandabedutaa…!”

Saif Ali Khan’s dialogues are also powerful.

“Devarani champalante saraina samayame kaadu… saraina ayudham kuda dorakalaa.”

Janhvi Kapoor Dialogues:

Tanga (Janhvi Kapoor) says a dialogue about Varun’s (NTR) cowardice.

“Vadiki valla ayya roopam vachindi kaani, raktham raale… eppudu choodu pillatanam, pirikitanam vaaditho ettalage.”

“Naa magani amada dooram nunchi choosina… lopala nunchi pongala… uppongala.”

The dialogue Janhvi says when her friends mention that Varun killed a shark and brought back ‘Var’ is funny.

“Undhe vadilo… undhe aadilo…!
Naaku telsu… entappati nunchu choostundaga…
Undhe vadilo.”

The dialogue Janhvi says when she sees NTR is also hilarious.

“Aa aa aada aada… veerudileka aa nadaka choodu…!”

“Lopala pongi uppongutandi… lopala.”

The romantic conversation between NTR and Janhvi Kapoor when they meet for the first time is sweet.

Tanga (Janhvi Kapoor): “Endi itla vachinav?”

Varun (NTR): “Rayappa (Srikanth) tho pani undi vachina.”

Tanga: “Abbo appude maa ayya to maatladedaka poiyinava?”

“Ieroju naaku oopiri aagipoyeela undi.
Naa veerudu ayudha pooja ku siddhamayundha?”

When the villain (Saif Ali Khan) insults young NTR after winning by drugging him at the weapon pooja, the dialogue Rayappa (Srikanth) delivers is powerful.

Rayappa: “Emi jaraganatlu andaru antha marchipothe manchidi Baira…
Vallu aadhu kalipina matthu manduke padinarante… podduna kallaa matthu digala…
Kaani, vallu mancham kuda digala…
Aayudha pooja lo meeru vaadi kantlo berukune choosundaru…
Kaani nenu vaadi debbalo odhupu choosina!
Devara lekka balanni choosina…
Vaadi balam vaadiki kuda teliyaka, ila andarini matthulo pettukuni gelavaalanukovatam vaadi pasitanam…
Kaani oka rakamga mee andariki, ade manchidi…
Samudram meeda oka Devara unnadu chaalu…
Konda meeda inkoka Devarani tayaru cheste adi meeke manchidi kaadu Baira.”

Tanga (Janhvi Kapoor’s dialogue):

“Naavalla kaavatla, andariki matthu mandu ichi gelavadam aente.
Akka, naa mogudante… samudra ala anta uhinchukunna nenu.
Vademo… oddiku chere pilla ala madiri unnadu.”

Tanga’s friend consoles her with a funny dialogue:

“Anni telisina dani cheputanaa vinnu.”

“Prathi aadadani… nachinodu okaduntadu
Vachinodu inkoduntadu
Vachinodilo nachinovadini choosi
Deepam arpesukuni kapuram chesukunte
Batuku safe ga saagipothadi.”

Devara Climax Dialogues

In the climax, Prakash Raj’s dialogue about Devara to his wife gives goosebumps.

“Nee penimiti andarini vadili petti appudo poiyanadu thalli…
Devara manalini vidichi petti appudo chanipoyadu…
Inni Yelluga andarini samudram paina tappu cheyakunda bhayapeditundhi…
Nee penimiti Devara kaadu… nee bidda Vara
Chinnappati nunchi Devara cheppina kathalu vintu perigi undadhemo…
Ee kondani batikinchatanki pedda kathani raasinadu nee bidda…
Aa mrigala mayalo padi gorrepillala poyadani annukunava?
Kaadu thalli, vadini addupettukuni vellina vallu gorre pillalu…
Samudram lo eepatiki mrigani vetadinattu vetaduthuntadu nee bidda

DEVARA MOVIE DAILOGUES In TELUGU

పోలీస్ ఆఫిసర్ అజయ్ వచ్చి ఎర్ర సముద్రంపై ఓ పనిచేసి పెట్టాలి అని బైరాను బెదిరించినప్పుడు..


బైరా(సైఫ్ అలీ ఖాన్) డైలాగ్:

“ఎర్ర సముద్రం కాడికి వచ్చి రక్తం గురించి మాట్లాడుతుండావా.. నాకు చావు గురించి చెబుతుండావా”

అక్కడి నుంచి తప్పించుకున్న అజయ్, ప్రకాశ్ రాజ్ దగ్గరికి వెళ్లినప్పుడూ…

ప్రకాశ్ రాజ్ డైలాగ్: కొండ మీదకొచ్చి భయపెడుదామనుకున్నావా

అజయ్(పోలీస్) : ఎవడ్రా నువ్వు

ప్రకాశ్ రాజ్: సింగప్పా.. నువు దిగివచ్చిన కొండ మీద తూర్పు దిక్కున ఉంటాను

అజయ్: నేను ఇక్కడికో పనిమీద వచ్చాను. పెద్దాయనవి, మీ వాళ్లకు ఓ మాట చెప్పి ఒప్పించగలవా..!

(Devara Movie Dialogues)

సముద్రంపై పడవలో వెళ్తున్న సమయంలో వచ్చే డైలాగ్స్…

అజయ్ తన డైమండ్ ఉంగరం కోసం సముద్రంలో దూకి.. లోపల ఆస్తి పంజరాలు చూసి భయపడినప్పుడు.. ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్ బాగుటుంది.

ప్రకాశ్ రాజ్: “వజ్రపు ఉంగరం దొరికిందా? సముద్రంలో నీకు కానొచ్చిన దాని భయంతో వజ్రం గుర్తుకు రాలే.! ఈ భయమే నీలాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా, ఎంత ఆశ చూపినా, ఇక్కడ ఉన్నవాళ్లు ఈ సముద్రం జోలికి మాత్రం రారు.”

ప్రకాశ్ రాజ్ దేవర ఇంట్రో గురించి చెప్పే డైలాగ్ ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయిస్తుంది.

అజయ్: కళ్లు మూసినా, తెరిసినా సముద్రంలో చూసిందే కనిపిస్తోంది. అసలు ఎవరు వాళ్లంతా.. ఎవరు చేశారు ఇదంతా?

ప్రకాశ్ రాజ్: “చాలా పెద్ద కథ సామీ, రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ

అజయ్: ఎవరీ కథ

ప్రకాశ్ రాజ్: పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ.. మా దేవర కథ.

భయం పోవాలంటే దేవుడి కథ వినాలా.. భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా..!

”కులం లేదు, మతం లేదు, భయం లేదు వారికి తెలిసింది ధైర్యమే”

దేవర… తన కొడుకు వరంకు తన తండ్రి గురించే చెప్పే సందర్భంలోని డైలాగ్స్‌ కూడా బాగుంటాయి.

(Devara Movie Dialogues)

వరం(యంగ్ ఎన్టీఆర్): అబ్బా ఎప్పుడూ మీ నాన్న కథలు, వాళ్ల నాన్న కథలు చెబుతుంటావ్..! మా నాన్న కథ చెప్పు దేవర కథ చెప్పు నాకు!

దేవర: తరువాత తరానికి చెప్పుకునేటంత కథలు కావురా.. మీ నాయనవి. మా నాయనోళ్లవి దేశం కోసం పోరాడిన వీరుల కథలు. మావీ.. ఎవ్వరికీ చెప్పుకోలేని చీకటి కథలు, బతికున్నామే గాని, భావితరాలకు కథలుగా చెప్పుకునేలా ఈ బతుకులు మారుతాయో లేదో మాకుడా తెలియదు.

సినిమాలో మరికొన్ని డైలాగ్‌లు

“దేవర అడిగినాడంటే చెప్పినాడని”

దేవర తొలిసారి ఆయుధ వ్యాపారులకు ఎదురు తిరిగిన సందర్భంలో వచ్చే సీన్‌లో డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి.

(Devara Movie Dailogues)

దేవర: మా ఆయుధాల లెక్కే ఇందులో కూడా ఆయుధాలు ఉన్నాయంటావ్

“మా ఆయుధాలు మంచిని చెడు నుంచి కాపాడటానికి పుట్టాయ్.. మీ ఆయుధాలు మంచిని చంపడానికి పుట్టాయ్..”

విలన్: మాటలు ఎక్కువ అవుతున్నాయ్.. సముద్రం ఎక్కాలా.. సముద్రం ఎలాలా?

దేవర గ్యాంగ్‌లోని కొండ ఎదురు తిరిగినప్పుడు ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ సూపర్బ్‌గా ఉంటుంది.

దేవర: “చేసే పని తప్పని తెలిసినా మన అవసరం కోసం చేస్తున్నావ్ అనుకున్నా.. ఇప్పుడు అదే అలవాటుగా మారి తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయాయని ఇప్పుడే అర్ధం అవుతా ఉండాది.

“మనిషికి బతికేంత ధైర్యం చాలు.. చంపేంత ధైర్యం కాదు”. కాదు కూడదు అని మీరు మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే..ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా..!

“దేవర అడిగినాడంటే.. సెప్పినాడని
అదే సెప్పినాడంటే”…
BGM

(Devara Movie Dialogues)

ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందు ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. తన మీద దాడికి వచ్చిన వారందర్ని దేవర చంపేస్తాడు. సముద్రం దేవర చంపిన వ్యక్తుల రక్తంతో ఎర్రగా మారుతుంది.
దేవర ప్లాష్‌బ్యాక్ చెబుతున్న ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్ కూడా పవర్ ఫుల్‌గా ఉంటుంది.

“ధైర్యం తప్ప ఏమి తెలియని కళ్లల్లో.. మొదటి సారి భయం పొరలు కమ్ముకుంది.

ధైర్యం ఎక్కువై తప్పుడు పనులు చేస్తున్నా.. మనోళ్లే కదా మాట చెబితే మారుతారు అనుకున్నా..

కానీ భయం అంటే ఏమిటో తెలియని మృగాలుగా మారిపోయారు అని అర్థమై ఉండాది..

మీ కళ్లముందు ఉంటే భగవంతుడికి, భూతానికి కూడా భయపడరు

అందుకే ఈరోజు నుంచి వాళ్లలెక్క మీ నుండి దూరంగా వెళ్లిపోయి.. కానరాని భయాన్ని అయితా..

భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పనికోసం సంద్రం ఎక్కితే… సంద్రం ఒడ్డున ఇట్టా పండబెడుతా..!”

అలాగే సైఫ్ అలి ఖాన్ డైలాగ్స్ కూడా పవర్‌పుల్‌గా ఉంటాయి.

“దేవరను చంపాలంటే సరైనా సమయమే కాదు… సరైన ఆయుధం కూడా దొరకాలా..

(Devara Movie Dialogues)

జాన్వీ కపూర్ డైలాగ్స్

తంగా(జాన్వీకపూర్) వరం(ఎన్టీఆర్) పిరికితనం గురించి చెప్పే డైలాగ్

“వాడికి వాళ్ల అయ్య రూపం వచ్చింది కాని, రక్తం రాలే.. ఎప్పుడు చూడు పిల్లతనం, పిరికితనం వాడితో ఎట్టాగే,,

నా మగాన్ని ఆమడ దూరం నుంచి చూసినా.. లోపల నుంచి పొంగాలా.. ఉప్పొంగాలా..

సొరచెపను చంపి ‘వర’ తీసుకొచ్చాడని ఫ్రెండ్స్ చెప్పినప్పుడు.. తంగం చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది.

“ఉందే వాడిలో .. ఉందే ఆడిలో..!
నాకు తెలుసూ..ఇంతప్పటి నుంచి చూస్తుండాగా..
ఉందే వాడిలో..

ఎన్టీఆర్‌ను చూసి జాన్వీ కపూర్ చెప్పే డైలాగ్‌ కూడా హెలేరియస్‌గా ఉంటుంది.

ఆఆ ఆడా ఆడా.. వీరుడిలెక్క ఆ నడక చూడూ…

లోపల పొంగి ఉప్పొంగుతాందే..
లోపల

ఎన్టీఆర్, జాన్వీకపూర్ తొలిసారి ఒకరికొకరు ఎదురు పడినప్పుడు వారి మధ్య సాగే సంభాషణ రొమాంటిక్‌గా ఉంటుంది.

తంగం(జాన్వీకపూర్): ఏంది ఇట్లా వచ్చినవ్

వర(ఎన్టీఆర్): రాయప్ప(శ్రీకాంత్)తో పని ఉండి వచ్చినా

తంగం: అబ్బో అప్పుడే మా అయ్యతో మాట్లాడేదాక పోయినావా

ఈరోజు నాకు ఊపిరి ఆగిపోయేలా ఉంది.
నా వీరుడు ఆయుధ పూజకు సిద్ధమవుతున్నాడా

ఆయుధ పూజలో మత్తు మందు ఇచ్చి గెలిచిన యంగ్ ఎన్టీఆర్‌ను తక్కువ చేసి విలన్(సైఫ్ అలీ ఖాన్) మాట్లాడినప్పుడు రాయప్ప(శ్రీకాంత్) చెప్పే డైలాగ్ పవర్‌పుల్‌గా ఉంటుంది.

రాయప్ప: ఏమి జరగనట్లు అందరూ అంతా మరచిపోతే మంచిది బైరా..
వాళ్లు ఆడు కలిపిన మత్తు మందుకే పడినారంటే.. పొద్దునకళ్లా మత్తు దిగాలా..
కానీ, వాళ్లు మంచం కూడా దిగలా..
ఆయుధ పూజలో మీరు వాడి కంట్లో బెరుకునే చూసుండారు..
కానీ నేను వాడి దెబ్బలో ఒడుపు చూసినా!
దేవర లెక్క బలాన్ని చూసినా
వాడి బలం వాడికి కూడా తెలియక, ఇలా అందర్ని మత్తులో పెట్టి గెలవాలనుకోవడం వాడి పసితనం
కానీ ఓ రకంగా మీ అందరికీ, అదే మంచిది
సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలు
కొండ మీద ఇంకో దేవరను తయారు చేస్తే అది మీకే మంచిది కాదు భైరా

తంగం (జాన్వీ కపూర్ డైలాగ్స్)

“నావళ్ల కావట్లా, అందరికీ మత్తు మందు ఇచ్చి గెలవడం ఏంటే.
అక్కా, నా మొగుడంటే..సముద్ర అల అంతా ఊహించుకున్నా నేను
వాడేమో.. ఒడ్డుకు చేరే పిల్ల అల మాదిరి ఉన్నాడు”

తంగం స్నేహితురాలు ఓదార్చుతూ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది

అన్ని తెలిసిన దాన్ని చెబుతానా విను

“ప్రతి ఆడదానికి… నచ్చినోడు ఒకడుంటాడు
వచ్చినోడు ఇంకోడుంటాడు
వచ్చినోడిలో నచ్చినవాడిని చూసుకుని
దీపం ఆర్పేసుకుని కాపురం చేసుకుంటే
బతుకు సాఫీగా సాగిపోతది”

Devara Climax Dialogues

క్లైమాక్స్‌లో దేవర గురించి అతని భార్యకు ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

నీ పెనిమిటి అందర్ని వదిలిపెట్టి ఎప్పుడో పొయినాడు తల్లి
దేవర మనల్ని విడిచిపెట్టి ఎప్పుడో చనిపోయాడు
ఇన్నేళ్లుగా అందర్ని సముద్రంపై తప్పు చేయకుండా భయపెడతా ఉంది
నీ పెనిమిటి దేవర కాదు..నీ బిడ్డ వర
చిన్నప్పటి నుంచి దేవర చెప్పిన కథలు వింటూ పెరిగి ఉండాడేమో..
ఈ కొండను బతికించడానికి పెద్ద కథను రాసినాడు నీ బిడ్డ
ఆ మృగాల మాయలోపడి గొర్రె పిల్లాల పోయాడు అనుకున్నావా
కాదు తల్లి, వాడిని అడ్డుపెట్టుకుని వెళ్లిన వాళ్లు గొర్రెపిల్లలు
సముద్రంలో ఈపాటికి మృగాన్ని వెటాడినట్లు వెటాడుతుంటాడు నీ బిడ్డ!

Recent Movie Kalki 2898 AD Dailogues


Leave a comment